జల శక్తి మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవ దశలో భాగంగా కొత్త గృహాలలో టాయిలెట్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు
Posted On:
03 APR 2023 5:09PM by PIB Hyderabad
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకాన్ని 2014 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే కుటుంబాలన్నిటికీ టాయిలెట్ల ఏర్పాటు ద్వారా మహాత్మా గాంధీ 150వ జయంతి 2019 అక్టోబర్ 2వ తేదీ నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో బహిరంగ మల విసర్జన (ఓ డి ఎఫ్)ను అంతం చేయాలన్నది లక్ష్యం. 2019 అక్టోబర్ 2వ తేదీన అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. తొలిదశలో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల లక్ష్యాన్ని సాధించినందువల్ల 1 ఏప్రిల్ 2020 నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవ దశను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఐదేళ్లు అమలులో ఉంటుంది. మొదటి దశలో సాధించిన లక్ష్యాలను నిలబెట్టుకోవాలన్నది రెండవ దశ ప్రారంభించడంలో ఉద్దేశం. మరియు అన్ని గ్రామంలో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం అంటే 2024-25 నాటికి ఓ డి ఎఫ్ గ్రామాలను ఓ డి ఎఫ్ ప్లస్ గా మార్చడం.
ఇంకా మరుగుదొడ్లు నిర్మించని ఇళ్ళు మరియు కొత్త ఇళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవ దశలో ఇళ్లయందు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నియమం పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) అనేది అవసరాన్ని బట్టి చేపట్టే స్కీము. అందువల్ల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అయితే స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవదశ కాలంలో ప్రతి ఏటా దాదాపు 30 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమవుతాయని అంచనా.
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) అనేది డిమాండుకు అనుగుణంగా చేపట్టే కార్యక్రమం కావడంవల్ల సంవత్సరాల వారీగా నిర్దిష్టంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలు ఏమీ పెట్టుకోలేదు. 2014-15 నుంచి 2019-20 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) మొదటి దశలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు సమగ్ర యాజమాన్య సమాచార వ్యవస్థ (ఐ ఎం ఐ ఎస్)లో పొందుపరచిన వివరాల ప్రకారం సంవత్సరాల వారీగా నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలు దిగువ ఇవ్వడం జరిగింది.
ఆర్ధిక సంవత్సరం ఇళ్లలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల సంఖ్య
2014-15 56,64,911
2015-16 1,21,92,316
2016-17 2,11,72,522
2017-18 2,86,61,777
2018-19 2,35,15,140
2019-20 1,18,94,031
మొత్తం 10,31,00,697
కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోమవారం రాజ్యసభకు ఈ సమాచారం లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
****
(Release ID: 1913560)