విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కేరళలోని కుమరకోమ్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రచర్‌పై 2వ జీ20 షెర్పా మీటింగ్ సైడ్ ఈవెంట్
Posted On:
30 MAR 2023 6:27PM by PIB Hyderabad
అభివృద్ధి ఫలితాలను మెరుగుపరచడంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) కీలక పాత్ర మరియు గత దశాబ్దంలో డిపీఐని అమలు చేయడంలో భారతదేశ అపారమైన అనుభవంపై జీ20 2వ షెర్పా మొదటి రోజు సమావేశం చర్చించింది. నాస్కామ్, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బిఎంజీఎఫ్) మరియు డిజిటల్ ఇంపాక్ట్ అలయన్స్ (డిఐఎఎల్) భాగస్వామ్యంతో జీ20 సెక్రటేరియట్ సైడ్ ఈవెంట్‌ని నిర్వహించింది.
భారతదేశానికి చెందిన జీ20 షెర్పా అమితాబ్ కాంత్‌తో పాటు నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, షెర్పాలు మరియు G20 సభ్యులు, ఆహ్వానించబడిన దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమక్షంలో డిపిఐ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించారు. భారతదేశ డిపిఐ విజయ గాథను ప్రదర్శిస్తూ డిజిటల్ గుర్తింపు, ఆర్థిక చేరిక మరియు విద్య మరియు అందరికీ ఆరోగ్యం వంటి కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం అభివృద్ధి చేసిన కీలకమైన డిపిఐలను డిజిటల్ ఇండియా ఎక్స్‌పీరియన్స్ జోన్ హైలైట్ చేసింది. ఆధార్, కో-విన్,యూపీఐ, డిజిలాకర్,భాషిణి వంటి భారతదేశ స్టాక్‌కు చెందిన డిపిఐలు ఎక్స్‌పీరియన్స్ జోన్‌లో ప్రదర్శించబడ్డాయి.అలాగే గూగుల్,మైక్రోసాఫ్ట్,పేటీఎం,ఫ్రాక్టాబూ,ఏడబ్ల్యూఎస్ మరియు టిసిఎస్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇందులో ప్రదర్శించబడ్డాయి.డిపిఐ ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించింది.
భారతదేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రారంభ ప్రసంగంతో సైడ్ ఈవెంట్ ప్రారంభమైంది. ప్రజా సేవలను సమర్థవంతంగా పొందుపరచడంలో డిపిఐ కీలక పాత్రను ఆయన వివరించారు. డిజిటల్ డొమైన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం సాధించిన విజయాలు మరియు భారీ పురోగతిని ఆయన నొక్కిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో డిపిఐల స్వీకరణ సంభావ్య ప్రయోజనాన్ని హైలైట్ చేశారు. ఓపెన్ స్టాండర్డ్స్, ఓపెన్ ఏపిఐ మరియు ఇంటర్‌ఆపెరాబిలిటీని భారతదేశ డిపిఐ యొక్క ముఖ్య లక్షణాలుగా షెర్పా కాంత్ నొక్కిచెప్పారు.
డిపిఐల ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతపై 'వై డిపిఐ?' అనే ప్రత్యేక సెషన్‌తో ఈవెంట్ ప్రారంభమైంది. ఆ తర్వాత మూడు సెషన్‌లు (1) 'ప్రజలు మరియు సమాజ శ్రేయస్సు కోసం డిపిఐ ఎలా పంపిణీ చేస్తుంది', (2) 'ప్రపంచంలో డిపిఐ సందర్భం - వివిధ దేశాలు డిపిఐలు మరియు కీలక అభ్యాసాలను ఎలా చేరుకుంటున్నాయి' మరియు (3) 'స్కేలింగ్ డిపిఐ: ఛాలెంజెస్ & అవకాశాలు' అనే అంశాలపై జరిగాయి.
(ఎ)'డిపిఐ ఫైనాన్సింగ్ గ్యాప్‌పై ప్రదర్శన'ని అందించడానికి రెండు స్పాట్‌లైట్ సెషన్‌లు కూడా జరిగాయి; మరియు (బి) 'డిపిఐ స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌కు ఎలా ఇంధనం ఇస్తోంది - ఇన్వెస్టర్ + ఫౌండర్'.
