పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

భారతదేశంలో 35 డిజిఎస్ఏ ఆమోదించిన ఎఫ్టీఓలు 53 బేస్‌లలో పనిచేస్తున్నాయి


భారతదేశంలోని పైలట్‌లలో 15% మంది మహిళలు, ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ

Posted On: 23 MAR 2023 4:00PM by PIB Hyderabad

ప్రస్తుతం, భారతదేశంలో 67 మంది విదేశీ ఎయిర్‌క్రూ టెంపరరీ ఆథరైజేషన్ (ఫటా) హోల్డర్‌లు ఉన్నారు. ఆపరేటర్ వారీగా  ఫటా  హోల్డర్ల జాబితా అనుబంధంలో ఉంది.

వివిధ భారతీయ షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ నుండి అందుకున్న డేటా ప్రకారం, 2021 సంవత్సరంలో మొత్తం 244 మంది పైలట్‌లను నియమించారు.

 

పరిశ్రమల అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో సంవత్సరానికి 1000 మంది పైలట్ల అవసరం ఉండవచ్చు. వాణిజ్య పైలట్‌ల వార్షిక అవసరం ఎయిర్‌లైన్ ఆర్థిక ఆరోగ్యం, ఎయిర్‌లైన్ విస్తరణ ప్రణాళిక మరియు విమానయాన రంగంలో వృద్ధి వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

01.03.2023 నాటికి, వివిధ విమానాశ్రయాలు/స్టేషన్లలో పోస్ట్ చేయబడిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మొత్తం 15,896 మంది రెగ్యులర్ అధికారులు పనిచేస్తున్నారు.ఏఏఐ  ఉద్యోగులందరూ భారతీయ పౌరులు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) ప్రకారం, భారతదేశంలోని వివిధ ఎయిర్‌లైన్స్‌లో 67 మంది విదేశీ పౌరులతో సహా సుమారు 10,000 మంది పైలట్లు ఉన్నారు. భారతదేశంలో 35 డిజిసిఏ ఆమోదించిన ఎఫ్టిఓలు 53 బేస్‌లలో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం, ప్రభుత్వంలో ప్రత్యేక కార్యక్రమం లేదు. ఎస్సీ/ఎస్టీలతో సహా మహిళలు మరియు వెనుకబడిన తరగతులకు పైలట్ శిక్షణను ప్రోత్సహించడానికి. అయితే, భారతదేశంలోని పైలట్లలో 15% మంది మహిళలు ఉన్నారు, ఇది ప్రపంచ సగటు 5% కంటే దాదాపు మూడు రెట్లు

 

అనుబంధం 

 

ఆపరేటర్ 

ఎయిర్ క్రాఫ్ట్  రకం 

ఫటా ఉద్యోగస్థులు 

ఇండిగో 

ATR-72-600

04

అలయన్స్ ఎయిర్ 

ATR-72-600

15

విస్తార 

– 787

01

హిమాలయన్ హెలి 

AS-350 B3

01

బిగ్ ఛార్టర్స్ 

ATR-72-500

08

ధిల్లాన్ ఏవియేషన్ 

BELL 206 L4

03

జూమ్ ఎయిర్ 

CRJ 200

01

స్టార్ ఎయిర్ 

EMB 145 LR

05

మైత్రి  ఏవియేషన్  

EMBRAER 195

01

ఎయిర్ చార్టర్ 

FALCON 7X

02

స్కై వన్ 

Ml 172

02

ఇండో పసిఫిక్ 

BD-700

01

త్రివేణి ఎర్త్ మూవర్స్ 

PILATUS PC12

01

గ్లోబల్ వెక్ట్రా 

AS350

03

పినాకిల్  

BELL 407

02

ఓఎస్ఎస్ మేనేజ్మెంట్ 

AUGUSTA-109-C

01

విఎస్ఆర్ 

LEARJET 45

02

ఈ- ఫాక్టర్ 

HOT AIR BALLON

03

యారో ఎయిర్ క్రాఫ్ట్ 

AS350B3

02

రిలయన్స్ కమర్షియల్ 

G7500

03

మహీంద్రా 

LR60XR

01

తంబీ ఏవియేషన్ 

AS350B3E

01

ఐఆర్ఎం 

G-550

04

మొత్తం 

 

67

Source: - Directorate General of Civil Aviation (DGCA)

 ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈ సమాచారాన్ని అందించారు. 

*****



(Release ID: 1910246) Visitor Counter : 106


Read this release in: English , Urdu