వ్యవసాయ మంత్రిత్వ శాఖ
మెరుగైన రకాలు, మెరుగైన షెల్ఫ్ లైఫ్, సమర్థవంతమైన ప్రాసెసింగ్ , మార్కెట్లకు ప్రాప్యత ఇవన్నీ చిరుధాన్యాల విలువ గొలుసును బలోపేతం చేయడానికి చాలా ముఖ్యమైనవి: వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి చెప్పారు.
"చిరుధాన్యాల విలువ గొలుసు రంగాలన్నింటిలో మనం పరిశోధన- అభివృద్ధిని చేపట్టాలి": డాక్టర్ విజయ లక్ష్మి నాదెండ్ల, సంయుక్త కార్యదర్శి, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
ప్రతి ఎఫ్ పి ఒ డైరెక్టర్ల బోర్డులో ఒక మహిళను చేర్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
Posted On:
19 MAR 2023 7:29PM by PIB Hyderabad
మెరుగైన రకాలు, మెరుగైన షెల్ఫ్ లైఫ్, సమర్థవంతమైన ప్రాసెసింగ్ ,మార్కెట్లకు ప్రాప్యత ఇవన్నీ చిరుధాన్యాల విలువ గొలుసును బలోపేతం చేయడానికి చాలా ముఖ్యమైనవని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
చిరుధాన్యాల విలువ గొలుసులోని అన్ని రంగాల్లో పరిశోధన, అభివృద్ధి చేపట్టి, ఉత్పత్తి, ప్రాసెసింగ్, స్టోరేజీ పరిజ్ఞానాన్ని ఒకచోట చేర్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయ లక్ష్మి నాదెండ్ల అన్నారు. ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సులో ఫిక్కీ నిర్వహించిన 'సహకార విధానంతో చిరుధాన్యాల విలువ గొలుసును బలోపేతం చేయడం' అనే అంశంపై ప్లీనరీ సెషన్ లో ఆమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా చిరు ధాన్యాలపై కార్టెవా అగ్రిసైన్స్ కు చెందిన ఫిక్కీ టాస్క్ ఫోర్స్ అండ్ డైరెక్టర్ సీడ్స్ , దక్షిణాసియా చైర్మన్ జితేంద్ర జోషి మాట్లాడుతూ, చిరుధాన్యాలు పోషక సమృద్ధిగా, సాగు చేయడానికి సులభమైనవి, పర్యావరణ ప్రభావం లేని సుస్థిర రైతు స్నేహపూర్వక పంట అని అన్నారు. ‘వ్యక్తిగత ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్యానికి చిరుధాన్యాలు పరిష్కారం అని ప్రధాని చక్కగా
వివరించినట్టు మన చిరుధాన్యాలను ప్రపంచ పటంలోకి తీసుకెళ్దామని’ ఆయన అన్నారు.
ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్ పి) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
సి ఎఫ్ ఒ మనోజ్ జునేజా మాట్లాడుతూ, ఆహార, పౌష్టికాహార భద్రత, జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, రైతుల సాధికారతకు చిరుధాన్యాలు కీలకమని నొక్కి చెప్పారు. "చిరుధాన్యాల బ్రాండ్ ను పునరుద్ధరించడానికి ,స్థితిస్థాపక ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడానికి ఇది సరైన సమయం", అని ఆయన అన్నారు. ఐటిసి లిమిటెడ్ అగ్రి అండ్ ఐటి బిజినెస్స్ గ్రూప్ హెడ్ శ్రీ శివకుమార్ ఎస్ మాట్లాడుతూ చిరుధాన్యాల విలువ గొలుసును సమకాలీకరించడం చిరుధాన్యాల ప్రమాణాలకు కీలకమైన అవసరం అని స్పష్టం చేశారు. ఈ విషయంలో చిరుధాన్యాల వాటాదారుల భాగస్వామ్యాలు ఇలాంటి సమకాలీకరణను సృష్టించడంలో కీలకమని ఆయన అన్నారు.
చెఫ్ హర్పాల్ సింగ్ సోఖీ మాట్లాడుతూ"చిరుధాన్యాలు భారతదేశపు ముత్యాలు; అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (శ్రీ అన్న) 2023 ప్రచారం ప్రపంచ వేదికపై జీవనశైలి ఉత్పత్తిగా స్థిరమైన భారతీయ ఉత్పత్తిని చేయడానికి ఒక గొప్ప అడుగు అని నేను భావిస్తున్నాను’’ అన్నారు. జస్ట్ ఆర్గానిక్ ఫౌండర్, ఎండీ పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ, వాటాదారులు అందరి నుంచి విత్తన కంపెనీలు మొదలుకుని రైతుల వరకు, చెఫ్ ల నుంచి మార్కెట్ల వరకు, చివరకు వినియోగదారులే భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మింకన్ ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ శ్రీమతి విశాలాక్షి ఉయ్యాల మాట్లాడుతూ, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సర ప్రచార లక్ష్యాలను సాధించడానికి, వాటిని మరింత సుస్థిరంగా మార్చడానికి వ్యవసాయ సమాజాలలో చిరుధాన్యాల ఆహారం , పంట సంస్కృతుల పునరుద్ధరణ చాలా ముఖ్యమైనదని అన్నారు.
