విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ అంతర్‌-అనుసంధాన గ్రిడ్‌లో పునరుత్పాదక శక్తి ఏకీకరణను సులభం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం: కేంద్ర విద్యుత్, ఎన్‌ఆర్‌ఈ శాఖ మంత్రి శ్రీ ఆర్‌.కె.సింగ్

Posted On: 28 MAR 2023 6:39PM by PIB Hyderabad

జాతీయ అంతర్‌-అనుసంధాన గ్రిడ్‌లో పునరుత్పాదక శక్తిని (ఆర్‌ఈ) సులభంగా ఐక్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు:

    1. పునరుత్పాదక విద్యుత్ అనుసంధానం కోసం అంతర్‌-జిల్లా, అంతర్‌-రాష్ట్ర ప్రసార వ్యవస్థల నిర్మాణం.
    2. 2030 నాటికి 500 గిగావాట్లకు పైగా ఆర్‌ఈ సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రసార ప్రణాళిక
    3. పునరుత్పాదక శక్తి మెరుగైన అంచనా కోసం, పునరుత్పాదక శక్తి వైవిధ్యం & అంతరాయాలను నిర్వహించడంలో గ్రిడ్ ఆపరేటర్లకు సాయపడడానికి ప్రాంతీయ ఇంధన నిర్వహణ కేంద్రాల (ఆర్‌ఈఎంసీలు) ఏర్పాటు.
    1. సౌర-పవన హైబ్రిడ్ ప్రాజెక్ట్‌లు, శక్తి నిల్వ వ్యవస్థలతో కూడిన ఆర్‌ఈ ప్రాజెక్ట్‌ల వంటి వినూత్న ఆవిష్కరణలు, అంతరాయాన్ని తగ్గించడానికి ప్రారంభించి ఆర్‌ఈయేతర వనరులతో విద్యుత్‌ ప్రసారాల్లో సమతుల్యతతో ఆర్‌ఈ పంపిణీ.
    1. ఉత్పత్తి, పునరుత్పాదక శక్తిని, నిల్వ శక్తిని కలపడం ద్వారా బొగ్గు/జల విద్యుత్‌ కేంద్రాల షెడ్యూళ్లలో సౌలభ్యం.
    1. పునరుత్పాదక ఇంధన విక్రయం కోసం 'గ్రీన్ టర్మ్ ఎహెడ్ మార్కెట్' (జీటీఏఎం), 'గ్రీన్ డే అహెడ్ మార్కెట్' (జీడీఏఎం) అమలు
    1. సౌర, పవన విద్యుత్ ప్రసారాలపై అంతర్-రాష్ట్ర పంపిణీ రుసుములు మినహాయింపు.

(బి) విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను డిస్కమ్‌లు తీర్చేందుకు ఈ కింది చర్యలు తీసుకోవడం జరిగింది:

    1. 28.06.2019న విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆర్డర్ నెం. 23/22/2019-ఆర్‌&ఆర్‌ ప్రకారం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు) కింద చెల్లింపు భద్రత వ్యవస్థ రూపంలో సరిపడా "లెటర్ ఆఫ్ క్రెడిట్"ని (ఎల్‌వోసీ) నిర్వహించడం పంపిణీ లైసెన్స్‌దార్లు/సేకర్తలకు తప్పనిసరి. పేర్కొన్న ఉత్తర్వు ప్రకారం, కావలసిన విద్యుత్ పరిమాణానికి ఎల్‌వోసీ ఓపెన్‌ అయిందని ఉత్పత్తి చేసే కంపెనీ లేదా పంపిణీ సంస్థ ద్వారా తెలియజేయబడిన తర్వాత మాత్రమే నేషనల్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఎన్‌ఎల్‌డీసీ), రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఆర్‌ఎల్‌డీసీ) విద్యుత్తును పంపిణీ చేస్తాయి.
    1. విద్యుత్ రంగ విలువ గొలుసులో చెల్లింపుల క్రమశిక్షణ కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ 03.06.2022న విద్యుత్ (ఆలస్య చెల్లింపులపై రుసుము, సంబంధిత విషయాలు) నిబంధనలు-2022ని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం, 03.06.2022 నాటికి ఉన్న పాత బకాయిలను సమయానుకూలంగా సమానమైన నెలవారీ వాయిదాలలో చెల్లించే బాధ్యత డిస్కంలపై ఉంది. 03.06.2022 తర్వాత చేసే ఆలస్య చెల్లింపులపై రుసుము వర్తించని ప్రయోజనం వీటికి ఉంటుంది. అయితే, నిబంధనలకు అనుగుణంగా పాత బకాయిల వాయిదాను చెల్లించడంలో విఫలమైతే, బకాయి మొత్తంపై ఆలస్య చెల్లింపు రుసుము (ఎల్‌పీఎస్‌) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బకాయిలను కాలపరిమితిలో తిరిగి చెల్లించేలా చూసేలా జరిమానా విధివిధానాలను కూడా ఎల్‌పీఎస్ నియమాలు అందిస్తాయి. ఉత్పత్తి చేసే కంపెనీలకు పాత బకాయిలు చెల్లించడానికి పీఎఫ్‌సీ లిమిటెడ్, ఆర్‌ఈసీ లిమిటెడ్ నుంచి డిస్కంలు రుణాలు పొందవచ్చు.

(సి): ఒప్పందాలను తప్పనిసరిగా గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు తెలియజేస్తోంది. పీపీఏని ఏకపక్షంగా రద్దు చేసిన సందర్భంలో పరిహారం చెల్లింపు కోసం నిర్దిష్ట నిబంధనలను సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్ట్‌ల ప్రామాణిక బిడ్డింగ్ మార్గదర్శకాలు కలిగి ఉన్నాయి. "లెటర్ ఆఫ్ క్రెడిట్", చెల్లింపు భద్రత నిధి, త్రైపాక్షిక ఒప్పందం (రాష్ట్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, భారత ప్రభుత్వం మధ్య) ద్వారా మూడు స్థాయుల్లో చెల్లింపు భద్రత యంత్రాంగాన్ని కూడా ఈ నిబంధనలు అందిస్తాయి.

  1. : పునరుత్పాదక ఇంధన ప్రయోజనాల గురించి ఎలక్ట్రానిక్, ప్రింట్, సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలను కొత్త, పునరుత్పాదక మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) చేపట్టింది.
  2. : ఎంఎన్‌ఆర్‌ఈ 'పైకప్పు సౌర విద్యుత్‌ పథకం' కింద 4.3 లక్షల మంది లబ్ధిదార్లు పైకప్పు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ ఈ రోజు రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

******


(Release ID: 1911713)
Read this release in: English , Urdu