నౌకారవాణా మంత్రిత్వ శాఖ
నమామి గంగే కార్యక్రమం కింద బీహార్, గోపాల్‌గంజ్‌లో రూ. 6.62 కోట్ల వ్యయంతో నారాయణి నది ఒడ్డున చేపట్టిన అభివృద్ధి పనులు
Posted On:
17 MAR 2023 4:12PM by PIB Hyderabad
నమామి గంగె కార్యక్రమం కింద బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని నారాయణి నది ఒడ్డు అభివృద్ధిని చేపట్టి, మొత్తం రూ.. 6.62 కోట్ల వ్యయంతో రెండు ఘాట్లను నిర్మించడం జరిగింది.
జాతీయ జలమార్గాల చట్టం, 2016 కింద దేశవ్యాప్తంగా 111 జాతీయ జలమార్గాలతో పాటు గండక్ నది (నారాయణి నది)ని భజసొలాటా బ్యారేజ్ నుంచి గండక్, హైపూర్ వద్ద గంగా నది సంగమం వరకు జాతీయ జలమార్గం (ఎన్‌డబ్ల్యు)-37 గా ప్రకటించారు.
గండక్ నది అధ్యయన నివేదికలలోని విషయాల ఆధారంగా, ఈ జలమార్గం షిప్పింగ్, ఓడప్రయాణానికి అనువుగా ఉన్నట్టు కనుగొన్నారు. అయితే, సంభావ్య రవాణా సరుకు అందుబాటులో లేకపోవడం, ఎన్‌డబ్ల్యు-37 మీదుగా ఉన్న నిర్మాణం - అంటే రేవా ఘాట్ బ్రిడ్జి కారణంగా, ఓడప్రయాణం/ వెర్టికల్ క్లియరెన్స్ వల్ల తక్కువగా ఉండడంతో, గండక్ నది (ఎన్‌డబ్ల్యు-37) పై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిలుపదల చేయడం జరిగింది.
ఈ సమాచారాన్ని, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనొవాల్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.
***
(Release ID: 1908078)
Visitor Counter : 152