భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిరంతరాయంగా స్వయంచాలక వాతావరణ కేంద్రాల పర్యవేక్షణ

Posted On: 29 MAR 2023 4:53PM by PIB Hyderabad

స్వయంచాలక వాతావరణ కేంద్రాలు (ఏడబ్ల్యుఎస్) సమాచార సేకరణ మరియు వాటి నాణ్యతను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పూణే సెంట్రల్ రిసీవింగ్ సర్వర్‌లు మరియు అన్ని ఐఎండీ రాష్ట్ర వాతావరణ కేంద్రాలలో నిరంతరాయంగా పర్యవేక్షించబడుతోంది. వాతావరణ పీడనం, గాలి ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత, వర్షపాతం, గాలి వేగం మరియు గాలి దిశలు తదితరాలకు చెందిన వాతావరణ పారామితుల కోసం సెన్సార్‌లతో కూడిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ (ఏడబ్ల్యుఎస్) అందిస్తాయి. నెట్‌వర్క్. సిస్టమ్ నుండి డేటా నాణ్యతను నిర్ధారించడానికి ఐఎండీ కార్యాలయాల వద్ద శిక్షణ పొందిన మానవశక్తి ద్వారా క్రమమైన వ్యవధిలో సర్వీసింగ్/సాధారణ నివారణ నిర్వహణ చేస్తుంటారు. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) మార్గదర్శకాల ప్రకారం నివారణ నిర్వహణ ఏడబ్ల్యుఎస్ సైట్‌లలో అవసరమైన ఎక్స్‌పోజర్ పరిస్థితులను నిర్ధారిస్తుంది. సాంకేతిక బృందం నివారణ నిర్వహణ/ సర్వీసింగ్ సమయంలో, సిస్టమ్ నుండి డేటా నాణ్యతను నిర్ధారించడానికి గాను అంతరాయం కలిగిస్తున్న గడ్డి కోత, సౌర ఫలకాలను శుభ్రపరచడం, పరికరాలు మరియు అబ్జర్వేటరీ సైట్ యొక్క సాధారణ నిర్వహణను నిర్వహిస్తుంచేపడుతున్నాయి. సెన్సార్లను క్రమాంకనం చేస్తున్నప్పుడు, వాతావరణ పారామితులు నివారణ నిర్వహణ/ సర్వీసింగ్ సమయంలో సెన్సార్‌ల ప్రయాణ ప్రమాణాలతో పోల్చబడతాయి. ఈ కేంద్రాల  యొక్క ఏదైనా సెన్సార్ యొక్క ఖచ్చితత్వం డబ్ల్యుఎంఓ ప్రమాణాల ప్రకారం పని చేయకపోతే, ఆయా సెన్సార్లన కొత్త సెన్సార్‌లతో భర్తీ చేయబడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర (స్వతంత్ర బాధ్యత) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****

 
 

(Release ID: 1912047)
Read this release in: English , Urdu , Telugu