“వై డిపిఐ?” అనే అంశంపై ప్రత్యేక సెషన్ ప్రముఖ గ్లోబల్ లీడర్‌లు నందన్ నీలేకని, ఇన్ఫోసిస్ బోర్డు సహ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్, యూరోపియన్ యూనియన్ అంతర్గత మార్కెట్ కమిషనర్ థియరీ బ్రెట్టన్ వర్చువల్ సందేశాలతో ప్రారంభమయింది.జీ20 ప్రెసిడెన్సీ సమయంలో డిపిఐల ప్రయోజనం మరియు భారతదేశ ప్రతిష్టాత్మక డిపిఐ ఎజెండాపై ఆయన ప్రసంగించారు. ఈ ప్రత్యేక ప్రసంగంలో యూఎస్‌ఏలోని డిజిటల్ ఇంపాక్ట్ అలయన్స్, వాషింగ్టన్ డిసీ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియా వోహ్రా మరియు మాజీ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆధార్ మరియు ఇండియా స్టాక్, సిటీఓ ఎక్‌స్టెప్ ఫౌండేషన్ శ్రీ ప్రమోద్ వర్మలు విభిన్న రంగాలు మరియు దాని నిర్మాణ మరియు ఆర్థిక అంశాలలో డిపిఐల పాత్ర గురించి సంయుక్తంగా వివరించారు.
అనంతరం "డిపిఐలు: డెలివరింగ్ ఫర్ పీపుల్, ప్లాంట్ అండ్ ప్రోస్పెరిటీ" అనే అంశంపై థీమాటిక్ సెషన్ సిద్ధార్థ్ తివారీ, ఫెలో, చతం హౌస్, లండన్ ఆధ్వర్యంలో ప్యానలిస్టుల భాగస్వామ్యంతో జరిగింది: అనంత్ మహేశ్వరి, ప్రెసిడెంట్ మైక్రోసాఫ్ట్ ఇండియా; జీన్-ఫిల్బర్ట్ న్సెంగిమన, డయల్ & ఆఫ్రికా సిడిసి; కాన్స్టాంటిన్ పెరిక్, డిప్యూటీ డైరెక్టర్, పేదల కోసం ఆర్థిక సేవలు,బిఎంజీఎఫ్; పద్మజ రూపారెల్, వ్యవస్థాపక భాగస్వామి, ఐఏఎన్ ఫండ్ మరియు పీటర్ రాబ్లీ, ప్లేస్ ఫండ్ ఇందులో పాల్గొన్నారు. ఆరోగ్యం, విద్య, ఆహార భద్రత మరియు వాతావరణ అనుకూలతను ప్రభావితం చేసే సమయంలో డ్రైవింగ్ పోటీ, మార్కెట్లు, ఆవిష్కరణలు మరియు చేరికలలో డిపిఐల పాత్ర గురించి ప్యానలిస్టులు చర్చించారు.
“డిపిఐ ఇన్ ది గ్లోబల్ కాంటెక్స్ట్ - వివిధ దేశాలు డిపిఐలను మరియు కీలక అభ్యాసాలను ఎలా చేరుకుంటున్నాయి” అనే శీర్షికతో జరిగిన రెండవ సెషన్‌ను సిటిఓ ఎక్‌స్టెప్ ఫౌండేషన్ మాజీ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆధార్ మరియు ఇండియా స్టాక్ ప్రమోద్ వర్మ మోడరేట్ చేసారు. ఈ సెషన్‌లోని ప్యానలిస్టులలో భారతదేశ సిఈఓ ఎన్‌పిసిఐ దిలీప్ అస్బే ఉన్నారు; ఈ చర్చలో జోనాథన్ మార్స్కెల్, డిజిటల్ గుర్తింపు, ప్రపంచ బ్యాంకు; డయానా సాంగ్, అసోసియేట్ డైరెక్టర్, స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్స్ & పార్టనర్‌షిప్స్, యూఎన్ ఫౌండేషన్‌లో డిజిటల్ ఇంపాక్ట్ అలయన్స్; కీజోమ్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్, యూఎన్‌డిపి మరియు బిజోర్న్ రిక్టర్, డిజిటల్ ప్రోగ్రామింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, జీఐజడ్ హెడ్ పాల్గొన్నారు.డిపిఐ అప్లికేషన్ ముఖ్య ప్రపంచ ఉదాహరణలను మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఈ సెషన్‌లో ఓపెన్ టెక్నాలజీ స్టాండర్డ్స్ మరియు డిపిఐని ఉపయోగించడం ద్వారా సంక్షోభ పరిస్థితుల్లో స్థితిస్థాపకత, భారీ ఆవిష్కరణ సామర్థ్యం మరియు పరివర్తనాత్మక సామాజిక మరియు ఆర్థిక ప్రభావాన్ని
నిర్ధారించడంలో డిపిఐల ప్రాముఖ్యత ఈ సెషన్‌లో వివరంగా చర్చించబడింది.
