ఆర్థిక మంత్రిత్వ శాఖ
8.08% PLI GOI SPL భద్రత 2023
Posted On:
29 MAR 2023 6:27PM by PIB Hyderabad
పిఎల్ ఐ జిఓఐ ఎస్ పి ఎల్ సెక్యూరిటీ 2023కు సంబంధించిన బకాయి మొత్తాలను మార్చి 31, 2023న సమానంగా తిరిగి చెల్లించడం జరుగుతుంది. పైన చెప్పిన తేదీ తర్వాతనుంచి వడ్డీ అనేది లభించదదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రీపేమెంట్ రోజున సెలవు ప్రకటించినట్లయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం ఆ రాష్ట్రంలోని చెల్లింపు కార్యాలయాల ద్వారా ఆయా రుణాలు మునుపటి పని రోజున తిరిగి చెల్లించడం జరుగుతుంది.
కేంద్రప్రభుత్వ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ , 2007లోని ఉప నిబంధనలు 24 (2), 2493) ప్రకారం మెచూరటీ చెల్లింపులు, పేరు నమోదు చేసుకున్న ప్రభుత్వ సెక్యూరిటీదారునకు చేసే చెల్లింపులు అనుబంధ జనరల్ లెడ్జర్ రూపంలో చేస్తారు. లేదా చట్టబద్దమైన అనుబంధ జనరల్ లెడ్జర్ అకౌంట్ లేదా స్టాక్ సర్టిఫికెట్ రూపంలో చేస్తారు. నమోదుదారుని బ్యాంక్ అకౌంట్ వివరాలతో పే ఆర్డర్ ద్వారా చేస్తారు. లేదా నమోదుదారుని అకౌంట్ లోకి నేరుగా క్రెడిట్ చేస్తారు. ఎల్ట్రానిక్ పద్ధతులలో నిధుల స్వీకరణ కలిగిన అకౌంట్ కు క్రెడిట్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీలకు సంబంధించి చెల్లింపులు చేయడానికిగాను అసలైన సబ్ స్క్రయిబర్ లేదా వారి తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగిన నమోదుదారులు తమకు సంబంధించిన వివరాలను ముందుగానే అందించాలి.
బ్యాంకు అకౌంట్‌కు సంబంధించి అవసరమైన వివరాలు లేకపోతే ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులను తీసుకునే సౌకర్యం లేకపోతే చెప్పిన తేదీలోగా రుణాలను తిరిగి చెల్లించాలంటే నమోదుదారుల తమ సెక్యూరిటీలను ఆయా ప్రభుత్వ డెట్ ఆఫీసుల దగ్గర, ట్రెజరీ / సబ్ ట్రెజరీ కార్యాలయాలు, స్టేట్ బ్యాంక్ కార్యాలయాలదగ్గర ఇవ్వాలి.
డిఛార్జి విలువను అందుకోవడానికి సంబంధించిన విధాన పూర్తి వివరాలను పైన తెలియజేసిన చెల్లింపుల కార్యాలయాలదగ్గర లభిస్తాయి.
(Release ID: 1912256)
Visitor Counter : 151