పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
రికార్డ్ స్థాయి ముడి చమురు శుద్ధి ఉత్పత్తులను సాధించిన నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్
Posted On:
03 APR 2023 2:48PM by PIB Hyderabad
నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఎల్), ఎఫ్‌వై2022-23లో, దాని సామర్థ్యం 3.0 Mఎంటీలుకి మించి రికార్డ్ స్థాయిలో 3.093 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) ముడి చమురు ఉత్పత్తుల శుద్ధిని నమోదు చేసింది. దీంతో పాటు, 87.6% డిస్టిలేట్ ఈల్డ్‌ను కూడా సాధించింది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం. ₹6,615 కోట్ల మూలధన వ్యయం ద్వారా ఈ ఘనతను ఎన్‌ఆర్‌ఎల్ సాధించింది, ఇది కూడా రికార్డ్ స్థాయి. ఎఫ్‌వై2021-22లోని గత రికార్డు అయిన ₹3,605 కోట్లను ఇప్పుడు అధిగమించింది.
ఆదర్శప్రాయ పనితీరును లాభాల వృద్ధి రూపంలోకి మార్చిన ఈ కంపెనీ, ఎఫ్‌వై2022-23ని సానుకూలంగా ముగించింది. ఎంఎస్, హెచ్‌ఎస్‌డీ, మైనం వంటి ప్రధాన రిఫైనరీ ఉత్పత్తులు వరుసగా 662.4 ఎంటీలు, 2,134.8 ఎంటీలు, 47.7 ఎంటీలతో అత్యధిక ఉత్పత్తి గణాంకాలను చూశాయి. ఎల్పీజీ బాట్లింగ్ కూడా రికార్డ్ స్థాయిలో 65.9 టీఎంటీలుగా ఉంది.
2023 మార్చి 18న, భారత్-బంగ్లాదేశ్ ప్రధానమంత్రుల ద్వారా భారత్-బంగ్లాదేశ్ మిత్రత్వ పైప్‌లైన్‌ను విజయవంతంగా ప్రారంభించడం ఆ ఆర్థిక సంవత్సరంలో మరొక ముఖ్యమైన విషయం. HSDని రవాణా చేయడానికి పశ్చిమ బంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎల్ సిలిగురి మార్కెటింగ్ టెర్మినల్ నుంచి బంగ్లాదేశ్‌లోని పర్బతిపూర్ వరకు 132 కి.మీ. పైప్‌లైన్‌ను నిర్మించారు.
ఈ శుద్ధి కర్మాగారం, తన సామర్థ్యాన్ని 3 ఎంఎంటీపీఏ నుంచి 9 ఎంఎంటీపీఏకి పెంచడానికి సామర్థ్య విస్తరణ ప్రణాళికలో ఉంది. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌లో ముడి చమురు దిగుమతి టెర్మినల్ ఏర్పాటు, పారాదీప్ నుంచి నుమాలిగర్ వరకు 1,640 కి.మీ. ముడి చమురు పైప్‌లైన్ వేయడం కూడా ఇందులో భాగం. దీంతో పాటు, ఒక జేవీ కంపెనీ ద్వారా వెదురు బయోమాస్‌ను ముడి పదార్థంగా ఉపయోగించుకుంటూ, నుమాలిగర్ వద్ద మొట్టమొదటి జీవ శుద్ధి కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఈ జీవ శుద్ధి కర్మాగారం 2023 చివరి నాటికి ప్రారంభమవుతుందని, 49,000 టన్నుల ఇథనాల్, ఇతర రసాయనాలను ఉత్పత్తి చేస్తుందని అంచనా. 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపాలన్న దేశ లక్ష్యాన్ని సాధించడంలో ఇది తోడ్పడుతుంది.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురి, తన ట్వీట్ల ద్వారా, ఈశాన్య భారతదేశానికి చెందిన ఈ పీఎస్‌యూ విశిష్ట పనితీరును ప్రశంసించారు.
*****
(Release ID: 1913561)
Visitor Counter : 134