కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్య పింఛన్ అందించే ప్రధాన మంత్రి శ్రమ యోగిమాన్-ధన్ (పీఎం- ఎస్ వై ఎం) పథకం

Posted On: 23 MAR 2023 4:59PM by PIB Hyderabad

అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం, 2008 ప్రకారం, చిరు వ్యాపారులు, వీధి కార్మికులతో సహా అసంఘటిత రంగ కార్మికులకు జీవితం, అంగ వైకల్యం, ఆరోగ్య , ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ మొదలైన విషయాలలో తగిన సంక్షేమ పథకాలను రూపొందించడం ద్వారా సామాజిక భద్రతను కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సామాజిక భద్రతా పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.

 

(i) ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన

(పిఎంఎస్ బివై) ద్వారా జీవిత, వికలాంగుల బీమా లభిస్తుంది. బ్యాంక్/ పోస్టాఫీస్ ఖాతా ఉన్న 18 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఆటో డెబిట్ లో చేరడానికి / ప్రారంభించడానికి తమ సమ్మతిని తెలియజేసేవారికి పిఎంజెజెబివై అందుబాటులో ఉంది.

ఈ పథకం కింద రిస్క్ కవరేజీ రూ.2.00 లక్షలు, ఏదైనా కారణం వల్ల బీమాదారుడు మరణిస్తే, వార్షిక ప్రీమియం రూ.436/- చందాదారుల బ్యాంక్/ పోస్టాఫీస్ ఖాతా నుంచి ఆటో డెబిట్ చేయాలి. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పిఎంఎస్ బి వై ) 18 నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగి బ్యాంక్ / పోస్టాఫీసు ఖాతా ఉన్నవారికి అందుబాటులో ఉంది, వారు ఆటో డెబిట్ లో చేరడానికి / ప్రారంభించడానికి తమ సమ్మతిని తెలియచేయాలి. ప్రమాదవశాత్తు మరణం లేదా సంపూర్ణ శాశ్వత వైకల్యానికి రూ.2.00 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.1.00 లక్షలు ఈ పథకం కింద రిస్క్ కవరేజీ లభిస్తుంది. ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించి ఆటో డెబిట్ ద్వారా ఖాతాదారుడి బ్యాంకు/పోస్టాఫీస్ ఖాతా నుంచి మినహాయించుకోవాల్సి ఉంటుంది.

 

(ii) ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబిపిఎంజెఎవై) 27 స్పెషాలిటీలలో 1949 చికిత్సా విధానాలకు అనుగుణంగా ద్వితీయ ,తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరడానికి అర్హులైన ప్రతి కుటుంబానికి రూ .5 లక్షల వార్షిక ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ఇది పూర్తిగా నగదు రహిత, కాగిత రహిత పథకం. ఏబీ-పీఎంజేఏవై కింద లబ్ధి పొందే కుటుంబాలను 2011 సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 6 నిరుపేదరికం , 11 వృత్తి ప్రమాణాల ఆధారంగా గుర్తించారు.

 

(iii) వృద్ధాప్య రక్షణను అందించడానికి, భారత ప్రభుత్వం 2019 లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పిఎం- ఎస్ వై ఎం ) పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఇది 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తుంది. నెలవారీ ఆదాయం రూ.15,000/- లేదా అంతకంటే తక్కువ ఉండి, ఈపీఎఫ్ఓ/ ఈఎస్ఐసీ/ ఎన్పీఎస్ (ప్రభుత్వ నిధులతో) సభ్యులు కాని 18-40 ఏళ్ల మధ్య వయస్సు గల కార్మికులు పిఎం- ఎస్ వై ఎం స్కీమ్ లో చేరవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారుడు నెలవారీ కంట్రిబ్యూషన్ 50% చెల్లిస్తే అంతే మొత్తాన్ని (మ్యాచింగ్ కంట్రిబ్యూషన్) కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కోసం నిధులను ఎల్ఐసీకి ఫండ్ మేనేజర్ గా అందిస్తారు.

 

(iv) కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రతికూలంగా ప్రభావితమైన వీధి వ్యాపారులకు వారి వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం జూన్ 01, 2020 న పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పిఎం స్వనిధి) పథకాన్ని ప్రారంభించింది.

ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పిఎం స్వనిధి పథకం) కోసం లబ్ధిదారులకు సంబంధించిన రాష్ట్రాలవారీ డేటా అనుబంధం-1 లో ఉంది.

 

పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి పిఎమ్ ఎస్ వై ఎం పథకం భాగస్వాములందరితో మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. లబ్ధిదారుల సందేహాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు, పథకాల నిర్వహణ అంశాలను పర్యవేక్షించడానికి కాల్ సెంటర్, గ్రీవెన్స్ మేనేజ్ మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

 

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పీఎం- ఎస్ వై ఎం) పథకం కింద గత మూడేళ్లు, ప్రస్తుత సంవత్సరంలో కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు అనుబంధం-2 ప్రకారం ఉన్నాయి. ఫండ్ మేనేజర్ ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కాబట్టి రాష్ట్రాల వారీగా ఖర్చు లేదు. పిఎమ్ ఎస్ వైఎమ్ పథకం కిందరాష్ట్రాల వారీ నమోదు అనుబంధం-3 లో ఉంది.

 

ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్-ధన్ యోజన ప్రయోజనం 60 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే నెలకు రూ.3000/- పెన్షన్ రూపంలో లభిస్తుంది. ఈ పథకం కింద నమోదైన ఏ కార్మికుడికి 60 ఏళ్లు నిండలేదు.

 

అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించడం , చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులతో సహా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా పథకాలు / సంక్షేమ పథకాలను చేరవేయడాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం 2021 ఆగస్టులో ఇ-శ్రమ్ పోర్టల్ ను ప్రారంభించింది.

 

***

 



(Release ID: 1910239) Visitor Counter : 208


Read this release in: English , Urdu