గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యూనిటీ క‌ప్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్న‌మెంట్ 2023

Posted On: 01 APR 2023 3:28PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ ప్రాయోజిత ఫిట్ ఇండియా ఉద్య‌మంలో భాగంగా  సంఘ‌టిత భావాన్ని ప్రోత్స‌హించేందుకు హెచ్‌యుడిసిఒ, ఎన్‌బిసిసిలు సంయుక్తంగా కొత్త ఢిల్లీలోని సిరి ఫోర్ట్స్ స‌ముదాయంలో 01 ఏప్రిల్ 2023న యూనిటీ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించాయి. ఎంఒహెచ్‌యుఎ, సిపిడ‌బ్ల్యుడి, ఎన్‌బిసిసి & హెచ్‌యుడిసిఒల నుంచి వ‌చ్చిన మెగా టీమ్‌ల మ‌ధ్య ప్రారంభ‌మైన ఈ టోర్న‌మెంట్‌ను ఎంఒహెచ్‌యుఎ కార్య‌ద‌ర్శి శ్రీ మ‌నోజ్ జోషి ప్రారంభించారు. ఎంఒహెచ్‌యుఎ & సిపిడ‌బ్ల్యుడిల మ‌ధ్య జ‌రిగిన ప్రారంభ మ్యాచ్‌తో ఉత్తేజ‌క‌ర‌మైన సిరీస్ ప్రారంభ‌మైంది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎంఒహెచ్‌యుఎ 20 ప‌రుగుల‌తో ఎన్‌బిసిసిపై ఫైన‌ల్ లో విజ‌యాన్ని సాధించింది. ఎంఒహెచ్‌యుఎ బృందం త‌ర‌ఫున ఎస్‌హెచ్‌. మ‌నోజ్ జోషీ గెలుచుకున్న ట్రోఫీని అందుకున్నారు. 
ఆట పూర్తి అయిన త‌ర్వాత మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డును ఎంఒహెచ్‌యుఎ కు చెందిన ఎస్‌హెచ్ మ‌ణీంద‌ర్ కు ప్ర‌దానం చేశారు. మంత్రిత్వ శాఖ‌, ఇందులో పాల్గొన్న పిఎస్‌యుల త‌రుఫున వ‌చ్చిన అధికారులు సిబ్బంది త‌మ‌త‌మ టీంలు ఒక‌రితో ఒక‌రు అత్యంత ఉత్సాహంతో సంఘ‌టిత స్ఫూర్తితో పోటీ ప‌డి ఆడ‌టాన్ని చూసి ఎంతో ఆనందించారు. వారి క‌ర‌తాళ‌ధ్వ‌నులు, కేక‌ల‌తో సిరీ ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లిక్స్‌ ద‌ద్ద‌రిల్లింది. త‌మ టీం స‌భ్యుల‌కు ఉత్స‌హాన్ని, స్ఫూర్తిని ఇచ్చేందుకు ఆయా పిఎస్‌యుల‌కు చెందిన సిఎండిలు కూడా ఈ మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు విచ్చేశారు. 

 

***
.


(Release ID: 1912867) Visitor Counter : 188


Read this release in: English , Urdu , Hindi , Tamil