మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పాఠ్య అంశాలలో అడవులు, జల వనరుల సంరక్షణ, భూసార పరిరక్షణ అంశాలు ప్రవేశ పెట్టి పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి విద్య కోసం ప్రభుత్వం కృషి

Posted On: 15 MAR 2023 6:55PM by PIB Hyderabad

సుస్థిర అభివృద్ధి సాధన, పర్యావరణ పరిరక్షణ అంశాలను పాఠ్య అంశాల్లో భాగంగా చేసి సమగ్ర విద్యా కార్యక్రమాన్ని అమలు చేసే అంశానికి జాతీయ విద్యా విధానం(ఎన్ ఈ పి) ప్రాధాన్యత ఇస్తుంది. పర్యావరణ విద్యను పాఠశాల విద్యలో ఒక భాగంగా చేర్చాలని జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది. దీనిలో భాగంగా అడవులు, జల వనరుల సంరక్షణ,భూసార  పరిరక్షణ అంశాలను పాఠ్య అంశాలలో చేర్చాలని, పర్యావరణ విద్యను సంబంధిత దశల్లో పర్యావరణ విద్యను సమకాలీన అంశంగా ప్రవేశ  పెట్టాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది. సాంప్రదాయ భారతీయ విజ్ఞాన వ్యవస్థల విలీనం మరియు పర్యావరణానికి సంబంధించి  భారతదేశం నిర్ణయించుకున్న లక్ష్యాలు, పర్యావరణం ప్రాధాన్యత గుర్తించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పర్యావరణం పై అవగాహన కల్పించడం, స్థిరమైన అభివృద్ధి సాధించడం లాంటి అంశాలను బి.ఈడి విద్యా కార్యక్రమాల్లో చేర్చాలని జాతీయ విద్యా విధానం సూచించింది.  

జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందించడానికి  నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) కసరత్తు ప్రారంభించింది.  జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందించడానికి  జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ల అభివృద్ధి ప్రక్రియను ప్రారంభించింది, ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు , రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వివిధ సంస్థల నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సమాచారం సేకరించింది. 

సుస్థిర జీవన శైలిని అలవరచుకోవడానికి దోహద పడే పర్యావరణహిత జీవన శైలి కోసం రూపొందిన మిషన్ లైఫ్ (పర్యావరణహిత జీవన శైలి) అమలులోకి వచ్చింది. అవసరాల మేరకు సహజ వనరులను వినియోగించేలా చూసే విధంగా జీవన శైలి ఉండాలని మిషన్ లైఫ్ నిర్దేశిస్తుంది. మిషన్ అమలులో భాగంగా పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీనికోసం  క్విజ్ పోటీలు, వెబ్‌నార్లు, ప్రదర్శనలు, పోస్టర్/పెయింటింగ్ పోటీలు, ర్యాలీలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు , అంతర్జాతీయ అటవీ దినోత్సవం వంటి వివిధ ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సీబీఎస్ఈ , నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నిపుణులతో చర్చలు ఏర్పాటు చేస్తున్నాయి. పీఎం ఈ-విద్య ఛానళ్ల ద్వారా వివిధ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 

జలవనరుల ప్రాధాన్యత, జలవనరుల పరిరక్షణకు సంబంధించిన వివిధ సమస్యలు, ఆలోచనలు లాంటి అంశాలు  ఇప్పటికే ఉన్న పాఠశాల పాఠ్యాంశాల్లో ఇప్పటికే చేర్చబడ్డాయి. అందుకని, దీనిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పర్యావరణంపై అభివృద్ధి చేసే అంశాలను  పాఠశాల విద్యలో వివిధ  దశలలో పొందుపరుస్తారు. VI - XII తరగతుల నుంచి సైన్స్ పాఠ్యపుస్తకాలలో పర్యావరణ సమస్యలు, భావనలు మరియు సమస్యలకు సంబంధించిన అధ్యాయాలు ఉంటాయి . సామాజిక శాస్త్రం, భాషా పాఠ్యపుస్తకాలు పర్యావరణానికి సంబంధించిన అంశాలను బోధిస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం పర్యావరణ విద్యకు సంబంధించిన సప్లిమెంటరీ మెటీరియల్‌లను కూడా  ఎన్‌సిఇఆర్‌టి  సిద్ధం చేసింది.

 

ఈ సమాచారాన్ని విద్యా శాఖ సహాయ  మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి  ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు. 



(Release ID: 1907441) Visitor Counter : 186


Read this release in: English , Urdu