రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

68 రోజుల విరామం అనంతరం వ్యూహాత్మక జోజి లా పాస్ను తిరిగి తెరిచిన సరిహద్దు రోడ్డు సంస్థ


లద్దాక్, గురేజ్ లోయకు అనుసంధానత పునరుద్ధరణ

Posted On: 16 MAR 2023 2:58PM by PIB Hyderabad

 

గ్రేటర్ హిమాలయన్ ప్రాంతంలో 2023 మార్చి 16న సరిహద్దు రోడ్డు సంస్థ (బిఆర్ఒ) వ్యూహాత్మక జోజిలా పాస్ను  తెరిచింది.
ఈ మార్గం 11,650 అడుగుల ఎత్తులో ఉంది. ఇది లద్దాక్ , జమ్ము కాశ్మీర్కు గేట్వే గాఉంది. ఈ మార్గంలో ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తూ
2023 జనవరి 6 వ తేదీ వరకు రాకపోకలకు అనుమతిచ్చారు. అయతే ఆ తర్వాత సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కేవలం 68  రోజుల పాటు ఈ మార్గాన్ని
మూసివేశారు. గత ఏడాది 73 రోజులు మూయగా, అంతకు ముందు సంవత్సరాలలో ఈమార్గంంం 160 నుంచి 180  రోజులు మూసి ఉంచుతూ వచ్చారు.

2023 ఫిబ్రవరి మొదటి వారం వరకు ఈ మార్గానికి ఇరువైపులా మంచు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ప్రాజెక్ట్ బికాన్, విజయక్
ద్వారా దీనిని తొలగించారు. లద్దాక్, జమ్ము కాశ్మీర్ వైపు దీనిని తొలగించారు. నిరంతరం మంచు తొలగించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా
జొజి లా పాస్ తో అనుసంధానతను మార్చి 11, 2023న పునరుద్ధరించారు. అనంతరం రోడ్డు పరిస్థితులను మెరుగుపరిచి, వాహనాల రాకపోకలకు
ఏర్పాట్లు చేశారు.
అలాగే రజదాన్ పాస్, గురెజ్ సెక్టర్, కాశ్మీర్ లోయ మద్ధ రోడ్డు అనుసంధానతను కల్పిస్తుంది. దీనిని కూడా 2023 మార్చి 16న పునరుద్ధరించారు.
 58 రోజుల వ్యవధిలోనే రాకపోకలకు అనువుగా మార్చారు. మరో ముఖ్యమైన మార్గం సాధన, పార్కియాన్గలి, జమిందార్ గాలి
లను శీతాకాలం మొత్తం రాకపోకలకు తెరిచి ఉంచారు.      
ఈ సందర్బంగా మాట్లాడుతూ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి, విఎస్.ఎం,డిజిబిఆర్, ప్రాజెక్టు బీకాన్, ప్రాజెక్టు విజయక్లో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. వీరు తక్కువ వ్యవధిలో  ఈ మార్గాలను పునరుద్ధరించినందుకు వారిని అభినందించారు.
త్వరగా జోజిలా, రాజ్దాన్ మార్గాలను పునరుద్ధరించడం వల్ల  లద్దాక్, గురాజ్ లోయకు అత్యవసర సరకుల రవాణాకు వీలుకలుగుతుందని,
చౌదరి అన్నారు.
వాహనాల రాకపోకల ట్రయల్ విజయవంతంగా పూర్తి అయిందని ఆయన చెప్పారు. పౌర పాలనా యంత్రాంగంతో కలిసి సంయుక్త తనిఖీ ల అనంతరం
రోడ్డును సివిల్ ట్రాఫిక్ను ప్రారంభించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు డిజిబిఆర్ తెలపారు.

***


(Release ID: 1908300) Visitor Counter : 149