సహకార మంత్రిత్వ శాఖ
సహకార సంఘాలకు జాతీయ డేటా బేస్
Posted On:
29 MAR 2023 5:36PM by PIB Hyderabad
వివిధ రంగాలకు చెందిన సహకార సంఘాలకు సమాచారాన్ని ఒకే చోట పొందే సౌలభ్యాన్ని అందించేందుకు నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సియుఐ- భారత జాతీయ సహకార యూనియన్)తో కలిసి జాతీయ సహకార డేటాబేస్ అందించే ప్రక్రియను సహకార మంత్రిత్వశాఖ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ సహకార ఫెడరేషన్లు, సంబంధిత సంస్థలు, ఇతర భాగస్వాములతో అనేక పర్యాయాల సంప్రదింపుల అనంతరం నిర్దేశిత రంగాలకు సంబంధించిన డేటా క్షేత్రాలను రూపొందించారు.డేటాబేస్ ను క్రమంతప్పకుండా తాజాపరచడం, ధ్రువీకరణ, నిర్వహణ, విస్తరణ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది.
జాతీయ సహకార డేటాబేస్‌ను దశలవారీగా పూర్తి చేస్తారు. ఫేజ్-1లో, మూడు రంగాలు అనగా, ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (పిఎసిఎస్)లు, పాడి, మత్స్య రంగాలలో పని చేస్తున్న 2.63 లక్షల ప్రాథమిక సహకార సంస్థల మ్యాపింగ్ ని పూర్తి చేయడం జరిగింది. డేటా బేస్‌ను జులై, 2023 నాటికి అన్ని రంగాలకు చెందిన సహకార సంస్థలకు విస్తరించాలని భావిస్తున్నారు. సహకార రంగానికి తగిన విధానాల ప్రణాళిక, సూత్రీకరణ & అమలులో వాటాదారులకు డేటా బేస్ సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
ఈ అంశాన్ని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1912055)
Visitor Counter : 178