కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బాల మరియు కౌమార లేబర్ (నిషేధం మరియు నియంత్రణ) చట్టం సమర్థవంతమైన అమలు కోసం పెన్సిల్ పోర్టల్ ఉపయోగించబడుతోంది

Posted On: 23 MAR 2023 5:00PM by PIB Hyderabad

ప్రభుత్వం చైల్డ్ లేబర్ (నిషేధం & నియంత్రణ) చట్టం, 1986ని రూపొందించింది, దీనిని 2016లో సవరించారు. సవరించిన చట్టాన్ని బాల మరియు కౌమార లేబర్ (నిషేధం మరియు నియంత్రణ) [సిఏఎల్‌పిఆర్‌] చట్టం, 1986 అని పిలుస్తారు.ఏదైనా వృత్తి మరియు ప్రక్రియలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పని లేదా ఉపాధి మరియు ప్రమాదకర వృత్తులు మరియు ప్రక్రియలలో 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్నవారిని ఈ చట్టం పూర్తి నిషేధాన్ని అందిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరియు నేరాన్ని గుర్తించదగినదిగా చేసినందుకు యజమానులను కఠినంగా శిక్షించేలా సవరణ కూడా అందిస్తుంది.

బాల మరియు కౌమార లేబర్ (నిషేధం మరియు నియంత్రణ) చట్టం, 1986 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే పరిపాలన, ప్రధాన నౌకాశ్రయం, గని, చమురు క్షేత్రాలు మినహా  రాష్ట్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతుంది. విడుదలైన బాల కార్మికుల వివరాలు సిఏఎల్‌పీఆర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పరిశ్రమల యజమానులపై తీసుకున్న చర్యలు, సిఏఎల్‌పీఆర్ చట్టాన్ని ఉల్లంఘించిన వారి నుండి రికవరీ చేయబడిన జరిమానా మొత్తం మొదలైనవి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్వహించబడవు.

జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన జిల్లా ప్రాజెక్ట్ సొసైటీల ద్వారా బాల కార్మికుల పునరావాసం కోసం కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ (ఎన్‌సిఎల్‌పి) పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్‌సిఎల్‌పి పథకం కింద, 9-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలను రక్షిస్తారు/ పని నుండి ఉపసంహరించుకుంటారు మరియు ఎన్‌సిఎల్‌పి ప్రత్యేక శిక్షణా కేంద్రాలలో (ఎస్‌టిసిలు) నమోదు చేయబడతారు. వారికి అక్కడ  వారధి విద్య, వృత్తిపరమైన శిక్షణ, మధ్యాహ్న భోజనం, అధికారిక విద్యా విధానంలో ప్రధాన స్రవంతిలోకి రావడానికి ముందు స్టైఫండ్, ఆరోగ్య సంరక్షణ మొదలైనవి అందించబడతాయి. ఎన్‌సిఎల్‌పి పథకం ఇప్పుడు 01.04.2021 నుండి సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) పథకం కింద ఉపసంహరించబడింది. ఇక నుండి రక్షించబడిన బాలకార్మికులు ఎస్‌ఎస్‌ఏ కింద ఎస్‌టీసీ కార్యాచరణ ద్వారా అధికారిక విద్యా విధానంలో ప్రధాన స్రవంతిలోకి ప్రవేశిస్తారు.

ఇంకా సిఏఎల్‌పిఆర్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్ పెన్సిల్ (బాల కార్మికులను నిరోధించే ప్రభావవంతమైన అమలు కోసం వేదిక)ను అభివృద్ధి చేసింది. బాల కార్మికులకు సంబంధించిన ఫిర్యాదును నమోదు చేయడానికి పోర్టల్‌లో అవకాశం ఉంది. ఈ ఫిర్యాదులను జిల్లాలోని సంబంధిత జిల్లా నోడల్ అధికారులు పరిష్కరిస్తారు. అంతేకాకుండా, కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్ మరియు వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా బాల కార్మికుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.

1988లో పథకం ప్రారంభించినప్పటి నుంచి జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ (ఎన్‌సీఎల్‌పి) పథకం కింద దాదాపు 14 లక్షల మంది బాల కార్మికులు రక్షించబడ్డారు/ఉపసంహరించబడ్డారు, పునరావాసం కల్పించబడ్డారు మరియు ప్రధాన స్రవంతిలో చేర్చబడ్డారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (17.03.2023 వరకు) ఎస్‌టిసీలను నిర్వహించడానికి జిల్లా ప్రాజెక్ట్ సొసైటీకి రూ.12.45 కోట్లు విడుదల చేయబడ్డాయి మరియు ఎన్‌సిఎల్‌పి పథకం కింద ఎస్‌టిసిలలో చేరిన పిల్లలకు స్టైఫండ్‌గా రూ.3.20 కోట్లు విడుదలయ్యాయి.

ఈ సమాచారాన్ని కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

******


(Release ID: 1910234) Visitor Counter : 577


Read this release in: English , Urdu