ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రొమ్ముకాన్సర్ మందులపై తాజా సమాచారం
ఎంపిక చేసిన 42 అనుసూచితం కాని కాన్సర్ నిరోధక మందులను ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (వాణిజ్య లాభం మొతాదు హేతుబద్ధీకరించే) పద్ధతి కింద పైలెట్ ప్రాతిపదికన పరిమితుల విధింపు
Posted On:
28 MAR 2023 4:55PM by PIB Hyderabad
ఫార్మాస్యూటికల్స్ (ఔషధీయ), జాతీయ ఔషధీయ ధరల నిర్ణాయక ప్రాథికరణ సంస్థ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ) 27 ఫిబ్రవరి, 2019వ తేదీన జారీ చేసిన ఎస్.ఒ. 1041 (ఇ) ద్వారా ఎంపిక చేసిన 42 అనుసూచితం కాని కాన్సర్ నిరోధక మందులను ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (వాణిజ్య లాభం మొతాదు హేతుబద్ధీకరించే) పద్ధతి కింద పైలెట్ ప్రాతిపదికన పరిమితులను విధంచింది.ఇందులో రిబోసిక్లిబ్‌ను కూడా జోడించారు.
తన ఎపిఐలను/ భారీ మొత్తంలో మందులు (కాన్సర్ చికిత్సకు అవసరమైన వాటితో సహా) ఔషధాలను దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంది. తద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచడం దాని లక్ష్యం.
ఫార్మా పరిశ్రమలకు తోడ్పాటునిచ్చే ప్రధాన ఆచరణీయ చొరవలలో ఉత్పత్తితో లంకె ఉన్న చొరవ (పిఎల్ఐ) పథకాన్ని ఔషధాలకు, భారీ మొత్తంలో మందుల తయారీకి, వ్యూహాత్మక చొరవలు భారీ ఔషధాల తయారీ, బల్క్ డ్రగ్స్ పార్క్స్ పథకానికి పిఎల్ఐ పథకం ప్రధానపాత్రను పోషిస్తుంది. ఫార్మాస్యూటికల్స్‌కు ఉత్పత్తితో లంకె ఉన్న చొరవ (పిఎల్ఐ) పథకాన్ని ఆర్థిక సంవత్సరం 2020-21లో ప్రారంభించారు. ఇది ఎంపిక చేసిన 55 దరఖాస్తులకు కాన్సర్ నిరోధక మందులు (ఉత్పత్తి వర్గం- 3) సహా మూడు వర్గాల కింద అర్హత కలిగిన ఉత్పత్తులను తయారీకి ఆరు సంవత్సరాల పాటు ఆర్థిక చొరవలను అందిస్తారు. ఒక పిఎల్ఐ దరఖాస్తుదారు అబెమాసిక్లిబ్ ఇంటర్మీడియట్‌ను, రిబోసిక్లిబ్ ఇంటర్మీడియట్‌ను యాక్టివ్ ఫార్మస్యూటికల్స్ ఇన్‌గ్రేడియంట్స్ / కీ స్టార్టింగ్ మెటీరియల్స్/ మందుల మాధ్యమిక అన్న ఉపవర్గం కింద ఉత్పత్తి చేస్తున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - జాతీయ కాన్సర్ రిజిస్ట్రీ కార్యక్రమం డాటా ప్రకారం, దేశంలో 2022వ సంవత్సరంలో అంచనా వేసిన రొమ్ము కాన్సర్ సంభవించిన సంఖ్య 216108. కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఒ) ప్రకారం, పాల్బొసిక్లిబ్ 10 జనవరి 2023 నుంచి పేటెంట్‌ను కోల్పోయింది.
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ పరియోజన (పిఎంబిజెపి) కింద నాణ్యమైన జెనెరిక్ మందులను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులో ఉంచారు. అందుబాటు ధరల్లో మందులు, చికిత్స కోసం, విశ్వసనీయమైన ఇంప్లాంట్ల కోసం కొన్ని ఆసుపత్రులు / సంస్థలలో (ఎఎంఆర్ఐటి -అమృత్) ఫార్మసీ మందుల షాపులను ఏర్పాటు చేశారు. కాన్సర్ మందులు గరిష్ట రిటైల్ ధరకన్నా గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం.
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో పేర్కొన్నారు.
***
(Release ID: 1911650)
Visitor Counter : 150