సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కొత్త ఉపాధి కల్పన

Posted On: 29 MAR 2023 4:52PM by PIB Hyderabad

ఉపాధి కల్పనతో పాటు ఉపాధి పొందే అర్హత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు తీసుకుంది.  కేంద్రప్రభుత్వం వ్యాపారాలకు ఉత్తేజం కల్పించేందుకు, కోవిడ్ 19 ప్రతికూల ప్రభావాలను తొలగించేందుకు ఆత్మనిర్భర్  భారత్ ప్యాకేజిని ప్రకటించింది. ఈ ప్యాకేజి కింద ప్రభుత్వం రూ.27 లక్షలు పైగా ఆర్థిక ఉద్దీపనలను అందిస్తోంది. దేశాన్ని స్వయం-సమృద్ధంగా నిలిపేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్యాకేజిలో పలు దీర్ఘకాలిక పథకాలు/కార్యక్రమాలు/విధానాలు ఉన్నాయి. 25-01-2023 నాటికి  ఈ పథకాల ద్వారా 60.26 లక్షల మంది లబ్ధిపొందారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించి 5 సంవత్సరాల పాటు అమలులో ఉండేలా రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పిఎల్ఐ) పథకాలు అమలుపరుస్తోంది. వీటి ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.

ఆర్థిక వృద్ధికి, సుస్థిర అభివృద్ధికి లక్ష్యాలుగా ప్రవేశపెట్టిన పెద్ద కార్యక్రమం పిఎం గతిశక్తికి దిశను మార్చగల సామర్థ్యం ఉంది. రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, పోర్టులు, మాస్  రవాణా, జల మార్గాలు, లాజిస్టిక్స్  మౌలిక వసతులు వంటి ఏడు ఇంజన్లు దీనికి చోదకశక్తులుగా ఉన్నాయి. స్వచ్ఛ ఇంధనాలు, సబ్  కా ప్రయాస్  శక్తితో నడుస్తున్న ఈ కార్యక్రమం భారీ సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతో పాటు ఎంటర్  ప్రెన్యూర్  షిప్ అవకాశాలు కూడా పెరుగుతాయి.  ప్రధానమంత్రి  ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఇజిపి), మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్), పండిట్  దీన్  దయాళ్  ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియు-జికెవై), దీన్  దయాళ్ అంత్యోదయ యోజన –జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం (డిఏవై-ఎన్  యుఎల్ఎం) వంటి విభిన్న పథకాల కింద అధిక పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాలతో నడిచే పలు ప్రాజెక్టులను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటితో పాటుగా కేంద్రప్రభుత్వ నిర్వహణలోని మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, అందరికీ ఇల్లు వంటి ప్రధాన పథకాలు కూడా అమలులో ఉన్నాయి. ఉపాధి అవకాశాల కల్పన కూడా ఈ పథకాల లక్ష్యం.

అన్ని మంత్రిత్వ శాఖలు/కేంద్రప్రభుత్వ శాఖలు/ డిపార్ట్  మెంట్లు/ కేంద్రప్రభుత్వ సంస్థలు (సిపిఎస్  యు) / స్వతంత్ర సంస్థల్లోని   ఖాళీల భర్తీ కోసం ఉద్యమ స్ఫూర్తితో రోజ్  గార్ మేళాలు కూడా నిర్వహిస్తున్నారు. యువతను సాధికారం చేయడం ద్వారా జాతీయాభివృద్ధిలో ప్రత్యక్షంగా వారిని భాగస్వాములను చేయడానికి ఈ ఉపాధి మేళాలు కీలకంగా నిలుస్తాయి.

సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల శాఖల సహాయమంత్రి;  ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి డాక్టర్  జితేంద్ర సింగ్ లోక్ సభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

***



(Release ID: 1912545) Visitor Counter : 112


Read this release in: English , Urdu