ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

క్వాంటమ్ కంప్యూటింగ్, ఐఓటీ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కలిసి పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్న యూఐడీఏఐ, సెట్స్


సామర్థ్యాన్ని పెంపొందించడం, సమాచార భద్రతపై స్వావలంబన సాధించడానికి అమలు జరుగుతున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన

Posted On: 23 MAR 2023 7:27PM by PIB Hyderabad

డీప్ టెక్ రంగంలో పరికరాలు,  ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడే  పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను   సంయుక్తంగా చేపట్టాలని  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ), సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ ( సెట్స్)నిర్ణయించాయి. 

అవగాహన ఒప్పందంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ సెక్యూరిటీ, మొబైల్ డివైజ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ నెట్ వర్క్ స్లైస్ సెక్యూరిటీ, హార్డ్ వేర్ సెక్యూరిటీ వంటి డీప్ టెక్, ఎమర్జింగ్ టెక్ రంగాల్లో రెండు సంస్థలు సంయుక్త పరిశోధనలు చేపడతాయి. 

'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా సమాచార, సైబర్ భద్రతపై స్వావలంబనను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ లో ప్రాధాన్యతా రంగాలైన  క్వాంటమ్ ర్యాండమ్ నంబర్ జనరేటర్, క్రిప్టో ఏపీఐ లైబ్రరీ, క్వాంటమ్ సేఫ్ క్రిప్టోగ్రఫీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ పై రెండు సంస్థల శాస్త్రవేత్తలు, అధికారులు కలిసి పని చేస్తారు. 

అవగాహన ఒప్పందం ప్రకారం యుఐడిఎఐ  వ్యవస్థలో మాత్రమే కాకుండా ఇతర క్లిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాల రంగంలో కూడా ఉపయోగించడానికి అనువైన పరికరాలు  / ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి సెట్స్ , యుఐడిఎఐ అధికారులు సంయుక్తంగా పరిశోధన  ప్రాజెక్టులను సిద్ధం చేసి  అమలు చేయడానికి  చేయడానికి కృషి చేస్తారు. 

సుపరిపాలన సాధించడానికి దేశంలో అందుబాటులో ఉన్న  విస్తృతమైన డిజిటల్ వ్యవస్థ ఉపయోగపడుతోంది. డిజిటల్  సాంకేతిక పరిజ్ఞానం అమలుకు ప్రాధాన్యత ఇస్తున్న భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం,  నిరంతర అప్ గ్రేడ్ అంశాలపై దృష్టి సారించింది.  ఆధార్ 2.0 కార్యాచరణ రూపకల్పన అంశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు కీలకంగా ఉంటుంది.

యుఐడిఎఐ 1.36 బిలియన్లకు పైగా ఆధార్ నంబర్లను ప్రజలకు జారీ చేసింది. దేశంలో ప్రతిరోజూ 70 మిలియన్లకు పైగా ఆధార్ ఆధారిత ధృవీకరణ లావాదేవీలు జరుగుతున్నాయి. సంక్షేమం, సుపరిపాలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 1,700 పథకాలు  ఆధార్ ఆధారంగా అమలు జరుగుతున్నాయి. 

***

 (Release ID: 1910233) Visitor Counter : 129


Read this release in: English , Hindi