వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
1వ జీ 20 వాణిజ్యం మరియు పెట్టుబడి వర్కింగ్ గ్రూప్ సమావేశం(TIWG) ముంబైలో, మార్చి 28 - 30, 2023 న జరగనుంది.
Posted On:
27 MAR 2023 5:37PM by PIB Hyderabad
భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీలో 1వ టీ ఐ డబ్ల్యు గ్రూప్ సమావేశం ముంబైలో మార్చి 28-30, 2023 నుండి జరగనుంది. ఈ మూడు రోజుల సమావేశంలో, జీ 20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, ప్రాంతీయ సమూహాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి 100 మందికి పైగా ప్రతినిధులు ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడులు అనే అంశంపై చర్చల్లో పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే 50 మందికి పైగా ప్రతినిధులు ముంబై చేరుకున్నారు.
మొదటి రోజు మార్చి 28న ‘వాణిజ్య రుణాలు ’పై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. వాణిజ్య రుణాల అంతరాన్ని పూడ్చడంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలు మరియు ఎగుమతి క్రెడిట్ ఏజెన్సీల పాత్ర మరియు డిజిటలైజేషన్ మరియు ఫిన్‌టెక్ పరిష్కారాలు వాణిజ్య రుణాల అందుబాటు ను ఎలా మెరుగుపరుస్తాయనే దానిపై రెండు ప్యానెల్ చర్చల ద్వారా చర్చించబడుతుంది. పెరుగుతున్న వాణిజ్య ఆర్థిక అంతరాన్ని తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా మరియు ఖచ్చితమైన పరిష్కారాలను అందించడానికి భారతదేశం మరియు విదేశాల నుండి ప్రముఖ వక్తలు ఆహ్వానించబడ్డారు. దాని తర్వాత జీ 20 ప్రతినిధుల కోసం భారత్ డైమండ్ బోర్స్‌లో గైడెడ్ టూర్ ఉంటుంది.
సుగంధ ద్రవ్యాలు, చిరు ధాన్యాలు, టీ మరియు కాఫీపై వివిధ అనుభవ ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయబడతాయి మరియు కాన్ఫరెన్స్ వేదిక వద్ద టీ ఐ డబ్ల్యు గ్రూప్ సమావేశంలో వస్త్రాల ప్రదర్శన ప్రదర్శించబడుతుంది.
మార్చి 29న, టీ ఐ డబ్ల్యు గ్రూప్ సమావేశాన్ని గౌరవ ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్‌తో కలిసి గౌరవ భారత వాణిజ్య మరియూ పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రారంభిస్తారు. భారత ప్రెసిడెన్సీ అనుసరిస్తున్న ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడులకు సంబంధించిన ప్రాధాన్యతలను మార్చి 29 మరియు 30 తేదీల్లో నాలుగు సాంకేతిక అంతర్గత సమావేశాలలో చర్చించనున్నారు.
మార్చి 29న, చర్చలు వృద్ధి మరియు శ్రేయస్సు కోసం వాణిజ్యం పని చేయడం మరియు సుస్థిర మైన ప్రపంచ విలువ గొలుసులను (GVCs) నిర్మించడంపై దృష్టి పెడతాయి. వృద్ధిని కలుపుకొని మరియు సుస్థిర వానిజ్యంగా మార్చడం, జీ వీ సీ లలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు ప్రపంచ వర్ధమాన దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం మరియు భవిష్యత్ ప్రకంపనలను తట్టుకునేలా సుస్థిరంగా ఉండే జీ వీ సీ లను నిర్మించడం కోసం భాగస్వామ్య ఫలితాలను సాధించడంపై ప్రాధాన్యత ఉంటుంది.
మార్చి 30న, ప్రపంచ వాణజ్యంలో ఎం ఎస్ ఎం ఈ లను ఏకీకృతం చేయడం మరియు వాణిజ్యం కోసం సమర్థవంతమైన లాజిస్టిక్‌లను నిర్మించడంపై అనే ప్రాధాన్యతా అంశాలపై రెండు టీ ఐ డబ్ల్యు గ్రూప్ వర్కింగ్ సెషన్‌లలో చర్చించబడతాయి. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవనోపాధిని కొనసాగించడంలో వారి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని, ప్రపంచ వాణిజ్యంలో ఎం ఎస్ ఎం ఈలను మెరుగ్గా సమగ్రపరచడానికి గత జీ20 ప్రెసిడెన్సీలు చేసిన పనిని ముందుకు తీసుకెళ్లడం భారత ప్రెసిడెన్సీ లక్ష్యం. జీ20 ప్రతినిధులు సరిహద్దుల్లో మరియు లోతట్టు ప్రాంతాలలో లావాదేవీల ఖర్చులను తగ్గించగల బలమైన రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే మార్గాలను కూడా చర్చిస్తారు.
ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడులను వేగవంతం చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై భాగస్వామ్య అవగాహనను ఏర్పరచడం మరియు మానవ-కేంద్రీకృత సుదృడ ఫలితాలు మరియు బట్వాడాలను రూపొందించడానికి ఇప్పటికే ఉన్న అవకాశాలను ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశం భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ లక్ష్యం.
***
(Release ID: 1911316)
Visitor Counter : 246