ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

లక్ష్య కార్యక్రమం


2,660 కానుపు గదులు, 1989 ప్రసూతి ఆపరేషన్ థియేటర్‌లు లక్ష్య కార్యక్రమం కింద

సర్టిఫైడ్ సౌకర్యాలు లేబర్ రూమ్ ప్రోటోకాల్‌ల సెన్సిటైజేషన్/ఓరియెంటేషన్‌ను నిర్వహిస్తాయి

Posted On: 24 MAR 2023 5:29PM by PIB Hyderabad

లక్ష్య అనేది నాణ్యమైన మెరుగుదల కార్యక్రమం, ఇది కానుపు గది, ప్రసూతి ఓటిలో ఇంట్రాపార్టమ్, తక్షణ ప్రసవానంతర కాలంలో సంరక్షణ నాణ్యతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సమానమైన ఆరోగ్య సౌకర్యాలు, నియమించబడిన ఎఫ్ ఆర్ యులు అలాగే అధిక కేస్ లోడ్ సిహెచ్సి ని లక్ష్యంగా చేసుకుంటుంది.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులతో సహా అధిక కేసులు వచ్చే తృతీయ సంరక్షణ సౌకర్యాలలో మొత్తం 283 ప్రసూతి సంబంధిత అధిక డిపెండెన్సీ యూనిట్ (హెచ్డియు) / ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) ఆమోదం లభించాయి. 

లక్ష్య ధృవీకరణ కోసం అన్ని లక్ష్య సౌకర్యాలు (ఇందులో 2660 లేబర్ రూమ్‌లు మరియు 1989 మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి), లక్ష్య కార్యక్రమం కింద ధృవీకరించిన సౌకర్యాలు తాజా లేబర్ రూమ్ ప్రోటోకాల్‌ల సెన్సిటైజేషన్/ ఓరియెంటేషన్‌ను నిర్వహిస్తాయి.

లక్ష్య పరిధిలో, మెటర్నిటీ ఓటీ లలో 5% లేదా అంతకంటే తక్కువ సర్జికల్ సైట్ ఇన్‌ఫెక్షన్ రేటును సాధించడం లేదా బేస్‌లైన్ నుండి కనీసం 30% తగ్గింపు సౌకర్యం-స్థాయి లక్ష్యాలలో ఒకటి. లక్ష్య  ధృవీకరణ సమయంలో, పైన పేర్కొన్న అవసరానికి అనుగుణంగా స్వతంత్ర ఎంప్యానెల్ అయిన ఎన్ క్యూ ఏ ఎస్ మదింపుదారులు ధృవీకరించారు.
 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

 

****



(Release ID: 1910574) Visitor Counter : 160


Read this release in: English , Urdu