ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలు


దేశంలో నాణ్యమైన మానసిక ఆరోగ్య సలహాలు మరియు సంరక్షణ సేవల అందుబాటు ను మరింత మెరుగుపరచడానికి "నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్" ప్రారంభించబడింది

నిమ్హాన్స్ (iGOT)-దీక్ష ప్లాట్‌ఫారమ్ ద్వారా మానసిక సామాజిక మద్దతు మరియు శిక్షణను అందించింది

25 రాష్ట్రాలు/యుటిలు 36 టెలి మానసిక ఆరోగ్య సలహాల సెల్‌లను ఏర్పాటు చేశాయి

హెల్ప్‌లైన్ నంబర్‌లో 63,806 కాల్‌లు స్వీకరించారు

Posted On: 24 MAR 2023 5:32PM by PIB Hyderabad

"కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో 204 దేశాలు మరియు ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్త నిస్పృహ మరియు ఆందోళన రుగ్మతలు భారం ", ప్రచురించబడిన అధ్యయనం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశంలో నిస్పృహ మరియు ఆందోళన రుగ్మతల యొక్క ప్రాబల్యం పెరుగుతుందని అంచనా వేసింది.

 

ప్రజల మానసిక ఆరోగ్యంపై కోవిడ్-19 చూపే ప్రభావాన్ని గ్రహించిన ప్రభుత్వం, వీటితో సహా అనేక కార్యక్రమాలు చేపట్టింది.

 

పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు మరియు ఆరోగ్య కార్యకర్తలు అనే విభిన్న లక్ష్య సమూహాలుగా విభజించబడిన మొత్తం బాధిత జనాభాకు మానసిక ఆరోగ్య నిపుణులచే మానసిక సామాజిక సహాయాన్ని అందించడానికి 24/7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడం.

మానసిక ఆరోగ్య సమస్యల నిర్వహణపై మార్గదర్శకాలు/సలహాలు జారీ చేయడం, సమాజంలోని వివిధ విభాగాలకు సేవలు అందించడం.

వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సృజనాత్మకత దృశ్య శ్రవణ రూపంలో నిస్పృహ ఆందోళన రుగ్మతల ఒత్తిడి కి మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించటం మరియు అందరికీ మద్దతు మరియు సంరక్షణ వాతావరణాన్ని ప్రోత్సహించడం,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్), బెంగళూరు- "కోవిడ్-19 మహమ్మారి కాలంలో మానసిక ఆరోగ్యం - సాధారణ వైద్య మరియు ప్రత్యేక మానసిక ఆరోగ్య సంరక్షణ సేవల కోసం మార్గదర్శకత్వం" ద్వారా వివరణాత్మక మార్గదర్శకాల జారీ మరియు వ్యాప్తి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో “ప్రవర్తనా ఆరోగ్యం – మానసిక సామాజిక హెల్ప్‌లైన్” (https://www.mohfw.gov.in/) కింద అన్ని మార్గదర్శకాలు, సలహాలు మరియు న్యాయవాద విషయాలను పొందవచ్చు.

నిమ్హాన్స్(iGOT)-దీక్ష ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మానసిక సామాజిక మద్దతు మరియు శిక్షణను అందించడంలో నిమ్హాన్స్ ద్వారా ఆరోగ్య కార్యకర్తల  సామర్థ్యాన్ని పెంపొందించడం.

ఇంకా, పేద నిరుపేదలతో సహా జనాభాకు సరసమైన మరియు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం కోసం, ప్రభుత్వం దేశంలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (NMHP) అమలు చేస్తోంది. ఎన్ ఎం హెచ్ పీ  యొక్క డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (DMHP) లో భాగంగా 716 జిల్లాల్లో అమలు కోసం మంజూరు చేయబడింది, దీని కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రాష్ట్రాలు/ యూ టీ లకు మద్దతు అందించబడుతుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) స్థాయిలలో డీ ఎం హెచ్ పీ కింద అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఔట్ పేషెంట్ సేవలు, మూల్యాంకనం, కౌన్సెలింగ్/ మానసిక-సామాజిక జోక్యాలు,  మందులు, ప్రజల వద్దకు సేవలు, తీవ్రమైన మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తులకు నిరంతర సంరక్షణ మరియు మద్దతు , అంబులెన్స్ సేవలు మొదలైన సేవలు అందించారు.

 

పైన పేర్కొన్న సేవలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలో మానసిక ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ - హెచ్ డబ్ల్యు సీ పథకం కింద సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కింద సేవల ప్యాకేజీలో మానసిక ఆరోగ్య సేవలు జోడించబడ్డాయి. ఆరోగ్య కేంద్రాలలో (HWC) మానసిక, నాడీ సంబంధిత మరియు పదార్థ వినియోగ రుగ్మతల (MNS)పై కార్యాచరణ మార్గదర్శకాలు ఆయుష్మాన్ భారత్ పరిధిలో విడుదల చేయబడ్డాయి.

 

పైన పేర్కొన్న వాటితో పాటు, దేశంలో నాణ్యమైన మానసిక ఆరోగ్య సలహాలు మరియు సంరక్షణ సేవలకు అందుబాటు ను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం 10 అక్టోబర్ 2022న “నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. 09.03.2023 నాటికి, 25 రాష్ట్రాలు/యుటిలు 36 టెలి మానసిక ఆరోగ్య సలహాల  సెల్‌లను ఏర్పాటు చేశాయి మరియు మానసిక ఆరోగ్య సేవలను ప్రారంభించాయి. హెల్ప్‌లైన్ నంబర్‌లో 63806 కాల్‌లు స్వీకరించారు.

 

జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద  2022-23 సంవత్సరానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రాలు/యూటీల కోసం రూ.159.75 కోట్లు ఆమోదించబడ్డాయి. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం యొక్క తృతీయ సంరక్షణ భాగం కింద, మానసిక ఆరోగ్య స్పెషాలిటీలలో పీ జీ విభాగాలలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచడానికి అలాగే తృతీయ స్థాయి చికిత్స సౌకర్యాలను అందించడానికి 25 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు 47 పీ జీ విభాగాలు మంజూరు చేయబడ్డాయి. ఈ పథకం కోసం  2022-23 సంవత్సరానికి రూ.35 కోట్లు కేటాయించారు.

 

2022-23 నుండి 03 (మూడు) మానసిక ఆరోగ్య సంస్థలకు నిధులు కేటాయించబడ్డాయి, అవి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్), బెంగళూరు, లోకోప్రియా గోపీనాథ్ బోర్డోలోయ్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (LGBRIMH), తేజ్‌పూర్, అస్సాం మరియు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (CIP), రాంచీ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో ఈ క్రింది విధంగా ఉన్నాయి:

సంస్థ పేరు

కేటాయించిన నిధులు (రూ. కోట్లలో)

నిమ్హాన్స్, బెంగళూరు

678.00

ఎల్ జీ బీ ఆర్ ఐ ఎం హెచ్ , తేజ్‌పూర్, అస్సాం

58.3

సీ ఐ పీ రాంచీ

129

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1910583) Visitor Counter : 141


Read this release in: English , Urdu