కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కనీస వేతనాల రేటును ఐదేళ్ళకు మించని కాలవ్యవధిలో ప్రభుత్వం సమీక్షించడాన్ని తప్పనిసరి చేసిన వేతనాల చట్ట నియమావళి, 2019
Posted On:
23 MAR 2023 4:58PM by PIB Hyderabad
కనీస వేతనాలను, జాతీయ ఫ్లోర్ వేజెస్ (చట్టం నిర్ణయించిన కనీస వేతనం) స్థిరీకరించడానికి భారత ప్రభుత్వం 2021లో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి కనీస వేతనాలు, జాతీయ ఫ్లోర్ వేజెస్‌ను నిర్ణయించేందుకు సాంకేతిక ఇన్‌పుట్లను, సూచనలను అందించడం ఈ బృందం బాధ్యత. వేతనాల స్థిరీకరణ కోసం శాస్త్రీయ ప్రమాణాలు, పద్ధతిని రూపొందించేందుకు నిపుణుల బృందం సూచనలు, నిబంధనలు తోడ్పడతాయి. కనీస వేతనాల చట్టం, 1948లోని సెక్షన్ 3(1) (బి) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిలోని షెడ్యూల్డ్ ఉద్యోగాలలో నిర్ణయించిన కనీస వేతనాలను ఐదేళ్ళకు మించకుండా సమీక్షించి, అవసరమైతే కనీస వేతనాలను సవరించడాన్ని తప్పనిసరి చేస్తుంది.
ఇటీవలే, కనీస వేతనాల చట్టం, 1948లోని నిబంధలను హేతుబద్ధీకరించి కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ,2019లో విలీనం చేసి, పార్లమెంటు ఆమోదించి, 08.08.2019న ప్రకటించింది. కోడ్‌లోని సెక్షన్ 8 (4) ప్రకారం ప్రభుత్వం కనీస వేతన రేట్లను సాధారణంగా ఐదేళ్ళకు మించికుండా సమీక్షించాలని లేదా సవరించాలని నిర్దేశిస్తుంది.
చీఫ్ లేబర్ కమిషనర్ (సిఎల్‌సి) వెబ్‌సైట్లలో కనీస వేతనాల ప్రచారం, పని ప్రదేశాలు/ స్థలాలలో కాంట్రాక్టర్లు ఇచ్చే కనీస వేతనాలను బహిర్గతం చేయడం, ప్రధాన యజమానులు ఇచ్చే కనీస వేతనాల రేట్లను ప్రదర్శించాలని కనీస వేతనాలపై ప్రచారాన్ని ప్రారంభించి, కనీస వేతనాల రేటుకు కట్టుబడి ఉండేలా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
పైన పేర్కొన్నవే కాకుండా, సిఎల్‌సి (సి) కింద కేంద్ర పారిశ్రామిక సంబంధాల యంత్రాంగం (సిఐఆర్ఎం) సంస్థ ద్వారా కనీస వేతనాల చట్టం, 1948 కింద కేంద్ర పరిధిలోని సంస్థలలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. ఏదైనా సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కార్మికులకు తక్కువ వేతనాల ఇస్తున్నట్టు కనుగొన్నప్పుడు, క్లెయిమ్‌ను విచారించి, నిర్ణయించేందుకు అధికారుల ముందు క్లెయిమ్ అప్లికేషన్‌ను దాఖలు చేస్తారు. చట్టంలోని సెక్షన్ 20 (2)లోని నియమాల ప్రకారం, ఇటువంటి క్లెయిము ఉద్యోగి స్వయంగా దాఖలు చేయవచ్చు లేదా ఎవరైనా న్యాయవాది లేదా కార్మికుల పక్షాన నమోదిత ట్రేడ్ యూనియన్ అధికారి దాఖలు చేయవచ్చు.
ఈ సమాచారాన్ని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి గురువారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా ఇచ్చారు.
***
(Release ID: 1910245)
Visitor Counter : 842