ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఔషధాల తయారీ యూనిట్ల నియంత్రణ యంత్రాంగంపై తాజా సమాచారం
ఔషధాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన నేరాల సత్వర విచారణకు
ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు
Posted On:
21 MAR 2023 2:56PM by PIB Hyderabad
దేశంలోని వివిధ రాష్ట్రాలలో లైసెన్సుల జారీ అధికారులతో కలసి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సి డి ఎస్ సి ఓ) సమన్వయంతో ఔషధాల తయారీ యూనిట్లలో తనిఖీలు నిర్వహిస్తుంది. ఔషధాల నియమావళి, 1945 ప్రకారం ప్రమాదాలకు తావులేని విధంగా మంచి ఉత్పాదక అలవాట్లకు అనుగుణంగా వారు నియమ నిబంధనలు అమలుపరుస్తున్నారా లేదా అని వారు తనిఖీలు నిర్వహిస్తారు.
నిర్దిష్ట మంచి ఉత్పాదక అలవాట్లతో పాటు ప్రయోగశాలల్లో మంచి ఆచరణకు అనుగుణంగా ఉత్పత్తి సదుపాయాలలో నియమావళి అమలు జరుగుతుందా లేదా అని తెలుసుకునేందుకు జరిపే తనిఖీలకు నిర్దేశిత మార్గదర్శకాలు మరియు ప్రాథమిక సూచిక
ఉంది.
దేశంలో నాణ్యమైన మందుల ఉత్పత్తి జరిగేలా నిశ్చయ పరచుకునేందుకు సి డి ఎస్ సి ఓ మరియు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కింది విధంగా నియంత్రణ చర్యలు తీసుకున్నాయి.
ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం, 1940ని ఔషధాలు&సౌందర్య సాధనాల(సవరణ) చట్టం, 2008 ద్వారా సవరించారు. నకిలీ, కల్తీ మందులు తయారు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ఈ సవరణ వీలుకల్పిస్తుంది. కొన్ని నేరాలను శిక్షార్హమైన మరియు జామీనుకు వీలులేని విధంగా కూడా మార్చారు.
ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం కింద నమోదైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణను సత్వరం పూర్తిచేయడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేశాయి.
సి డి ఎస్ సి ఓ సంస్థలో మంజూరైన పోస్టుల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెంచారు.
ఔషధాలు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు ఔషధాలు మరియు సౌందర్య సాధనాల నియమావళి, 1945ను సవరించారు. కొన్ని ఔషధాలకు సంబంధించిన నోటి ద్వారా తీసుకునే మందుల తయారీకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుతో పాటు జీవసంబంధ తుల్యత అధ్యయనం ఫలితాలను కూడా జత చేయవలసి ఉంటుంది.
సవరించిన ఔషధాలు మరియు సౌందర్య సాధనాల నియమావళి, 1945 ప్రకారం ఔషధాల తయారీ లైసెన్స్ జారీకి ముందు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఔషధాల తనిఖీ అధికారులు ఉమ్మడిగా తయారీ సంస్థను తప్పనిసరిగా (నిర్బంధాచరణ) తనిఖీ చేయాలి.
రాష్ట్రస్థాయి లైసెన్స్ మంజూరు సంస్థ/అధికారి ఔషధాల తయారీ లైసెన్స్ మంజూరు చేయడానికి ముందుగా తయారీ కేంద్రం/యూనిట్
సుస్థిరత, భద్రతకు సంబంధించిన రుజువులను దరఖాస్తుదారు సమర్పించడాన్ని తప్పనిసరి చేస్తూ ఔషధాలు మరియు సౌందర్య సాధనాల నియమావళి, 1945ను సవరించారు.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1909449)