కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక భద్రతా పథకాల పర్యవేక్షణ మరియు లక్షిత డెలివరీ కోసం


రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలతో ఇ-శ్రమ్ డేటా భాగస్వామ్యం చేయబడుతోంది

प्रविष्टि तिथि: 23 MAR 2023 4:57PM by PIB Hyderabad

అసంఘటిత/వ లస కార్మికుల సమగ్ర జాతీయ డేటాబేస్‌ను రూపొందించడానికి కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ 26.08.2021న ఇ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దేశంలోని అసంఘటిత/వలస కార్మికులందరికీ ఇ-శ్రమ్‌లో రిజిస్ట్రేషన్ స్వీయ-ప్రకటన ఆధారంగా ఉంటుంది. 14.03.2023 నాటికి, 28.66 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.  ఇ శ్రామ్ రిజిస్ట్రేషన్‌కు సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను సులభతరం చేయడానికి, ఇ-శ్రమ్ పోర్టల్ ప్రధాన మంత్రి శ్రమ-యోగి మంధన్ (పీఎం-ఎస్.వై.ఎమ్) పోర్టల్‌తో అనుసంధానించబడింది.  ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నవారు ఈ ఏకీకరణ ద్వారా పీఎం-ఎస్.వై.ఎమ్ పెన్షన్ స్కీమ్ యొక్క ప్రయోజనాలను సజావుగా పొందవచ్చు. ఇ-శ్రమ్ పోర్టల్ కూడా నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌తో అనుసంధానించబడి ఉంది. ఇ శ్రామ్ రిజిస్ట్రెంట్‌లు ఎన్‌సిఎస్ పోర్టల్‌లో సజావుగా నమోదు చేసుకోవచ్చు మరియు తగిన ఉద్యోగ అవకాశాల కోసం వెతకవచ్చు. రాష్ట్ర/ యుటి ప్రభుత్వాలతో ఇ శ్రమ్ యొక్క డేటా పంపకాలు ప్రారంభించబడింది, ఇది సంబంధిత రాష్ట్ర/ యుటీ ప్రభుత్వాలు అమలు చేసే సామాజిక భద్రత/ సంక్షేమ పథకాల లక్ష్య డెలివరీ మరియు పర్యవేక్షణను సులభతరం చేస్తుంది. ఇంకా, సంక్షేమ పథకాల పర్యవేక్షణ మరియు లక్ష్య డెలివరీ కోసం కేంద్ర మంత్రిత్వ శాఖలు /డిపార్ట్‌మెంట్‌లతో ఈశ్రమ్ డేటా మార్పిడి కోసం 02.03.23న కేంద్ర మంత్రిత్వ శాఖలు/ శాఖలతో డేటా షేరింగ్ మార్గదర్శకాలు కూడా జారీ చేయబడ్డాయి.  ఈ సమాచారాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి రాజ్యసభలో ఒక  లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


(रिलीज़ आईडी: 1910244) आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu