పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్టీఓ) కోసం సరళీకృత విధాన మార్గదర్శకాలు


- దేశంలో 30 అంతర్జాతీయ విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి

Posted On: 20 MAR 2023 4:23PM by PIB Hyderabad

భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటి మరియు ఇప్పటికే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఉంది. స్థిరమైన విధాన వాతావరణాన్ని అందించడం మరియు పోటీ దారితీసే వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం విమానయాన రంగానికి ముందస్తుగా మద్దతు ఇస్తోంది. 2016లో ప్రభుత్వం నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ (ఎన్.సి.ఎ.పి -2016)ని విడుదల చేసింది, ఇది ఈ రంగానికి సంబంధించిన విజన్, మిషన్ మరియు కీలక లక్ష్యాలను నిర్దేశించింది. విమానం/ హెలికాప్టర్లు/ డ్రోన్లు మరియు వాటి ఇంజన్లు మరియు ఇతర భాగాల కోసం ఎంఆర్ఓ పరిశ్రమ అభివృద్ధికి దేశంలో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 01.09.2021న కొత్త నిర్వహణ, మరమ్మతులు మరియు కార్యకలాపాల (ఎంఆర్ఓ) మార్గదర్శకాలను ప్రకటించింది. ఎంఆర్ఓ ఆపరేటర్లకు ఎలాంటి రాయల్టీ లేదా ఎలాంటి సెస్ విధించకుండా ఓపెన్ టెండర్ల ద్వారా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విమానాశ్రయాలలో భూమిని కేటాయించడం కోసం వివిధ మార్గదర్శకాలలో ఒకటి. అదేవిధంగా, సరళీకృత ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్టీఓ) మార్గదర్శకాలు ఆమోదించబడ్డాయి. ఇందులో విమానాశ్రయ రాయల్టీ (ఎఫ్టీఓలు ఏఏఐకి ఆదాయ వాటా చెల్లింపు) భావన రద్దు చేయబడింది మరియు పైలట్ల కొరతను పరిష్కరించడానికి ఎఫ్టీఓల ఏర్పాటును ప్రోత్సహించడానికి భూమి అద్దెలు గణనీయంగా హేతుబద్ధీకరించబడ్డాయి. డిమాండ్ మరియు వృద్ధిని సృష్టించే హెలికాప్టర్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం హెలికాప్టర్ ఆపరేషన్ విధానాన్ని కూడా రూపొందించింది.  అంతేకాకుండా, ఏఏఐ మరియు ఇతర పీపీపీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లు 2019-24లో ఏఏఐ ద్వారా దాదాపు రూ.25,000 కోట్లతో సహా రూ.98,000 కోట్ల కంటే ఎక్కువ కాపెక్స్ ప్లాన్‌ను ప్రారంభించారు, వివిధ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి/ అప్‌గ్రేడేషన్/ ఆధునీకరణ మరియు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం కోసం ప్రయాణీకుల పెరుగుదల మరియు విమాన ప్రయాణాన్ని సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా చేయండం లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రస్తుతం, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్, వారణాసి మరియు లక్నో అనే 3 అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా  దేశంలో 30 అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గుజరాత్‌లోని ధోలేరా మరియు హిరాసర్, మహారాష్ట్రలోని నవీ ముంబై మరియు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (జేవార్) అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపింది. అవి అభివృద్ధిలో ఉన్నాయి. విమానాశ్రయాలలో మౌలిక సదుపాయాలు/ సౌకర్యాల అప్‌గ్రేడేషన్ అనేది నిరంతర ప్రక్రియ, ఇది ఏఏఐ లేదా సంబంధిత ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లచే కార్యాచరణ అవసరాలు, ట్రాఫిక్ డిమాండ్, వాణిజ్య సాధ్యత మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని ఉత్తేజపరిచేందుకు, సామాన్యులకు విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా చేయడానికి ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్) - ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) 21-10-2016న ప్రారంభించింది. ఉడాన్ కింద, 28.02.2023 నాటికి 9 హెలిపోర్ట్‌లు & 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 74 అన్‌సర్వ్ చేయని మరియు తక్కువ సేవలందించే విమానాశ్రయాలను కలిపే విధంఆ 469 మార్గాలు ప్రారంభించబడ్డాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా  ఈ సమాచారాన్ని అందించారు.

 

*****



(Release ID: 1908993) Visitor Counter : 97


Read this release in: English , Urdu