కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక భద్రతను సార్వత్రీకరించడం, మహిళలు,భవిష్యత్ పనిపరిస్థితులపై రెండు సంయుక్త ప్రకటనలు చేసిన ఎల్ 20 రెండు రోజుల ప్రారంభ సమావేశం.


సామాజిక భద్రతా పోర్టబిలిటీ, అంతర్జాతీయంగా ఉపాధి రంగంలో స్త్రీ ,పురుష అసమానతల తొలగింపునకు సంబంధించిన అంశాల పరిష్కారానికి పిలుపు.

Posted On: 20 MAR 2023 5:41PM by PIB Hyderabad

భారతదేశపు జి 20 అధ్యక్ష బాధ్యతలలో భాగంగా  పంజాబ్లోని అమృత్ సర్ లో  లేబర్ 20 (ఎల్ –20) చర్చల బృందం ప్రారంభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు రోజుల చర్చల అనంతరం  రెండు సంయుక్త ప్రకటనలను విడుదల చేశారు. అందులో మొదటిది జి 20 దేశాల మధ్య సామాజిక భద్రతా పోర్టబిలిటీ. దీని ద్వారా సామాజిక భద్రతను సార్వత్రికం చేయడం. రెండోది ప్రపంచ శ్రామిక శక్తిలో గల స్త్రీ ,పురుష అసమానతలను తొలగించడానికి సంబంధించినవి.

20 దేశాలకు చెందిన కార్మిక నాయకులు, కార్మిక అంశాల అధ్యయన నిపుణులు, ప్రతినిధులు భారతదేశపు జి 20 అధ్యక్షతన సామాజిక భద్రత సార్వత్రీకరణపై తొలి రోజు సమావేశంలో చర్చించారు. రెండో రోజు సమావేశంలో, మహిళలు,  భవిష్యత్ పని పరిస్థితులపై చర్చించారు.  ఈ రెండు సమావేశాలలో ఆయా అంశాలకు సంబంధించి లోతుగా చర్చలు సాగాయి.
సామాజిక భద్రత సార్వ  జనీనీకరణపై విడుదలైన సంయుక్త ప్రకటన, జి 20 దేశాలమధ్య పోర్టబిలిటీ ప్రయోజనాలను ప్రస్తావించింది.  ఈ దిశగా బ్రిక్స్ ఇంట్రా గ్రూప్ ఏర్పాటుపై జరిగిన చర్చలను ప్రస్తావించారు. జి–20 లో బ్రిక్స్ దేశాలు కూడా ఉండడం గమనార్హం.
మహిళలు, భవిష్యత్ పనిపరిస్థితులపై కూడా ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ఇది అంతర్జాతీయంగా సాంకేతికత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకునేందుకు, అలాగే  కోవిడ్ అనంతర పరిస్థితులలో, మహిళా సిబ్బందికి నైపుణ్యాలలో శిక్షణ నిచ్చే బాధ్యతను ప్రభుత్వాలు, యాజమాన్యాలు స్వీకరించాలని పిలుపునిచ్చింది. మహిళలు వివిధ రంగాలలో చేస్తున్న కృషిని, కుటుంబాలను పైకి తీసుకురావడంలో వారి పాత్రను ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు వారి తోడ్పాటును గుర్తించాలన్నారు. వారి పాత్రకు విలువ కల్పించాలని పేర్కొన్నారు.

కేంద్ర కార్మిక  ఉపాధి కల్పన శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ , ఈ సమావేశాలకు విచ్చేసిన ప్రతినిధులనుద్దేశించి మార్చి 19న వర్చువల్ ప్లాట్ఫారం ద్వారా ప్రసంగించారు.  కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రపంచం తిరిగి కోలుకునేందుక సంకల్పం చెప్పుకునిందని, ఇది మానవ విలువల కేంద్రితంగా ఉండేలా చూసేందుకు కార్మికులకు నైపుణ్యాలు, ప్రస్తుత పరిస్థులకు నిలదొక్కుకునేలా  విజ్ఞానం అందించాలన్నారు.
సార్వత్రిక సామాజిక భద్రతా పోర్టబిలిటీ , ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన అంశమని, జి–20, ఎల్ –20లు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. అవ్యవస్థీకృత రంగాన్ని సామాజిక భద్రత పరిధి కిందికి తీసుకురావాలని ఆయన అన్నారు. సామాజిక భద్రతలో సామాజిక బీమా, సామాజిక సహాయ పథకాలు రెండూ ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మొదీ దార్శనికత అయిన నారీ శక్తి, లేదా మహిళా శక్తి గురించి ప్రస్తావిస్తూ, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని, దీనిద్వారా సమానత్వంతో కూడిన, సమ్మిళిత, అభివృద్ధి చెందిన సమాజం ఏర్పడడానికి వీలు కలుగుతుందన్నారు.

రష్యా, ఇండియా, ఆస్ట్రేలియా, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ప్రతినిధులు వేతనాలు, దానికి సంబంధించిన వివిధ కోణాలపై తమ అనుభవాలను ప్రత్యేకించి జీవనోపాథిపై దాని ప్రభావాన్ని ప్రస్తావించారు. అ సమావేశాలో రష్యా ఎఫ్.ఎన్.పి.ఆర్ కు చెందిన సుశ్ఈర నటాలియా క్లిమోవా, తద్తోపంత్ తెంగ్డీ  నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శ్రీ అభిషేక్, ఆస్ట్రేలియా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అనిస్ చౌదరి,
నేపాల్ లోని నేపాలల్ నేషనల్ లేబర్ యూనియన్ కు చెందిన శ్రీ గోవింద్ పౌడెల్, వివిజి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ సలహాదారు శ్రీమతి ప్రజ్ఞా పరందే,  మారిషస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు చెందిన శ్రీ దివాన్ క్యుడో  బంగ్లాదేశ్ కు చెందిన జాతీయ శ్రామిక్ జోతే కుచెందిన శ్రీ కనక్ కుమార్ బర్మన్ లు ప్రసంగించారు.
మహిళా శ్రామికులపై జరిగిన సమావేశంలో భవిష్యత్లో పని పరిస్థితులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టర్ అదితి ఎన్.పాశ్వాన్, చేతన కాన్షియస్ ఆఫ్ ఉమన్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్, శ్రీమతి వాణి మనోరాజ్, వివిజి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ ఎలినా సమంతారాయ్, ఐహెచ్.డి నుంచి  ఆ సంస్థ డైరక్టర్ ప్రొఫెసర్ అలక్ ఎన్.శర్మ, శ్రీలంక లోని యూనివర్సిటీ ఆఫ్ పెరాడెనియా నుంచి శ్రీమతి శ్యామతి రణరాజ, రష్యా ఎఫ్ఎన్పిఆర్ నుంచి  ఎవగెని మాకరోవ్, చైనా ఎసిఎఫ్ టియు నుంచి జియాన్ జాంగ్ పాల్గొన్నారు.

***


(Release ID: 1908997) Visitor Counter : 108


Read this release in: English , Urdu