రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పెరుగుతున్న ఆత్మనిర్భరత: 2022-23 లో రక్షణ ఎగుమతులు ఎన్నడూ లేనంతగా సుమారు రూ.16,000 కోట్ల గరిష్టానికి చేరుకున్నాయి; ఇది 2016-17తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ; 85 దేశాలకు ఎగుమతి చేస్తున్న భారత్


'మేక్ ఇన్ ఇండియా' పట్ల భారతదేశ ప్రతిభకు, ఉత్సాహానికి ఇది స్పష్టమైన నిదర్శనమని అభివర్ణించిన ప్రధాన మంత్రి

భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ l హబ్ గా మార్చే ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తూనే ఉంటుంది: శ్రీ నరేంద్ర మోదీ

ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ ఎగుమతుల పెరుగుదల కొనసాగుతుంది: రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్

Posted On: 01 APR 2023 6:06PM by PIB Hyderabad

ప్రభుత్వ స్థిరమైన విధాన చొరవలు, రక్షణ పరిశ్రమ అపారమైన సహకారం ద్వారా, భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతుల్లో ఒక అద్భుతమైన మైలురాయిని సాధించింది. ఎగుమతులు రూ.16,000 కోట్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు రూ.3,000 కోట్లు ఎక్కువ. 2016-17 నుంచి ఇది 10 రెట్లు పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

 

(రూ కోట్లలో )

 

ఆర్థిక సంవత్సరం

మొత్తం ఎగుమతుల విలువ

2016-17

1,521

2017-18

4,682

2018-19

10,745

2019-20

9,115

2020-21

8,434

2021-22

12,814

2022-23

15,920

 

భారత్ ఇప్పుడు 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం 100 సంస్థలు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండటంతో భారత పరిశ్రమ తన డిజైన్, అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. పెరుగుతున్న రక్షణ ఎగుమతులు ,ఏరో ఇండియా 2023 లో 104 దేశాల భాగస్వామ్యం భారతదేశ పెరుగుతున్న రక్షణ తయారీ సామర్థ్యాలకు నిదర్శనం.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో, ఈ విజయం భారతదేశ ప్రతిభకు, 'మేక్ ఇన్ ఇండియా' పట్ల ఉత్సాహానికి స్పష్టమైన నిదర్శనమని అభివర్ణించారు.

‘‘గత కొన్నేళ్లుగా ఈ రంగంలో సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఇది తెలియజేస్తోంది. భారత్ ను రక్షణ ఉత్పత్తుల తయారీ హబ్ గా మార్చే ప్రయత్నాలకు  ప్రభుత్వం అండగా ఉంటుంది ‘‘ అని మోదీ పేర్కొన్నారు.

 

రికార్డు స్థాయిలో రక్షణ ఎగుమతులు జరగడం దేశం సాధించిన గొప్ప విజయమని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో రక్షణ ఎగుమతులు ఇంకా గణనీయంగా

పెరుగుతాయని ఆయన ట్వీట్ చేశారు.

 

సుమారు ఎనిమిదేళ్ల క్రితం దిగుమతిదారుగా పేరొందిన భారతదేశం నేడు డోర్నియర్ -228, 155 ఎంఎం అడ్వాన్స్ డ్ టోవెడ్ ఆర్టిలరీ గన్స్ (ఎటిఎజి), బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, రాడార్లు, సిమ్యులేటర్లు, మైన్ రక్షిత వాహనాలు, సాయుధ వాహనాలు, పినాకా రాకెట్లు - లాంచర్లు, మందుగుండు సామగ్రి, థర్మల్ ఇమేజర్లు, బాడీ ఆర్మర్స్, వ్యవస్థలు, లైన్ రీప్లేసబుల్ యూనిట్లు ,ఏవియానిక్స్ ,స్మాల్ ఆర్మ్స్ భాగాలు , విడి భాగాలను ఎగుమతి చేస్తోంది. ఎల్ సిఏ-తేజస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఎంఆర్ ఒ కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.

 

రక్షణ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గత ఐదారేళ్లుగా అనేక విధానపరమైన కార్యక్రమాలు చేపట్టి సంస్కరణలు తీసుకువచ్చింది. ఎగుమతి విధానాలను సరళీకృతం చేసి, ఎండ్-టు-ఎండ్ ఆన్ లైన్ ఎగుమతి ఆథరైజేషన్ తో పరిశ్రమ హితంగా మార్చారు. జాప్యాన్ని తగ్గించారు. ఇంకా సులభతర వ్యాపారాన్ని తీసుకువచ్చారు.

భాగాలు విడి భాగాల ఎగుమతి/ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ/ ప్రధాన ప్లాట్ ఫామ్ లు , పరికరాల ఎగుమతి కోసం ప్రభుత్వం మూడు ఓపెన్ జనరల్ ఎక్స్ పోర్ట్ లైసెన్స్ (ఒ జి ఇ ఎల్ )  ను నోటిఫై చేసింది. ఒజిఇఎల్ అనేది వన్-టైమ్ ఎక్స్ పోర్ట్ లైసెన్స్, ఒజిఇఎల్ చెల్లుబాటు సమయంలో ఎగుమతి అనుమతి కోరకుండా ఇది నిర్దిష్ట వస్తువులను నిర్దిష్ట గమ్యస్థానాలకు ఎగుమతి చేయడానికి పరిశ్రమను అనుమతిస్తుంది.

 

వివిధ దేశాల నుండి అందుకున్న ఎగుమతి లీడ్ లు రిజిస్టర్డ్ ఇండియన్ డిఫెన్స్ ఎగుమతిదారులకు రియల్ టైమ్ ప్రాతిపదికన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా వ్యాప్తి చేయబడతాయి, తద్వారా వారు ఎగుమతి అవకాశాలకు ప్రతిస్పందించ గలుగుతారు. భారతీయ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, భారతీయ పరిశ్రమలను సులభతరం చేయడానికి విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీ అసోసియేషన్ ల భాగస్వామ్యంతో మిత్ర దేశాల (ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ - ఎఫ్ఎఫ్ సి) ) తో 40కి పైగా వెబినార్లు నిర్వహించారు.

 

*****



(Release ID: 1913079) Visitor Counter : 356


Read this release in: English , Urdu , Hindi