సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జీ20 అవినీతి నిరోధక కార్యనిర్వహణ విభాగం
Posted On:
29 MAR 2023 4:50PM by PIB Hyderabad
2023లో జీ20 అవినీతి నిరోధక కార్యనిర్వహణ విభాగం (ఏసీడబ్ల్యూజీ) దృష్టి పెట్టిన అంశాల్లో అవినీతి నేరస్తుల కేసుల్లో అంతర్జాతీయ సహకారం ఒకటి.
ఈ కింది అంతర్జాతీయ సంస్థలు జీ20 ఏసీడబ్ల్యూజీ చర్చల్లో పాల్గొన్నాయి:-
(i) ఈజీఎంవోఎన్‌టీ గ్రూప్
(ii) ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)
(iii) ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ అకాడమీ (ఐఏసీఏ)
(iv) ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ లా ఆర్గనైజేషన్ (ఐడీఎల్‌వో)
(v) అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)
(vi) ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్)
(vii) ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (వోఈసీడీ)
(viii) యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్‌వోడీసీ)
(ix) ప్రపంచ బ్యాంకు
అవినీతి నేరస్తులపై చర్యల కోసం సంబంధిత కేసుల్లో అంతర్జాతీయ సహకారంతో పాటు, అవినీతిని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థలు, అధికారుల సమగ్రత, ప్రభావాన్ని పెంచడంపై జీ20 ఏసీడబ్ల్యూజీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగంలోని అవినీతిని ఎదుర్కోవడంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ పాత్రతో పాటు, అవినీతిలో స్త్రీ-పురుష గణాంకాలను కూడా జీ20 ఏసీడబ్ల్యూజీ వెలికితీస్తోంది.
కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని తెలిపారు.
****
(Release ID: 1912054)