మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన క్రియాశీల సంప్రదాయ మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి మరియు పోషకాహారం


- పి.ఎం.ఎం.ఎస్.వై కింద మత్స్య శాఖ 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం

Posted On: 24 MAR 2023 6:06PM by PIB Hyderabad

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2020-21 మరియు 2021-22) “ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై) కింద మత్స్యశాఖ, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ చేపల వేట నిషేధం/ లీన్ కాలంలో మత్స్య వనరుల పరిరక్షణ కోసం సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన క్రియాశీల సాంప్రదాయ మత్స్యకారుల కుటుంబాలకు తగిన జీవనోపాధి మరియు పోషకాహార మద్దతుకు సంబంధించిన 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.798.012 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రతిపాదనలలో కేంద్రం వాటా రూ.298.24 కోట్లు.  కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక  లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

***


(Release ID: 1910570) Visitor Counter : 118


Read this release in: English , Urdu