భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భూకంప ప్రమాద తీవ్రత ప్రమాణాలు రూపొందించడానికి భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధ్యయనం

Posted On: 16 MAR 2023 5:06PM by PIB Hyderabad

సహజ సిద్ధ కారణాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. దీనిలో మానవ తప్పిదాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని భావించడం ఎల్లపుడూ సమంజసం కాదు. అయితే, నాన్- ఇంజనీరింగ్ నిర్మాణాలు ప్రతి ప్రాంతం పై  ప్రభావం చూపిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రమాద తీవ్రత తగ్గించడానికి అమలు చేయాల్సిన చర్యలు రూపొందించడానికి శాస్త్రీయ, ఇంజనీరింగ్ పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది.

భూకంపం వల్ల కలిగే ప్రకంపనాలు తట్టుకుని నిలబడ కలిగే భవనాలు/ మౌలిక సదుపాయాలు/నివాస గృహాలను నిర్మించడానికి  భూకంప ప్రభావిత  ప్రాంతాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.   భూకంప లేదా భూకంపాలకు గురయ్యే ప్రాంతాలను  భౌగోళిక, భౌగోళిక లక్షణాలకు సంబంధించి జోన్‌లుగా విభజించే మైక్రో జోనేషన్ అధ్యయనం నిర్వహిస్తారు. దీనివల్ల సంబంధిత ప్రాంతంలో వివిధ ప్రదేశాలలో భూకంప ప్రమాదాలను గుర్తించి ఆస్తి, ప్రాణ నష్టాలు తగ్గించడానికి చర్యలు రూపొందించవచ్చు. 

దేశంలో భూకంప పర్యవేక్షణ బాధ్యతను భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నిర్వర్తిస్తోంది. దేశవ్యాప్తంగా యంత్రాంగం కలిగి ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ దేశం వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన 152 అబ్జర్వేటరీలను నిర్వహిస్తూ భూకంపాలను అధ్యయనం చేస్తున్నది.  దేశం, దేశం  చుట్టుపక్కల సంభవిస్తున్న భూప్రకంపనలు గుర్తించే సామర్థ్యం  నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ కలిగి ఉంది. 3.0 తీవ్రత కలిగిన భూకంపాలను కూడా  గుర్తించే సామర్థ్యం సంస్థ కలిగి ఉంది . దేశంలో భూకంప పర్యవేక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో మరో 100 కొత్త అబ్జర్వేటరీలను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఈ సమాచారాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అందించారు. 

***


(Release ID: 1907816)
Read this release in: English , Urdu