సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav g20-india-2023

ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించి సూక్ష్మ, చిన్న తరహా సంస్థల సమగ్ర అభివృద్ధికి సూక్ష్మ, చిన్న తరహా సంస్థల – క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSE-CDP) క్లస్టర్ విధానం అమలు

Posted On: 27 MAR 2023 3:43PM by PIB Hyderabad

మహారాష్ట్ర తో సహా దేశం వివిధ ప్రాంతాలలో సూక్ష్మ, చిన్న తరహా సంస్థల – క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSE-CDP) క్లస్టర్ విధానాన్ని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఉత్పాదకత,  పోటీతత్వాన్ని పెంపొందించి సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు అభివృద్ధి చెందేలా చూసేందుకు పథకం అమలు జరుగుతోంది. క్లస్టర్ విధానం ద్వారా ఉమ్మడి సౌకర్యాల కల్పన కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సమీకరించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో నూతన ఉమ్మడి సౌకర్యాల కల్పన కేంద్రాలను  ఏర్పాటు చేయడం,ఇప్పటికే పారిశ్రామికవాడలు/ ప్రాంతాలు/ కర్మాగారాల సముదాయంలో ఇప్పటికే  పనిచేస్తున్న కేంద్రాల స్థాయి పెంపొందించడానికి నిధులు వినియోగిస్తారు. 

సాంప్రదాయ పరిశ్రమల ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించడానికి   సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల సమీకరణ  పథకాన్ని  (SFURTI) ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. దీనిలో భాగంగా సాంప్రదాయ పరిశ్రమలను ఒక సమూహంగా సమీకరించి సుస్థిర సమగ్ర  అభివృద్ధి సాధించడానికి  అవసరమైన సహాయ సహకారాలను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అందిస్తుంది. 

అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రాయోజిత పథకంగా సూక్ష్మ, చిన్న తరహా సంస్థల – క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అమలు జరుగుతుంది. సమూహంలో ఉన్న పరిశ్రమల అవసరాలు గుర్తించి వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. 

సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల సమీకరణ పథకం కూడా కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు జరుగుతోంది. దేశం వివిధ ప్రాంతాల్లో భిన్న భౌగోళిక పరిస్థితుల్లో పనిచేస్తున్న సాంప్రదాయ పరిశ్రమలను గుర్తించి వాటి అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను అమలు చేస్తారు. పథకం అమలు చేయడానికి ఈశాన్య ప్రాంతం, కొండ ప్రాంతాలు, గిరిజన జిల్లాలు, ఆకాంక్షిత జిల్లాల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించారు. అర్హత, వ్యూహాలు, వెసులుబాటు, చేతి వృత్తి కళాకారులకు కలిగే ప్రయోజనం లాంటి అంశాలను పరిశీలించి ప్రతిపాదనలను ఆమోదిస్తారు. 

సూక్ష్మ, చిన్న తరహా సంస్థల – క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద మహారాష్ట్రలో 30 ఉమ్మడి సౌకర్యాల కల్పన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు అయ్యాయి. వీటిలో 14 ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల సమీకరణ పథకం కింద మహారాష్ట్రకు 27 క్లస్టర్లు మంజూరు అయ్యాయి. వీటిలో ఇప్పటికే 16 పనిచేస్తున్నాయి. 

సూక్ష్మ, చిన్న తరహా సంస్థల – క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద  ప్రతిపాదనలకు  వేగంగా ఆమోదం లభించేలా చూడడానికి నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 

సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల సమీకరణ పథకం కింద చేపట్టే పనులు 12-18 నెలల   కాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో ఈ గడువు మూడు సంవత్సరాలుగా ఉండేది. నూతన విధానం 2020 మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. 

ఈ సమాచారాన్ని ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర  ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ అందించారు. 

***

 



(Release ID: 1911307) Visitor Counter : 190


Read this release in: English , Urdu