రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కర్ణాటకలోని బెంగళూరు - మైసూరు వినియోగ నియంత్రిత జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 275)


42+640 కి.మీ. వద్ద మురుగు నీటి పారుదల సమస్య

Posted On: 18 MAR 2023 8:27PM by PIB Hyderabad

కర్ణాటకలో నిన్న (17.03.2023) రాత్రి కురిసిన అధిక వర్షపాతం (0.1 మి.మీ. సాధారణ వర్షపాతానికి వ్యతిరేకంగా 3.9 మి.మీ.) కురిసింది. మురుగు నీటి పారుదల మార్గానికి గ్రామస్తులు అడ్డకట్ట వేయడం వల్ల 42.640 కి.మీ. వద్ద ఓవర్‌పాస్‌ను వరద ముంచెత్తింది.

మాదపుర గ్రామస్తులు, ఇతరులు తమ వ్యవసాయ భూముల్లోకి, గ్రామంలోకి వెళ్లిరావడానికి 42+640 కి.మీ. వద్ద సత్వర మార్గం కోసం ప్రయత్నించారు. నీటి పారుదలకు అడ్డంగా 3 మీటర్ల వెడల్పుతో మట్టికట్ట వేసి, సర్వీస్ రోడ్డు నుంచి తమ సొంత మార్గం ఏర్పాటు చేసుకున్నారు. నీటి పారుదలకు మట్టికట్ట అడ్డుపడటం వల్ల రహదారి మార్గం ముంపునకు గురైంది. 

గ్రామస్తులు నిర్మించిన మట్టికట్టను 18.03.2023 తెల్లవారుజామున తొలగించారు.

మాదపుర గ్రామం ప్రక్కనే ఉన్న పొలాల్లోకి రాకపోకలను సులువుగా మార్చడానికి 1.2 మీటర్ల పైప్‌తో 2 వరుసల పైపులైను వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పని జరుగుతోంది, ఈ రోజు రాత్రి 11.30 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది.

 

*****



(Release ID: 1908614) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Hindi , Kannada