గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ నిరుపేద యువతలో నైపుణ్యాల కల్పనలో పరిశ్రమను మరింతగా భాగస్వామిని చేసేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన (డిడియు-జికెవై) కింద "క్యాప్టివ్ ఎంప్లాయ్ మెంట్" కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


గ్రామీణ నిరుపేద యువతలో నైపుణ్యాల కల్పనలో పరిశ్రమను మరింతగా భాగస్వామిని చేసేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన (డిడియు-జికెవై) కింద "క్యాప్టివ్ ఎంప్లాయ్ మెంట్" కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్

డిడియు-జికెవై కార్యక్రమం కింద 31,000 మంది గ్రామీణ యువతకు తమ సొంత సంస్థల్లో లేదా అనుబంధ సంస్థల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఎంఓయుఫై సంతకాలు చేసిన 19 మంది క్యాప్టివ్ ఎంప్లాయర్లు

డిడియు-జికెవై కార్యక్రమం కింద ఉద్యోగం చేస్తూ శిక్షణ పొందిన 10 మందికి నియామక పత్రాల అందజేత
ప్రస్తుత ఉద్యోగ సమయంలో ప్రదర్శించిన ప్రతిభకు ఇద్దరు సభ్యులకు ప్రశంసా పత్రాల అందజేత

Posted On: 28 MAR 2023 9:56PM by PIB Hyderabad

దీన్  దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజనకు (డిడియు-జికెవై) అనుబంధంగా న్యూ ఢిల్లీలో ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ 19 మంది క్యాప్టివ్ ఎంప్లాయర్లను నియమించారు. ఈ క్యాప్టివ్  ఎంప్లాయర్లు గ్రామీణ యువతకు తమ కంపెనీలో లేదా అనుబంధ కంపెనీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ (పంచాయత్ రాజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి (గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహరం, ప్రభుత్వ పంపిణి), ఫగ్గాన్ సింగ్ కులస్తే (గ్రామీణాభివృద్ధి, ఉక్కు)  కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ గిరిరాజ్  సింగ్  మాట్లాడుతూ  ప్రపంచ నైపుణ్యాల రాజధాని అయ్యే సామర్థ్యం భారతదేశానికి ఉన్నదని;  ఎంఓఆర్ డి, క్యాప్టివ్  ఎంప్లాయర్ల మధ్య కుదిరిన ఎంఓయు ఈ దిశగా తొలి అడుగు అని అన్నారు. తొలి దశలో 31 వేల మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు 19 మంది క్యాప్టివ్  ఎంప్లాయర్లను తీసుకున్నామని చెప్పారు.

‘‘రాబోయే కాలంలో  ఈ విధానంలో లభించిన ఉద్యోగాల సంఖ్య 30,000 నుంచి 1,30,000కి పెరుగుతుందని మే విశ్వసిస్తున్నాం’’ అన్నారు.

ఈ క్యాప్టివ్  ఎంప్లాయర్  స్కీమ్  ఉద్యోగార్థులు, ఉద్యోగాలు అందించే వారి మధ్య గల వ్యత్యాసాన్ని పూడ్చుతుందని శ్రీ గిరిరాజ్  సింగ్  అన్నారు. స్కీమ్  ను మరింత సమర్థవంతం, మరింత ప్రయోజనకరం చేసేందుకు చేయాల్సిన మార్పులపై భాగస్వామ్య ఎంప్లాయర్లు సలహాలు ఇవ్వాలని మంత్రి పిలుపు ఇచ్చారు. సిఐఐ, ఫిక్కి, పిహెచ్  డి చాంబర్ ఆఫ్  కామర్స్, ఎంఎస్ఎంఇ అసోసియేషన్లతో మంత్రిత్వ శాఖ, రాష్ర్టాలు సమావేశాలు నిర్వహించాలని ఆయన నొక్కి చెప్పారు.

డిడియు-జికెవై కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భాగస్వామ్య ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు (పిఐఏ) గ్రామీణ యువతకు సహాయంగా నిలుస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా సాధికారం చేస్తున్నట్టు సహాయ మంత్రి శ్రీ కపిల్  మోరేశ్వర్  పాటిల్  చెప్పారు.  ఈ స్కీమ్  ప్రయోజనాల గురించి తద్వారా నిపుణులైన మానవ వనరుల అందుబాటు గురించి క్యాప్టివ్  ఎంప్లాయర్లు ఇతర పారిశ్రామిక భాగస్వాములకు తెలియచేసి వారు కూడా ఇందులో భాగస్వాములయ్యేలా కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.

