పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిలిగురిలో ఏర్పాటు చేసిన రెండ‌వ ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశానికి హాజ‌రుకానున్న 130 మంది ప్ర‌తినిధులు ఓడిఓపి జాబితా వ‌స్తువుల‌నుంచి ఎంపిక చేసిన జ్ఞాపిక‌ల‌ను ప్ర‌తినిధుల‌కు బ‌హుక‌రించ‌డంద్వారా ప‌శ్చిమ బెంగాల్ స్థానిక ఉత్ప‌త్తుల‌కు ప్రోత్సాహం ఇస్తున్న ప‌ర్యాట‌క‌శాఖ‌ స్థానిక క‌ళ‌లప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికిగాను డూ ఇట్ యువ‌ర్ సెల్ఫ్ పేరుతో కార్య‌క్ర‌మాలు

Posted On: 30 MAR 2023 9:01PM by PIB Hyderabad

సిలిగురిలో నిర్వ‌హిస్త‌న్న రెండ‌వ ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశానికి సంబంధించిన వివ‌రాల‌ను వెళ్లడించ‌డానికిగాను జి 20 ఇండియా ప్ర‌ధాన స‌మ‌న్వ‌య‌క‌ర్త శ్రీ హ‌ర్ష వర్ధ‌న్ షింగ్లా, ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అరవింద్ సింగ్ క‌లిసి సంయుక్తంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన జి20 ప్ర‌ధాన స‌మ‌న్వ‌య‌క‌ర్త శ్రీ హ‌ర్ష వ‌ర్ధ‌న్ షింగ్లా జి 20 ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశ ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. దీనిద్వారా ప‌ర్యాట‌క‌ప్రాంతాల అభివృద్ధి జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ స‌మావేశ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్ల గురించి రాష్ట్ర‌, స్థానిక ప్ర‌భుత్వాలు అందిస్తున్న స‌హ‌కారం గురించి కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అర‌వింద్ సింగ్ వివ‌రించారు. 
హిమాలయ ప‌ర్వ‌త పాదాల చెంత‌న వున్న ప్ర‌ముఖ్య ప‌ర్యాట‌క కేంద్రం డార్జలింగ్. సిలిగురితోపాటు ఈ రెండు ప్రాంతాల‌ను రెండ‌వ ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశానికి ఆతిథ్యం ఇచ్చే ప్ర‌దేశాలుగా ఎంపిక చేసుకోవ‌డం జ‌రిగింది. ఈ స‌మావేశం ఏప్రిల్ 1నుంచి 3వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. 
ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వ స‌హాయ స‌హ‌కారాల‌తో కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ ఈ రెండ‌వ ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తోంది. ఈ స‌మావేశానికి జి 20 స‌భ్య‌దేశాల‌కు చెందిన 130 మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు. అంత‌ర్జాతీయ సంస్థ‌లు, పారిశ్రామిసంస్థ‌ల భాగ‌స్వాములు, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, స్థానిక ప‌ర్యాట‌క రంగానికి చెందిన‌వారు దీనిలో పాల్గొంటున్నారు. 
కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి, కేంద్ర మైనారిటీ వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి శ్రీ జాన్ బార్లా ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు. 
డార్జ‌లింగ్ అనగానే మ‌నంద‌రికీ గుర్తుకొచ్చేది డార్జ‌లింగ్ టీ. ఇది 2004లో మొద‌టి జిఐ ట్యాగ్ పొందిన ఉత్ప‌త్తి. తేనీరు సేవ‌నంతోపాటు రాత్రిపూట చంద్రుని వెలుగుల్లో తేయాకుల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. కుర్సియాంగ్ లోని మ‌కాయ్ బారి టీ ఎస్టేట్ లో ఈ కార్య‌క్ర‌మం వుంటుంది. 
డార్జ‌లింగ్ లోని డార్జ‌లింగ్ హిమాల‌య‌న్ రైల్వే ( డిహెచ్ ఆర్) కు 1999 సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 5న యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ ప్ర‌దేశంగా గుర్తింపు పొందింది. ఇక్క‌డ ప్ర‌తినిధుల‌కు టాయ్ ట్రెయిన్ రైడ్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత ఎత్తులో వున్న రైల్వే స్టేష‌న్ గుమ్ లో ఈ కార్య‌క్ర‌మం వుంటుంది. బ‌తాసియాలూప్ నుంచి డార్జ‌లింగ్ స్టేష‌న్ దాకా ప్ర‌యాణ కార్య‌క్ర‌మం వుంటుంది. 
ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ వేస‌వి విడిదిగా పేరొందిన డార్జ‌లింగ్ రాజ్ భ‌వ‌న్ లో విందు స‌మావేశం నిర్వ‌హిస్తారు. 
