రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ కింద భారత సైన్యం కోసం మెరుగైన ఆకాష్ ఆయుధ వ్యవస్థతో పాటు ఆయుధాలను గుర్తించే 12 రాడార్లు స్వాతి (విమానాలు) కోసం 9,100 కోట్ల రూపాయలకు పైగా కాంట్రాక్టులను కుదుర్చుకున్న - రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
30 MAR 2023 7:28PM by PIB Hyderabad
రక్షణ విషయంలో 'ఆత్మ నిర్భరత' కు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ, భారత సైన్యం కోసం మెరుగైన ఆకాష్ ఆయుధ వ్యవస్థతో పాటు ఆయుధాలను గుర్తించే 12 రాడార్లు, డబ్ల్యూ.ఎల్.ఆర్. స్వాతి (విమానాలు) 9,100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, 2023 మార్చి, 30వ తేదీన ఒప్పందాలపై సంతకం చేసింది.
మెరుగైన ఆకాష్ ఆయుధ వ్యవస్థ
ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ లోని 3వ, 4వ రెజిమెంట్ల కోసం లైవ్ మిస్సైల్స్, లాంచర్లతో కూడిన అప్ గ్రేడ్‌లు, క్షేత్రస్థాయి సహాయ పరికరాలు, వాహనాలు, ఇతర మౌలిక సదుపాయాలతో సహా 8,160 కోట్ల రూపాయలకు పైగా విలువైన, మెరుగైన ఆకాష్ ఆయుధ వ్యవస్థ (ఏ.డబ్ల్యూ.) కొనుగోలు కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏ.డబ్ల్యూ.ఎస్. అనేది స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి వాయు క్షిపణి (ఎస్.ఆర్.ఎస్.ఏ.ఎం) వైమానిక రక్షణ వ్యవస్థ, ఇది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) దేశీంగా రూపొందించబడి, అభివృద్ధి చేయబడింది. వైమానిక బెదిరింపులను సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు, ఉత్తర సరిహద్దులో భారత సైన్యం కోసం ఏ.డబ్ల్యూ.ఎస్. కు చెందిన రెండు అదనపు రెజిమెంట్లను అప్‌గ్రేడేషన్ తో సేకరించడం జరుగుతోంది. మెరుగైన ఏ.డబ్ల్యూ.ఎస్. లో సీకర్ టెక్నాలజీ, తగ్గిన ఫుట్ ప్రింట్, 360° ఎంగేజ్‌మెంట్ సామర్థ్యంతో పాటు, మెరుగైన పర్యావరణ ఆంక్షలు కూడా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు, ప్రధానంగా, భారతీయ క్షిపణి తయారీ పరిశ్రమతో పాటు, స్వదేశీ రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థకు ఊతం ఇస్తుంది. ప్రాజెక్టు లో మొత్తం దేశీయ పరిజ్ఞానం ప్రస్తుతం 82 శాతం మేర ఉండగా, 2026-27 నాటికి ఇది 93 శాతానికి పెంచడం జరుగుతుంది.
మెరుగైన ఏ.డబ్ల్యూ.ఎస్. ని భారత సైన్యంలోకి చేర్చడం వల్ల స్వల్ప శ్రేణి క్షిపణి సామర్థ్యంలో భారతదేశ స్వావలంబన పెరుగుతుంది. విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఇతర దేశాలకు వెళ్లకుండా చేయడం, భారతదేశంలో ఉపాధి మార్గాలను పెంచడం, విడిభాగాల తయారీ ద్వారా భారతీయ ఎం.ఎస్.ఎం.ఈ. లను ప్రోత్సహించడం, తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థను పెంచడంలో ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆయుధ వ్యవస్థ కు చెందిన సరఫరా విధానాన్ని నిర్వహించడంలో ఎం.ఎస్.ఎం.ఈ. లతో సహా ప్రైవేట్ పరిశ్రమకు ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 60 శాతం ఇవ్వబడుతుంది, తద్వారా పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది.
ఆయుధాలను గుర్తించే రాడార్లు స్వాతి (విమానాలు)
990 కోట్ల వ్యయంతో డబ్ల్యూ.ఎల్.ఆర్.స్వాతి (విమానాలు) కొనుగోలు కోసం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (బీ.ఈ.ఎల్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది దేశీంగా రూపొందించబడిన ఈ డబ్ల్యూ.ఎల్.ఆర్. కు తుపాకులు, మోర్టార్లు, రాకెట్‌లను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, తద్వారా సొంత మందుగుండు సామగ్రి వనరులతో ఎదురు కాల్పుల ద్వారా శత్రువుల విధ్వంసాన్ని సులభతరం చేస్తుంది. ఇది శత్రువుల నుండి ఎటువంటి జోక్యం లేకుండా వారి కార్యాచరణ పనులను నిర్వహించడానికి, శత్రువుల కాల్పుల నుండి వారికి భద్రతను అందిస్తుంది. వీటి ఏర్పాటును 24 నెలల్లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు రక్షణ పరిశ్రమకు తన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఒక పెద్ద అవకాశం, రక్షణలో 'ఆత్మ నిర్భరత' లక్ష్యాన్ని సాధించే దిశలో ఇది ఒక అడుగు అవుతుంది.
*****
(Release ID: 1912493)
Visitor Counter : 253