విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విపత్తుల ప్రభావాన్ని తగ్గించి, నిరంతర విద్యుత్ సరఫరాకు అనేక చర్యలు: కేంద్ర విద్యుత్, ఈశాన్య రాష్ట్రాల శాఖామంత్రి శ్రీ ఆర్. కె సింగ్

Posted On: 28 MAR 2023 6:37PM by PIB Hyderabad

విపత్తుల నిర్వహణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది.  అందువలన తుపాను లాంటి నోటిఫై చేసిన విపత్తులు  సంభావిస్తే, దెబ్బతిన్న ప్రాంతాల్లో నష్టాన్ని అంచనావేయటానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి.  నిర్ణీత విధానాలకు అనుగుణంగా రాష్ట్ర వైపరీత్య స్పందన నిధి (ఎస్ డి ఆర్ ఎఫ్), జాతీయ వైపరీత్య సహాయ నిధి ( ఎన్ డి ఆర్ ఎఫ్) నుంచి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

అయితే, సవరించిన నిబంధనల ప్రకారం ముందుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సహాయం అందించబడుతుంది. దెబ్బతిన్న కండక్టర్, స్తంభాలు, 11 కెవి వరకు ట్రాన్స్ ఫార్మర్లకు ముందుగా ఈ సహాయం అందుతుంది.  

దేశంలో తుపానులతో సహా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు చెప్పుకోదగినంతగా మెరుగుపడటం వల్ల విపత్తుల యాజమాన్య పద్ధతులు, సంసిద్ధత, అరికట్టటం, స్పందన తదితర అంశాలలో యాజమాన్యం బాగా సులువుగా తయారైంది.  విపత్తుల నిర్వహణ ప్రక్రియ ఎప్పటికప్పుడు బలపడట మన్నది పాలనలో ఒక భాగంగా మారింది.

విపత్తుల ప్రభావాన్ని తగ్గించటానికి, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేట్టు చూడటానికి  తీసుకున్న కొన్ని చర్యలు ఇలా ఉన్నాయి:  

i.               విపత్తు తీవ్రత అత్యధికంగా ఉన్నప్పుడు నిర్ణీత విధానాలకు లోబడి జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్) నుంచి రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయం అందించబడుతుంది. అయితే, అది వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో కూడిన కేంద్ర బృందం వేసిన అంచనాను బట్టి ఉంటుంది.

ii.               కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఈఏ) విపత్తు నిర్వహణ ప్రణాళిక -2022 ను జారీ చేసింది. వైపరీత్య నిర్వహణలో అన్ని  దశలలో ( నియంత్రణ, సంసిద్ధత, స్పందన, కోలుకోవటం)  విద్యుత్ రంగంలో అందుబాటులో ఉండే సౌకర్యాలను వినియోగించుకోవటం మీద ఒక చట్రాన్ని  రూపొందించి దిశానిర్దేశం చేస్తుంది.

iii.               కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఈఏ) 2022 డిసెంబర్ 23 న చేసిన విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక ప్రమాణాలను నోటిఫై చేసింది. ఇందులో విపత్తు నివారణకు సంబంధించిన కొత్త నిబంధనలు చేర్చారు.

iv.               జాతీయ గ్రిడ్ ఏర్పాటు చేయటంతోబాటు రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య విద్యుత్ బదలాయింపును బలోపేతం చేయటం

v.               2021 జులై లో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్ డి ఎస్ ఎస్ పథకం కింద సబ్ ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేయటం కోసం భూగర్భ కేబుల్ తదితర అంశాలలో ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది.  ఇది 2021 జనవరిలో కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఇచ్చిన విపత్తు నిర్వహణ ప్రణాళికలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఉంటుంది.

vi.               నిర్మాణంలో ఉన్న/ మంజూరైన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా కచ్చితమైన పర్యవేక్షణ

కేంద్ర విద్యుత్ శాఖామంత్రి శ్రీ ఆర్. కె సింగ్ ఈ రోజు లోక్ సభలో ఇచ్చిన సమాచారం ఇది.

*******


(Release ID: 1911712) Visitor Counter : 122
Read this release in: English , Urdu