గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అమృత్ 2.0 స్థితిగతులు
Posted On:
27 MAR 2023 4:28PM by PIB Hyderabad
అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ -ఎఎంఆర్‌యుటి- అమృత్) కింద సార్వత్రిక నీటి సరఫరా కవరేజ్‌కింద 500 నగరాల నుంచి దేశంలోని అన్ని చట్టబద్ధమైన పట్టణాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు అమృత్ 2.0ను అక్టోబర్ 2021లో ఆర్థిక సంవత్సరం 2021-22 & 2025-26 వరకు 5 ఏళ్ళ కాలానికి ప్రారంభించారు. ఇది 500 అమృత్ నగరాలలోని నగరాలను స్వీయావలంబన & నీటి భద్రత కలిగిన వాటిగా మలచేందుకు, మురుగునీరు & కలుషిత జలాల నిర్వహణ చేయడంపై దృష్టిపెడుతుంది. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం, పౌరుల జీవన సౌలభ్యం, నీటి రంగ సంస్కరణలపై దృష్టిపెట్టే సంస్కరణ అజెండాను మిషన్ కలిగి ఉంది.
నేటివరకూ, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రభుత్వాలు సమర్పించిన రాష్ట్ర నీటి కార్యాచరణ ప్రణాళికల (ఎస్‌డబ్ల్యుఎపిఎస్)ను గృహ & పట్టణ వ్యవహారాలు (ఎంఒహెచ్‌యుఎ) రూ. 1,29,636 కోట్ల వ్యయంతో (అమలు & నిర్వహణ సహా) 6257 ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 48 లక్షల కొత్త పంపునీటి కనెక్షణ్లను, 33.42 లక్షల కొత్త మురికినీటి గొట్టాల అనుసంధానాలను చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా, రోజుకు 8,435 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి గల ప్లాంట్ సామర్ధ్యాన్ని, 2,795 మురుగునీటి శుద్ధి ప్లాంట్ సామర్ధ్యాన్ని జోడించాలని/ పెంచాలని ప్రతిపాదించారు. ఇవేకాక, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద అమృత్ సరోవర్‌ను వేగవంతం చేసేందుకు రూ.3,664 కోట్ల విలువైన 2,102 జలాశయాల పునరుద్ధరణ ప్రాజెక్టులను కూడా ఎస్‌డబ్ల్యుఎపిఎస్ & స్పెషల్ ట్రాంచె ఆఫ్ ఎస్‌డబ్ల్యుఎపిఎస్ ను ఆమోదించారు.
ఎంఒహెచ్‌యుఎ ఆమోదించిన 6,527 ప్రాజెక్టులలో, రూ.36,481 కోట్ల విలువైన 2,058 ప్రాజెక్టులకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను (డిపిఆర్)లను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఆమోదించాయి. రూ. 19,157.55 కోట్ల విలువైన 1,025 ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానిస్తూ నోటీసులను జారీ చేసి, రూ. 5,422.82 కోట్ల విలువైన 608 ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ఇవ్వగా, రూ 102.99 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది.
మొత్తం మిషన్ కాలానికి అమృత్ 2.0 కింద ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎస్‌డబ్ల్యుఎపిలను ఆమోదించడం జరిగింది. కాగా, అమృత్ & అమృత్ 2.0లను పోల్చడం ప్రస్తుత దశలో సాధ్యం కాని పని. అయితే, అమృత్ 2.0 పథకం ఉత్తమ కార్యాచరణలను, అధ్యయనాలను & అమృత్ మిషన్ ఎదుర్కొన్న సవాళ్ళను చేర్చుకుంటూ ముందుకు సాగుతోంది.
అమృత్ కింద 2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష లేదా అంతకంటే అధిక జనాభా ఉన్న అన్ని పట్ణ స్థానిక సంస్థలు (యుఎల్‌బి) సహా దేశంలోని అన్ని 60 శాతం పట్టణ జనాభా కలిగిన, అన్ని రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు, అన్ని హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హెచ్ ఆర్ ఐడిఎవై - హృదయ్ - వారసత్వ నగరాభివృద్ధి & వృద్ధి ప్రణాళిక) నగరాలు, పర్వత రాష్ట్రాలు, ద్వీపాలు, పర్యాటక ప్రాంతాలలోని ప్రధాన నదుల అంచుల్లో ఉన్న నగరాలు సహా 500 నగరాలను ఎంపిక చేశారు.
అమృత్ కింద, ప్రాజెక్టులను ఎంపిక చేయడానికి, వివరించడానికి, ప్రతిపాదించడానికి రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది.,గృహ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత కమిటీ ఆమోదానంతరం అమృత్ మిషన్ విస్త్రత చట్రంలో అమలు చేసేందుకు వాటికి సాధికారతను ఇవ్వడం జరిగింది. అన్ని అమృత్ నగరాలలో మిషన్‌ను తదనుగుణంగా అమలు చేస్తుండగా, అది మంచి పురోగతిని చూపుతోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర గృహ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ రాజ్యసభలో ఇచ్చిన లిఖిత సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1911310)
Visitor Counter : 170