నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గాంధీనగర్ లో జి20- ఇంధన పరివర్తన వర్కింగ్ గ్రూప్ సమావేశం


అక్షయ వనరుల వైవిధ్యం మరియు కీలక ఖనిజాల సరఫరా శృంఖలపై జి-20 వేదిక వద్ద ఉపసమావేశం

Posted On: 02 APR 2023 7:28PM by PIB Hyderabad

 

జి20 దేశాల బృందానికి ఇండియా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో  జరుగుతున్న ఇంధన పరివర్తన వర్కింగ్ గ్రూప్ రెండవ సమావేశంలో భాగంగా భారత ప్రభుత్వ  కొత్త మరియు అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ,  గనుల మంత్రిత్వ శాఖ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారిక ఉప సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. .  గుజరాత్ లోని గాంధీనగర్ లో  ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇతివృత్తం  'అక్షయ వనరుల వైవిధ్యం  మరియు  కీలక ఖనిజాల సరఫరా శృంఖల'. ఈ సమావేశానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) ,  ఇంధన, పర్యావరణ మరియు జల మండలి మద్దతిస్తున్నాయి. అక్షయ ఇంధనం సంపాదన, వైవిధ్యం చేయడం మరియు  ఇంధన పరివర్తన కోసం కీలక ఖనిజాల సరఫరా శృంఖల ఏర్పాటు మరియు వర్తులత్వము ప్రోత్సహించడంపై ఈ సమావేశంలో దృష్టిని కేంద్రీకరిస్తారు.

      కొత్త మరియు అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ  భూపిందర్ సింగ్ భల్లా మరియు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్  ప్రారంభోపన్యాసాలు చేస్తారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ  రంగంలో, పరిశ్రమలో, విద్వత్సంబంధ,  విధాన నిర్ణయ నిపుణులు పాల్గొంటున్న ఈ సమావేశంలో     'ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధమైన ఇంధన పరివర్తన కోసం ప్రతిఘాతుక అక్షయ ఇంధన సరఫరా శృంఖల అభివృద్ధి' మరియు 'కీలక ఖనిజాల సరఫరా శృంఖలలో దుర్బలతను ఎదుర్కోవడం' పై రెండు నివేదికలను విడుదల చేస్తారు.   కొత్త మరియు అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి దినేష్ జగ్దాలే, గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి. వీణాకుమారి ముగింపు ఉపన్యాసం చేస్తారు.

 

****


(Release ID: 1913558) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi