రైల్వే మంత్రిత్వ శాఖ
రాబోయే 20 సంవత్సరాలలో ఏడాదికి 80 వేల చక్రాలను తయారు చేసే సామర్థ్యంగల ఫోర్జ్ డ్ వీల్ ప్లాంట్ తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్న భారతీయ రైల్వే శాఖ
Posted On:
15 MAR 2023 5:36PM by PIB Hyderabad
దేశంలోనే ఫోర్జ్ డ్ చక్రాలను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేయడానికిగాను టెండర్లకు ఆహ్వానం
బిడ్లను వేసిన సంస్థలలో ఎల్ 1 గా నిలిచిన కలకత్తాకు చెందిన మెస్సర్స్ రామకృష్ణ ఫోర్జింగ్ లిమిటెడ్
ఎల్ 2గా నిలిచిన పుణే కు చెందిన మెస్సర్స్ భారత్ ఫోర్జ్
ఎల్ 3 గా నిలిచిన ఎస్ ఏ ఐ ఎల్
...............................
ఎలక్ట్రానిక్ వేదికద్వారా జరిగిన బిడ్డింగ్ ప్రక్రియ పోటీతత్వంతో, ఎలాంటి లొసుగులకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించారు.
నూతన కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మన రైళ్లకు కావాల్సిన ఫోర్జ్ డ్ చక్రాలను దేశీయ వనరులనుంచే తయారు చేసుకోవడం జరుగుతుంది.
భవిష్యత్తులో దిగుమతులకు ఆస్కారం లేకుండా దేశంలోనే తయారీ విధానానికి అనుగుణంగా అమలవుతున్న ప్రధానమైన నిర్ణయమిది.
...................
మన రైళ్లకు కావాల్సిన ఫోర్జ్ డ్ చక్రాలను దేశంలోనే తయారు చేసుకోవాలనే లక్ష్యంతో మన రైల్వేశాఖ టెండర్లకు ఆహ్వానం పలికింది. రానున్న రెండు దశాబ్దాలలో ప్రతి ఏడాది 80 వేల చక్రాలను తయారు చేసుకోవాలనే లక్ష్యంతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశీయ వనరులద్వారా ఈ పని చేయడం జరుగుతుంది. దేశంలో తయారీ విధానంద్వారా దిగుమతులను తగ్గించుకోవాలనే విధానంలో ఇది ముఖ్యమైన కార్యక్రమం.
పోటీవాతావరణంలో, పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించారు. టెండర్లను 24 జనవరి 2023న తెరవడం జరిగింది. మెస్సర్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మెస్సర్స్ భారత్ ఫోర్జ్ -పుణే, మెస్సర్స్ రామకృష్ణ ఫోర్జింగ్స్ - కోల్ కతా అనే సంస్థలనుంచి మూడు బిడ్లు వచ్చాయి. ధరల బిడ్డును 14-03-2023ను తెరవడం జరిగింది. వీటిలో ఎల్ 1గా కోల్ కతాకు చెందిన రామకృష్ణ ఫోర్జింగ్ లిమిటెడ్ నిలిచింది. ఎల్ 2గా పుణేకు చెందిన మెస్సర్స్ భారత్ ఫోర్జ్ , ఎల్ 3 గా ఎస్ ఏ ఐ ఎల్ నిలిచింది.
సీరియల్ నెంబర్ / సంస్థ / టన్ను ధర (రూపాయల్లో)
1. మెస్సర్స్ రామకృష్ణ ఫోర్జింగ్, కోల్ కతా / 1,88,100
2. మెస్సర్స్ భారత్ ఫోర్జ్, పుణే / 2,75,000
3. మెస్సర్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ / 2,89,500
.........................
బిడ్ చేజిక్కించుకున్న సంస్థ దాన్ని దక్కించుకున్న రోజునుంచి 36 నెలల్లో కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ప్రతి ఏడాది 80వేల వివిధ రకాల చక్రాలను సరఫరా చేయాల్సి వుంటుంది. వర్తించే ధరలను మూడు సంవత్సరాలపాటు ప్రతి ఏడాది 2 శాతం తగ్గించడం జరుగుతుంది. 4వ ఏడాది తర్వాతనుంచి వర్తించే ధరలను కోట్ చేసిన ధరల్లో 94శాతంగా నిర్ధారించడం జరిగింది. ఇది 20 సంవత్సరాలపాటు అమల్లో వుంటుంది. ముందే నిర్ణయించే ధరల తేడా క్లాజ్ నేది మూడు నెలలకొకసారి దరలకు వర్తిస్తుంది.
ప్రస్తుతం టన్నుకు సరాసరి ధర రూ. 1, 87,000 తీసుకొని ఎస్ ఏ ఐ ఎల్ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఎష్ ఏ ఐ ఎల్ దగ్గర 40 వేల చక్రాల తయారీ సామర్థ్యం వుంది. ఆర్ ఐ ఎన్ ఎల్ దగ్గర 80 వేల చక్రాల సామర్థ్యం వుంది. ఇది వాణిజ్యపర ఉత్పత్తిని ఇంకా ప్రారంభించాల్సి వుంది. మొత్తం ఉత్పత్తి సంఖ్య 1, 20, 000
భారతీయ రైల్వే శాఖ 1960లనుంచి ఈ ఫోర్జ్ డ్ చక్రాలను దిగుమతి చేసుకుంటోంది. బ్రిటన్, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, రొమాని, జపాన్, చైనా, ఉక్రెయిన్, రష్యా దేశాలనుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. 2022-23 సంవత్సరానికిగాను రూ. 520 కోట్ల విలువయ్యే 80 వేల చక్రాలను చైనా ,రష్యాలనుంచి దిగుమతి చేసుకోగా, మిగతా 40వేల చక్రాలను ఎస్ ఏ ఐ ఎల్ సరఫరా చేసింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండడంతో మనకు అవసరమయ్యే చక్రాలను చైనానుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వేగంగా ప్రయాణించే రైళ్ల సంఖ్య పెరుగుతుండడంతో 2026నాటికి మనకు కావాల్సిన చక్రాల సంఖ్య 2 లక్షల దాకా వుంటుందని అంచనా వేయడం జరిగింది.
***
(Release ID: 1907452)
Visitor Counter : 127