వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22లో పంపిణీ కోసం 6.07 లక్షల టన్నుల చిరుధాన్యాలు సేకరించిన రాష్ట్రాలు/యుటిలు

Posted On: 24 MAR 2023 5:44PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో వ్యవసాయ, రైతుల సంక్షేమం శాఖ 2022-23 ఆహార ధాన్యాల ఉత్పత్తి 2వ అడ్వాన్స్ అంచనాల ప్రకారం, మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 3235.54 లక్షల టన్నులుగా అంచనా వేశామని వెల్లడించారు. అందులో చిరుధాన్యాల ఉత్పత్తి 159.09 లక్షల టన్నులు (మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 4.92 శాతం) ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22లో 6.07 లక్షల టన్నుల మిల్లెట్స్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టిపిడిఎస్)/ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్)/ ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (పీఎం పోషణ్/మధ్యాహ్న భోజన పథకం ) కింద పంపిణీ చేసేందుకు సేకరించాయి. 

జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం, “ఆహార ధాన్యాలు” అనే పదాన్ని బియ్యం, గోధుమలు లేదా ముతక ధాన్యాలు లేదా వాటి ఏదైనా సమ్మేళనం అటువంటి నాణ్యతా నిబంధనలకు అనుగుణంగా భావిస్తారు. చట్టం ప్రకారం మిల్లెట్‌లకు నిర్దిష్ట నిబంధన లేదు. అయితే, ఎన్ ఎఫ్ ఎస్ ఏ కింద కవర్ అయిన లబ్ధిదారులలో పోషకాహార స్థాయిని మెరుగుపరచడానికి, అన్ని రాష్ట్రాలు/యూటీలు మిల్లెట్‌లను సేకరించి ఎన్ ఎఫ్ ఎస్ ఏ లబ్ధిదారులకు స్థానిక వినియోగ ప్రాధాన్యతల ప్రకారం మరియు ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం పంపిణీ చేయాలని కోరారు. 

మిల్లెట్‌లోని పోషక విలువలను గుర్తించి, మిల్లెట్‌ల వినియోగం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు మరియు మహిళల్లో కీలక పోషకాహార పారామితులను గణనీయంగా మెరుగుపరుస్తుంది అనే వాస్తవాన్ని గుర్తించి, మిల్లెట్ సాగును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ఒక ఉప-మిషన్‌ను రూపొందించింది. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టిపిడిఎస్)లో చేర్చడం జరిగింది, రాష్ట్రాలు/యుటిల ద్వారా ముతక ధాన్యాల సేకరణ, నిల్వ , పంపిణీ వికేంద్రీకృత సేకరణ (డీసీపీ) విధానంలో జరుగుతుంది.

గత ఐదేళ్లలో మిల్లెట్ల ఉత్పత్తి:

 

 

క్రమ సంఖ్య 

సంవత్సరం 

ఉత్పత్తి 

 

 

1

2017-18

164.36

 

2

2018-19

137.11

 

 

3

2019-20

172.6

 

 

4

2020-21

180.2

 

 

5

2021-22

159.9

లక్షల మిలియన్ టన్నులలో... 

*****



(Release ID: 1910533) Visitor Counter : 83


Read this release in: English , Urdu