ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో నూతన కాన్సర్ కేంద్రాల ఏర్పాటుపై తాజా సమాచారం
ఎన్‌పిసిడిసిఎస్ కింద 708 జిల్లా ఎన్‌సిడి క్లినిక్‌లు, 301 జిల్లా డే కేర్ కేంద్రాలు, 5671 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్ర ఎన్‌సిడి క్లినిక్‌ల ఏర్పాటు
Posted On:
21 MAR 2023 3:00PM by PIB Hyderabad
జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా కాన్సర్, మధుమేహం, గుండె కండరాలకు సంబంధించిన వ్యాధులు, స్ట్రోక్ ( ఎన్‌పిసిడిసిఎస్) నియంత్రణ, నివారణ అన్న జాతీయ కార్యక్రమం కింద రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య & కుటుంబ సంక్షేమ విభాగం సాంకేతిక & ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. ఇది రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందుకున్న ప్రతిపాదన ఆధారంగా, వనరుల పరిమితులకు లోబడి ఉంటుంది. ఎన్‌పిసిడిసిఎస్‌లో కాన్సర్ అంతర్భాగం. ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రోత్సాహం & కాన్సర్ నివారణకు అవగాహనను కల్పించడం, తొలి దశలో గుర్తించడం, నిర్వహణ, కాన్సర్ సహా అంటు వ్యాధులు కాని వ్యాధుల చికిత్స కోసం తగిన ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి పంపడంపై దృష్టిపెడుతుంది. ఎన్‌పిసిడిసిఎస్ కింద 708 జిల్లా ఎన్‌సిడి క్లినిక్‌లు, 301 జిల్లా డే కేర్ సెంటర్లు, 5671 కమ్యూనిటీ ఆరోగ్య ఎన్‌సిడి క్లినిక్‌లను ఏర్పాటు చేశారు.
భారత ఆరోగ్య & కుటుంబ సంక్షేమ విభాగం తృతీయ కాన్సర్ సంరక్షణ కేంద్రాల సౌకర్యాల పథకాన్ని బలోపేతం చేసే పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర కేంద్ర సంస్థలు (ఎస్‌సిఐ)ను, టెర్షియరీ కేర్ కాన్సర్ సెంటర్లు (టిసిసిసి)లను దేశంలోని భిన్న ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు, 19 రాష్ట్ర కాన్సర్ సంస్థలను (ఎస్‌సిఐ)లను, 20 తృతీయ కాన్సర్ సంరక్షణ కేంద్రాలను (టిసిసిఐ) ఏర్పాటు చేసేందుకు తోడ్పడాలని ఈ పథకం కింద ఆమోదాన్ని తెలిపింది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఆమోదిత ఎస్‌సిఐలు/ టిసిసిసిఐల జాబితాను అనెక్చర్-1లో జతపరచడమైంది.
ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్ఎస్‌వై) కింద ఆంకాలజీ (కాన్సర్ అధ్యయనం)లోని పలు అంశాలపై దృష్టి పెట్టేందుకు ఉనికిలో ఉన్న, నూతన ఎయిమ్స్ (ఎఐఐఎంఎస్), అనేక సంస్థల ఆధునీకరణ కోసం ఆమోదాన్ని తెలిపడం జరిగింది. వివరాలను అనెక్చర్ -2లో జతపరచడం జరిగింది. ఝజ్జర్ (హర్యానా)లోని జాతీయ కాన్సర్ ఇనిస్టిట్యూట్, కోల్‌కతలోని చిత్తరంజన్ జాతీయ కాన్సర్ ఇనిస్టిట్యూట్ రెండవ క్యాంపస్ ఈ దిశలో తీసుకుంటున్న చర్యలకు తార్కాణం.
అణు ఇంధన విభాగం కూడా ఖర్గర్, వారణాసి (రెండు), గువాహతి, సంగ్రూర్, విశాఖపట్నం, న్యూ చండీగఢ్, ముజాఫర్‌పూర్‌లలో కాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాన్సర్ సంరక్షణ కోసం ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా సేవలను అందిస్తోంది.
***
(Release ID: 1909444)
Visitor Counter : 142