ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 మార్చి 17 నాటికి 22,500 గృహాలకు పైగా పంపిణీ చేసిన స్వామిహ్‌ ఫండ్

Posted On: 27 MAR 2023 8:16PM by PIB Hyderabad

2023 మార్చి 17 నాటికి భారత ప్రభుత్వం స్వామిహ్‌ ఫండ్‌కు రూ. 2,646.57 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌధరి ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

2023 మార్చి 17 నాటికి స్వామిహ్‌ ఫండ్ 22,500 ఇళ్లకు పైగా పంపిణీ చేసిందని మంత్రి తెలిపారు.

భారతదేశంలో ఒత్తిడిలో ఉన్న/మధ్యలోనే ఆగిపోయిన మధ్య తరగతి ఆదాయ, సరస ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ఈ క్రింది ప్రమాణాలకు అనుగుణంగా స్వామిహ్‌ ఫండ్‌ నిధులు సమకూరుస్తుందని మంత్రి వెల్లడించారు.

  • అందుబాటులో ఉన్న ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)/ ఫ్లోర్ ఏరియా రేషియోలో (ఫార్‌) కనీసం 90 శాతాన్ని సరస ధరల్లో లేదా మధ్య తరగతి ఆదాయ గృహాలుగా నిర్మించాలి.
  • నికర విలువ సానుకూలంగా ఉందా?
  • రెరా కింద నమోదై ఉందా?; ప్రాజెక్ట్ ఖర్చుల్లో కనీసం 30% ఖర్చు చేసి ఉండాలి; ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తగినన్ని నిధులు అవసరమై ఉండాలి.
  • ఫండ్ అందించిన నిధులను ఉపయోగించాల్సిన ప్రాజెక్ట్ భాగంపై సీనియర్ అధికారి పర్యవేక్షణ (రెగ్యులేటరీ అథారిటీ పర్యవేక్షణ ఉన్న సందర్భాల్లో మినహా) ఉండాలి.
  • సరస ధరల్లో లేదా మధ్య తరగతి ఆదాయ గృహాలు 200 చదరపు మీటర్ల రెరా కార్పెట్ ఏరియాను మించని యూనిట్లుగా ఉండాలి, వాటి ధరలు ఈ క్రింది విధంగా ఉండాలి (నిబంధనలకు అనుగుణంగా):
  • ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో రూ. 2 కోట్ల కంటే తక్కువ
  • జాతీయ రాజధాని ప్రాంతం, చెన్నై, కోల్‌కతా, పుణె, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో రూ. 1.5 కోట్ల కంటే తక్కువ
  • భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 1 కోటి కంటే తక్కువ

ఫండ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. ఫండ్ పనితీరుపై ఫండ్ పెట్టుబడి మేనేజర్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుతుంది అని మంత్రి వెల్లడించారు.

 

****


(Release ID: 1911315) Visitor Counter : 192


Read this release in: English , Urdu