రక్షణ మంత్రిత్వ శాఖ
డిఆర్‌డిఒ ద్వారా సాంకేతిక బదిలీ
Posted On:
27 MAR 2023 3:12PM by PIB Hyderabad
భారతీయ సైనిక దళాలు ఉపయోగించేందుకు డిఆర్‌డిఒ ఉత్పత్తుల నమూనా, అభివృద్ధిని డిఆర్‌డిఒ చేపట్టింది. విజయవంతమైన ఉత్పత్తి పరీక్ష, మూల్యాంకనం తర్వాత అదే సాంకేతికతను లైసెన్సింగ్ ఒప్పందం (ఎల్ ఎటిఒటి) పై సంతకం చేయడం ద్వారా భారీ ఉత్పత్తి కోసం భారతీయ పరిశ్రమలకు సాంకేతికతను బదిలీ చేస్తారు. సాంకేతిక బదిలీ (టిఒటి) కోసం ప్రస్తుత డిఆర్‌డిఒ విధానం 19 ఆగస్టు 2019 నుంచి అమలులోకి వచ్చింది. నేటి వరకు, ఈ విధానం కింద డిఆర్‌డిఒ 670 పరిశ్రమలతో ఎల్ఎటిఒటిలపై సంతకాలు చేసింది.
డిఆర్‌డిఒ రక్షణ, ద్వంద వాడక సాంకేతికతలను ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేస్తుంది. డిఆర్‌డిఒకు, డిఆర్‌డిఒ అభివృద్ధి చేసిన సాంకేతికత బదిలీ చేసుకుంటున్న పరిశ్రమకు మధ్య చేసుకున్న ఎల్ఎటిఒటి ప్రకారం, స్వీకృత పరిశ్రమ తాము డిఆర్‌డిఒ నుంచి పొందిన సాంకేతికతను/ తయారీని డిఆర్‌డిఒ ఆమోదం లేకుండా వేరొకరికి బదిలీ చేయడం కానీ, సబ్‌లైసెన్స్ ఇవ్వడం కానీ చేయకూడదు. అంతేకాకుండా, ఎల్ఎటిఒటి కింద పేర్కొన్న ఉత్పత్తి అమలు లేదా తయారీ కోసం అవసరమైన డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, వారి సబ్‌కాంట్రాక్టర్లకు తప్ప మరెవరికీ సాంకేతికతను వెల్లడించడం కానీ, ఇవ్వడం లేదా సౌలభ్యతను కల్పించడం కానీ చేయకుండా ఉండేందుకు పరిశ్రమ తగిన చర్యలు అన్నీ తీసుకోవడానికి ఎల్ఎటిఒటి తప్పనిసరి చేస్తుంది. రక్షణ ఉత్పత్తి విభాగం జారీ చేసిన సెక్యూరిటీ మాన్యువల్ ఫర్ లైసెన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ప్రకారం, జాతీయ భద్రత, రక్షణ ప్రయోజనా కోసం రక్షణ ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకాలలో లైసెన్స్ పరిశ్రమ నిర్దేశించిన కనీస భద్రతా ప్రమాణాలను, ఇతర రక్షణ చర్యలను తీసుకోవాలి.
రాజ్యసభలో శ్రీ డెరెక్ ఒ బ్రియాన్ అడిగిన ప్రశ్నకు ఈ సమాచారాన్ని రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ సోమవారం ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో వెల్లడించారు.
***
(Release ID: 1911308)