ఈ స‌మావేశానికి హాజ‌ర‌వుతున్న ప్ర‌తినిధుల‌కోసం ప‌లు ర‌కాల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. బాల్ పాట‌లు, గిరిజ‌న నృత్యాలు, సంప్ర‌దాయా త‌ప్పా నృత్యం, త‌మాంగ్ జాన‌ప‌ద నృత్యం, చాహు నృత్యం, భార‌త సైనికుల పైప్ బ్యాండ్ మొద‌లైన ప‌లు ర‌కాల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలుంటాయి. 
ఆయుష్ మంత్రిత్వ‌శాఖ స‌మ‌న్వ‌యంతో ప్ర‌త్యేక యోగా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు.
స్థానిక క‌ళ‌ల్ని, క‌ళారంగ ఉత్ప‌త్తుల్ని ఈ సమావేశ ప్ర‌తినిధుల‌కు ప‌రిచ‌యం చేయ‌డం జ‌రుగుతుంది. కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్ర‌త్యేకంగా షాపులు నెల‌కొల్పుతారు. ప్ర‌తినిదులు స్వ‌యంగా పాల్గొని ఆయా క‌ళాఖండాల త‌యారీ అనుభ‌వాన్ని పొందుతారు. దీనికోసం డూ ఇట్ యువ‌ర్ సెల్ఫ్‌..మీకై మీరు త‌యారు చేయండి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. డార్జ‌లింగ్ లోని హిమాల‌యా ప‌ర్వ‌తారోహ‌ణ కేంద్రం త‌మ సామ‌గ్రిని ప్ర‌ద‌ర్శిస్తుంది. 
ఈ స‌మావేశానికి వ‌స్తున్న‌ప్ర‌తినిధుల‌కు ఓడిఓపి జాబితానుంచి ఎంపిక చేసిన జ్ఞాపిక‌ల‌ను అందించ‌డం జ‌రుగుతుంది. ఇందులో బుర్ధ్వాన్ జిల్లాకు చెందిన వుడ‌న్ వూల్‌, బంకూరా జిల్లాకు చెంది డోక్రా జిఐ హ‌క్కు ఫిష్‌, మాల్డా జిల్లాకు చెందిన బంగ్లాశ్రీ సిల్క్ ప్యాకెట్ స్వ్కేర్ మొద‌లైన‌వి వున్నాయి. 
ఈ మ‌ధ్యకాలంలో సాహ‌సోపేత కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన పర్యాట‌క విభాగానికి ఇంటా బైటా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దేశీయ ప‌ర్యాట‌కుల‌తోపాటు విదేశీ ప‌ర్యాట‌కులు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో దీనికి సంబంధించి కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. దీన్ని సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న‌లో భాగంగా దీన్ని రూపొందించారు. ఈ రంగానికి సంబంధించిన ప‌లువురు నిపుణులు త‌మ అనుభ‌వాల‌ను పంచుకుంటారు. అడ్వెంచ‌ర్ టూరిజంకు సంబంధించిన అంత‌ర్జాతీయ‌, దేశీయ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తారు. 
జి20కి భార‌త‌దేశం అధ్య‌క్ష‌స్థానంలో వుంది. దీనిపైన ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికిగాను ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 3నుంచి 5వ‌ర‌కు వుంటుంది. అడ్వెంచ‌ర్ టూరిజం కింద సుస్థిర అభివృద్ధి విధానాల‌ను వివ‌రిస్తారు. సిలిగురినుంచి ఏప్రిల్ 2న హిమాల‌య‌న్ డ్రైవ్ కార్ ర్యాలీని నిర్వ‌హిస్తున్నారు. 
గుజ‌రాత్ లోని రాన్ ఆఫ్ క‌ఛ్ లో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 7నుంచి 9వ‌ర‌కూ టూరిజం వ‌ర్కింగ్ గ్రూప్ మొద‌టి స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఇందులో ప‌ర్యావ‌ర‌ణ హిత పర్యాట‌కం, డిజిట‌లీక‌ర‌ణ‌, నైపుణ్యాలు, ప‌ర్యాట‌క‌రంగ ఎంఎస్ ఎం ఈలు, ప‌ర్యాట‌క కేంద్ర నిర్వ‌హ‌ణ మొద‌లైన ఐదు అంశాలను చ‌ర్చించారు. వాటికి జి20 స‌భ్య‌దేశాల ప్ర‌తినిధులు సంఘీభావం ప‌లికారు. రెండ‌వ ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశంలో ఐదు ప్రాధాన్య‌త అంశాల‌పైన చ‌ర్చ‌లుంటాయి. విస్తృతంగా చ‌ర్చిస్తారు. త‌ద్వారా ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ అవుట్ క‌మ్ డాక్యుమెంటును రూపొందిస్తారు. ప‌ర్యాట‌క రంగంలో సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న రోడ్డుమ్యాపును కార్యాచ‌ర‌ణ విధానాన్ని త‌యారు చేస్తారు. ఈ సమావేశాల్లో ట్రావెల్ ఫ‌ర్ లైఫ్ కార్య‌క్ర‌మాన్ని ప‌రిచ‌యం చేస్తారు. మాన‌వత కేంద్ర ప్ర‌పంచీక‌ర‌ణ సాధ‌న‌కోసం గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాని దార్శ‌నిక‌త ప్ర‌కారం ఈ రంగంలో నూత‌న విధానాల‌కోసం ప‌ర్యాట‌క వ‌ర్కింగ్ గ్రూప్ ప‌ని చేస్తోంది. 
జి20 అధ్య‌క్ష‌స్థానంలో వున్న భార‌త‌దేశం దేశ‌వ్యాప్తంగా 59 న‌గ‌రాల్లో 200 స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్నారు. భార‌త‌దేశ భౌగోళిక‌, అమూల్య‌మైన సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ఈ న‌గ‌రాలు చాటుతున్నాయి కాబ‌ట్టే వీటిని ఎంపిక చేశారు. 

 

*****


(Release ID: 1912457)
Read this release in: English , Urdu , Hindi