పెద్ద ఎత్తున అభివృద్ధి లాభాల కోసం డిపిఐలను సమర్ధవంతంగా పెంచే అంశంపై మూడవ సెషన్ దృష్టి సారించింది. సెషన్‌లో రోడ్జర్ వూర్హీస్, గ్లోబల్ ప్రెసిడెంట్, గ్లోబల్ గ్రోత్ & ఆపర్చునిటీస్,బిఎంజీఎఫ్ చైర్ మరియు యుఐడిఏఐ సిఈఓ సౌరభ్ గార్గ్; అభిషేక్ సింగ్, సిఈఓ, డిజిటల్ ఇండియా కార్పొరేషన్,ఎన్‌ఇజీడి అండ్ మైగవ్; టేకి అక్యూట్ ఇహ్, ఆఫ్రికా డిజిటల్ రైట్స్ హబ్‌లో ఫౌండర్ & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్; కే మెక్‌గోవన్, పాలసీ & అడ్వకేసీ, డిజిటల్ ఇంపాక్ట్ అలయన్స్ సీనియర్ డైరెక్టర్; మరియు అంబరీష్ కెంఘే, వైస్ ప్రెసిడెంట్, గూగుల్‌పే ప్యానెలిస్ట్‌లుగా ఉన్నారు. ట్రస్ట్, యాక్సెసిబిలిటీ, స్థోమత మరియు వినియోగదారు సమ్మతి వంటి సూత్రాల ఆధారంగా డిపిఐలను స్కేలింగ్ చేయడానికి పబ్లిక్-ప్రైవేట్ సహకార విధానం ఎలా అవసరమో వారు చర్చించారు.
సైడ్ ఈవెంట్‌లో రెండు స్పాట్‌లైట్ సెషన్‌లు ఉన్నాయి. మొదటి స్పాట్‌లైట్ సెషన్‌కు డిపిజీల చార్టర్ డైరెక్టర్, డిఐఏఎల్ డైరెక్టర్ క్రిస్సీ మార్టిన్ మీర్ నాయకత్వం వహించారు. సురక్షితమైన మరియు విశ్వసనీయమైన పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఫైనాన్సింగ్ చేయడం మరియు పోటీ మార్కెట్, ఆవిష్కరణ మరియు చేరిక కోసం పనిచేసే ఫౌండేషన్ డిపిఐని అభివృద్ధి చేయడానికి సంబంధించిన ఖర్చులపై ఒక ప్రదర్శనను అందించారు. రెండవ స్పాట్‌లైట్ సెషన్ స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో డిపిఐ పాత్రపై దృష్టి సారించింది. సెషన్‌కు నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ అధ్యక్షత వహించారు. ప్యానెలిస్ట్‌లలో మెలిస్సా ఫ్రాక్‌మాన్, ఇన్వెస్టర్, ఎంఫసిస్ వెంచర్స్; సుచరిత ముఖర్జీ, కాలిడోఫిన్,సిఈఓ & సహ వ్యవస్థాపకుడు; మరియు జతిన్ సింగ్, గ్రామ కవర్ వ్యవస్థాపకులు ఉన్నారు. ఫౌండేషన్ డిపిఐలలో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాలని ప్యానెల్ పిలుపునిచ్చింది మరియు దీర్ఘకాలిక ఆదాయ ఉత్పత్తికి ప్రారంభ పెట్టుబడులకు మించి నిరంతర ఫైనాన్సింగ్ అవసరాన్ని నొక్కి చెప్పింది.
జీ20 జాయింట్ సెక్రటరీ నాగరాజ్ నాయుడు ముగింపు ప్రసంగంతో సెషన్ ముగిసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంలో డిపిఐ కలిగి ఉన్న అద్భుతమైన వాగ్దానాన్ని ఆయన హైలైట్ చేశారు: నగదు బదిలీలు మరియు ఆహార పంపిణీ నుండి ఈ-కామర్స్ మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ యొక్క వినూత్న నమూనాలను అందించడంలో వాటి ప్రాముఖ్యతను వివరించారు.
గ్లోబల్ డిజిటల్ సెంటర్‌గా భారతదేశం అభివృద్ధి చెందడంతో సమగ్ర పబ్లిక్ టెక్నాలజీలను నిర్మించడంలో దాని నాయకత్వం దేశాన్ని శక్తివంతం చేయడమే కాకుండా సంబంధిత వ్యాపారాలు మరియు అవకాశాలను విస్తృతంగా తెరిచింది.డిపిఐ వ్యవస్థలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సేవల అర్థవంతమైన డెలివరీని ప్రారంభించడానికి మరియు పేదరికం తగ్గింపు, ఆర్థిక చేరిక, మహిళల ఆర్థిక సాధికారత మరియు వాతావరణ స్థితిస్థాపకతతో సహా అనేక ఎస్‌డిజీల సాధనకు పునాదిగా మారాయి.
భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ సమయంలో కీలకమైన ప్రాధాన్యతలలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి. ఇది డిజిటల్ ఎకానమీ, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కోసం గ్లోబల్ పార్టనర్‌షిప్‌తో సహా వివిధ వర్కింగ్ గ్రూప్‌లలో క్రాస్-కటింగ్ థీమ్‌ను ప్రతిబింబిస్తుంది.
జీ20 షెర్పా సమావేశ ప్లీనరీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. విదేశాంగ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి శ్రీ వి.మురళీధరన్ ఈ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తారు.
*******
(Release ID: 1912360)
Visitor Counter : 180