పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిరమైన, వాతావరణాన్ని తట్టుకోగలిగే తీరప్రాంత మౌలిక సదుపాయాలు మరియు తీర ప్రాంత ప్రజల జీవనోపాధిపై దృష్టి సారించి నీలి ఆర్థిక వ్యవస్థ కి ప్రభుత్వం భారీ ప్రాధాన్యతనిస్తుందని శ్రీ భూపేందర్ యాదవ్ చెప్పారు.


బహుళ నిర్వహణ లక్ష్యాలతో ప్రాంతఆధారిత నిర్వహణ కోసం బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సముద్ర ప్రాదేశిక ప్రణాళిక (MSP)తో ముందుకు సాగుతోంది: శ్రీ యాదవ్

Posted On: 22 MAR 2023 2:38PM by PIB Hyderabad

పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) ఆధ్వర్యంలోని సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (NCSCM) 1వ జనరల్ బాడీ సమావేశానికి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు.

 

సుస్థిరమైన మరియు వాతావరణాన్ని తట్టుకోగల తీరప్రాంత మౌలిక సదుపాయాలు మరియు తీర ప్రాంత  ప్రజల జీవనోపాధిపై దృష్టి సారించి నీలి ఆర్థిక వ్యవస్థకి ప్రధాన మంత్రి భారీ ప్రాముఖ్యతను ఇస్తున్నారని ఆయన నొక్కి చెప్పారు.

 

బహుళ నిర్వహణ లక్ష్యాలతో ప్రాంత ఆధారిత నిర్వహణ కోసం బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సముద్ర ప్రాదేశిక ప్రణాళిక (MSP)తో ముందుకు సాగుతున్నదని శ్రీ యాదవ్ చెప్పారు. తీరప్రాంత సమాజాలకు ప్రత్యక్ష ఆదాయంపై దృష్టి సారించి మడ అడవుల సంరక్షణ కోసం మిషన్ ఎం ఐ ఎస్ హెచ్ టీ ఐ (మడ అడవులు మరియు ప్రత్యక్ష ఆదాయాల కోసం మాంగ్రోవ్ ఇనిషియేటివ్) సహకారం అందించాలని మంత్రి ఎన్ సీ ఎస్ సీ ఎం ని ఆదేశించారు.

 

తీరప్రాంతాలపై రక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణ మరియు విధాన సలహాలకు మద్దతునిచ్చే పరిశోధనా సంస్థగా ఎన్ సీ ఎస్ సీ ఎం ఫిబ్రవరి 2011లో  స్థాపించబడింది. ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాల ప్రయోజనం మరియు శ్రేయస్సు కోసం పెరిగిన భాగస్వామ్యాలు, పరిరక్షణ పద్ధతులు, శాస్త్రీయ పరిశోధన మరియు విజ్ఞాన నిర్వహణ ద్వారా స్థిరమైన తీరాలను ప్రోత్సహించడం ఎన్ సీ ఎస్ సీ ఎం యొక్క లక్ష్యం.

 

 34,000 చ.కి.మీ కంటే ఎక్కువ మ్యాపింగ్, సున్నిత పర్యావరణ ప్రాంతాలు (ESA), సమగ్ర ప్రమాద రేఖ మ్యాపింగ్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నోటిఫికేషన్‌లు, 2011 మరియు 2019 ప్రకారం తీరప్రాంత నిర్వహణ ప్రణాళికల తయారీ, సంచిత తీరప్రాంత పర్యావరణ ప్రభావ అంచనా, పర్యావరణ వ్యవస్థ వస్తువులు మరియు సేవలు, నీలం కార్బన్ సీక్వెస్ట్రేషన్, ఎకోసిస్టమ్ హెల్త్ రిపోర్ట్ కార్డ్‌లు  వంటి అనేక మైలురాయి పరిశోధన అధ్యయనాలను నేషనల్ సెంటర్ చేపట్టింది.  

***


(Release ID: 1909726) Visitor Counter : 155
Read this release in: English , Urdu , Hindi