ఇది కూడా ఒక ‘‘రోజ్  గార్  మేళా’’ అని, ఇందులో ఎంత మంది యువకులు పాల్గొంటే అంతగా స్కీమ్  పై వారి విశ్వాసం మరింతగా మెరుగుపడుతుందని ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సహాయమంత్రి శ్రీ ఫగ్గన్  సింగ్  కులస్తే చెప్పారు. ‘‘ఇది మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల, ఇదే వాస్తవ మేక్  ఇన్ ఇండియా’’ అన్నారు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ఒక విశిష్టమైన చొరవ ఈ క్యాప్టివ్ ఎంప్లాయ్  మెంట్  కార్యక్రమమని సహాయమంత్రి సాధ్వి నిరంజన్  జ్యోతి అన్నారు. ‘‘ప్రతీ వ్యక్తి ఒక అద్భుతమైన అవకాశాల గని. ఈ కార్యక్రమం మన యువతకు వారి సామర్థ్యాల గురించి గుర్తు చేసి వారిని ఆత్మ నిర్భరం (స్వయం-సమృద్ధం ) చేస్తుంది. పరిశ్రమకు అవసరం అయిన మానవ వనరుల వ్యత్యాసాన్ని తీర్చుతుంది’’ అని ఆమె అన్నారు.

డిడియు-జికెవై కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతకు జీవనోపాధి కల్పించడం కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్  డి) చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు 19 యాజమాన్యాలతో అవగాహన ఒప్పందాలపై (ఎంఓయు) కుదుర్చుకున్నారు.

ఎంపికైన క్యాప్టివ్  ఎంప్లాయర్లు తమ యాజమాన్యంలోని ఆతిథ్యం, దుస్తులు & టెక్స్  టైల్స్, తయారీ, ఐటి/ఐటిఇఎస్, టెలికాం, రిటైల్, విద్యుత్ రంగాల్లోని తమ కంపెనీల్లో గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం కింద 31,000 మంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ తాజా కార్యక్రమం ఉద్యోగార్థులకు పారిశ్రామిక అవసరాలకు దీటుగా సంబంధిత పిఐఏ వద్ద ఉద్యోగంలో ఉన్న తరహాలోనే శిక్షణ లభిస్తుంది.

ఇదే కార్యక్రమంలో ఇప్పటికే ఈ స్కీమ్  కింద శిక్షణ పొందిన 10 మంది ఎంపికైన సుశిక్షితులైన యువతకు నియామక పత్రాలు అందించారు.  ఈ అభ్యర్థులందరూ శిక్షణ ముగిసిన అనంతరం ఉద్యోగ స్థాయి శిక్షణ (ఓజెటి) పొందారు.

క్యాప్టివ్  ఎంప్లాయ్  మెంట్ గురించి :   

గ్రామీణ నిరుపేద యువతకు పారిశ్రామిక భాగస్వాముల అవసరాలకు దీటుగా ఉపాధి హామీతో కూడిన డిమాండు ఆధారి శిక్షణ అందించే ప్రత్యేక కార్యక్రమమే ‘‘క్యాప్టివ్   ఎంప్లాయ్  మెంట్’’. డిడియు-జికెవై కార్యక్రమంలో ఇదో కలికి తురాయి. అభ్యర్థులకు నెలకి రూ.10,000 సిటిసితో కనీసం ఆరు నెలల పాటు శిక్షణానంతర ప్లేస్  మెంట్  హామీ అందిస్తుంది. గ్రామీణ యువత ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు ఈ పథకం ఒక వరంగా నిలుస్తుంది. ఇది స్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు కూడా దోహదపడుతుంది.

డిడియు-జికెవై గురించి :

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహణలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (ఎన్ఆర్ఎల్ఎం) కింద ప్లేస్  మెంట్  అనుసంధానిత నైపుణ్యకల్పన కార్యక్రమమే దీన్  దయాళ్  ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియు-జికెవై). భారత ప్రభుత్వ ఎంఓఆర్ జి నిధులందించే ఈ కార్యక్రమాన్ని 2014 సెప్టెంబరు 25వ తేదీన ప్రారంభించారు. ఇది పూర్తిగా గ్రామీణ యువత అవసరాలు తీర్చే కార్యక్రమం.  

ప్లేస్  మెంట్  కు ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ నిరుపేద యువత కోసం 27 రాష్ర్టాలు, 4 యుటిల్లో ఈ కార్యక్రమం అమలుపరుస్తున్నారు.  877కి పైగా పిఐఏలు (ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు) 2369 శిక్షణ కేంద్రాల్లో 616 రకాల ఉద్యోగాల్లో గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటికి 14.08 లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు 8.39 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

మారుతున్న కాలానికి దీటుగా మారుతున్న గ్రామీణ యువత ఆకాంక్షలకు దీటుగా ఈ కార్యక్రమం మార్గదర్శకాలు, ప్రామాణిక నిర్వహణ విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రిత్వ శాఖ వద్ద  డిడియు-జికెవై 2.0 మార్గదర్శకాల రూపకల్పన తుది దశలో ఉంది.  ఈ కొత్త కార్యక్రమం నైపుణ్యకల్పన వాతావరణాన్ని మెరుగుపరిచి మరింత ఉపాధి అనుకూలం చేస్తుంది. 

***



(Release ID: 1911716) Visitor Counter : 213


Read this release in: English , Urdu , Hindi , Punjabi