భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
డీప్ ఓషన్ మిషన్ & సముద్ర వనరుల అధిక వినియోగం
Posted On:
16 MAR 2023 5:05PM by PIB Hyderabad
డీప్ ఓషన్ మిషన్ వల్ల సముద్ర వనరులను కార్పొరేట్ సంస్థలు అధికంగా దోపిడీ చేయలేవు, దేశంలోని మత్స్యకారుల జీవనోపాధిని ఇది ప్రభావితం చేయదు. లోతైన సముద్ర జలాల్లో ఉండే వనరులను అన్వేషించడం, వాటిని సుస్థిరంగా ఉపయోగించుకోవడం కోసం సాంకేతికతలను అభివృద్ధి చేయడం డీప్ ఓషన్ మిషన్ లక్ష్యం. కొత్త వనరులను గుర్తించడం, భవిష్యత్తులో వాటిని వినియోగించుకోవడానికి సరిపడా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి డీప్ ఓషన్ మిషన్‌ను రూపొందించడం జరిగింది. తద్వారా అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విస్త్రత చర్చల తర్వాత డీప్ ఓషన్ మిషన్‌ను రూపొందించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని రూపొందించేటప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిపుణులతో సంప్రదింపులు జరిగాయి.
డీప్ ఓషన్ మిషన్ అనేది నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది. చేపల పెంపకం, పర్యాటకం & సముద్ర రవాణా, పునరుత్పాదక శక్తి, ఆక్వాకల్చర్, సముద్ర గర్భ కార్యకలాపాలు, సముద్ర జీవసాంకేతికత వంటి నీలి ఆర్థిక వ్యవస్థలోని విభాగాలకు డీప్ ఓషన్ మిషన్ కార్యకలాపాలు సాయపడతాయి.
శాస్త్ర, సాంకేతికత, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డా. జితేంద్ర సింగ్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1907815)
Visitor Counter : 172