'చిరుధాన్యాల విజయగాథను రూపొందించడానికి మహిళా సాధికారతకు అవకాశం' అనే అంశంపై జరిగిన మరో సెషన్ లో నాదెండ్ల మాట్లాడుతూ, సంప్రదాయ, ఉద్యాన, ఇతర పంటలతో సంబంధం లేకుండా వ్యవసాయంలో మహిళల సహకారం ఎనలేనిదన్నారు. ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తోందని, గిరాకీ పెరుగుతుండటంతో ఎక్కువ మంది మహిళలు చిరుధాన్యాల సాగులో నిమగ్నమవుతారని, తద్వారా నైపుణ్యం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రచారం గురించి నాదెండ్ల మాట్లాడుతూ, డిమాండ్ పెరుగుతుందని, మార్కెట్లు వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘’భారీ ఎగుమతి సామర్థ్యం కూడా ఉంది " అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 10,000 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ పి ఒ) కార్యక్రమం గురించి ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం "100% మహిళా ఎఫ్ పి ఒ లను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని, ప్రతి ఎఫ్ పి ఒ డైరెక్టర్ల బోర్డులో ఒక మహిళను చేర్చడానికి మార్గదర్శకాలను జారీ చేసిందని’’ చెప్పారు. మహిళా సాధికారత కోసం వివిధ చర్యలతో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో డెడికేటెడ్ ఎఫ్ పి ఒ ప్రోగ్రామ్ గురించి ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా మారికో చీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా మాట్లాడుతూ, పోషక భద్రతను నిర్ధారించడానికి చిరుధాన్యాలు ఒక మార్గమని, "ఇది కొత్త ధాన్యం కాదు; అయినా, స్థిరమైన నాణ్యత , లభ్యతను నిర్ధారించడం అవసరం " అని అన్నారు.
అంతేకాక, చిరుధాన్యాలు, సాంప్రదాయ పోషక ధాన్యాలు, మొత్తం సరఫరా గొలుసులోకి నిరంతర పెట్టుబడి అవసరమని, విలువ ఆధారిత ఉత్పత్తులను సృష్టించడం, పోషకాహార అవగాహనను సున్నితం చేయడం అవసరమని ఆమె అన్నారు.
బర్మాల్ట్ మాల్టింగ్ ఇండియా సిఇఒ శ్రీమతి అక్షి జిందాల్ మాట్లాడుతూ, చిరుధాన్యాలు పనిచేయడం సులభం, అంతులేని అవకాశాలను అందిస్తాయని అన్నారు. పోషకాహార నిపుణురాలు - చిరుధాన్యాలు శ్రీమతి లవ్నీత్ బాత్రా మాట్లాడుతూ, "మన సాంప్రదాయక ప్రధానమైన ఆహారం భవిష్యత్తుకు ఆహారం కావచ్చు, పోషకాహార లోపం ఊబకాయం రెట్టింపు భారానికి ఏకకాలంలో స్థిరమైన పరిష్కారం" అన్నారు. చిరుధాన్యాలు పసిపిల్లల నుంచి చిన్నపిల్లలు, వృద్ధుల వరకు అన్ని జీవరాశులకు అవసరమని ఆమె అన్నారు. అయితే, అవగాహన అనేది ఒక సమస్య అన్నారు. మిల్లేటమ్మ ఫౌండర్ రుచికా భువాల్క మాట్లాడుతూ, వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ వీడియోలను ప్రారంభించామని, రైతు మార్కెట్లను సందర్శించామని తెలిపారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ లోని నర్మదా ఎఫ్ పీసీ మాండ్లా బోర్డు సభ్యురాలు శ్రీమతి సుశీలా వట్టి మాట్లాడుతూ, తమ రైతు ఉత్పత్తిదారుల సంస్థ తన మొదటి చిరుధాన్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. చిరుధాన్యాలు - కోడోకుట్కి సాగు గురించి వారు తమ ప్రాంతంలో అవగాహన ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. దిండోరిలోని సామ్నాపూర్ లోని హల్చాలిట్ మహిళా కిసాన్ మహిళా ఉత్పత్తి సంస్థ ప్రెసిడెంట్ , వ్యవస్థాపక సభ్యురాలు శ్రీమతి జానకి మరావి మాట్లాడుతూ, తమ మహిళా ఉత్పత్తి సంస్థలో 1,200 మంది వాటాదారులు ఉన్నారని, 2022 లో 75 టన్నుల కోడోకుట్కి అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారు.
*****
(Release ID: 1908651)
Visitor Counter : 148