రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మెరుగైన పర్యవేక్షణ, సమన్వయానికి 100 స్మార్ట్ నగరాల్లో సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు
Posted On:
15 MAR 2023 4:09PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, 25 జూన్ 2015న స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్.సి.ఎం)ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జనవరి 2016 నుండి జూన్ 2018 వరకు 4 రౌండ్ల పోటీల ద్వారా 100 స్మార్ట్ సిటీలు ఎంపిక చేయబడ్డాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద, మొత్తం 100 స్మార్ట్ సిటీలలో ఐసీసీసీలు (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు) అందుబాటులోకి వచ్చాయి. ఇవి అభివృద్ధి కోసం నిర్ణయాత్మక మద్దతు వ్యవస్థతో పౌరుడి జీవన నాణ్యత పెంపొందించేందుకు గాను నగరాల మెదడు మరియు నాడీ కేంద్రంగా పనిచేయాలని భావించబడ్డాయి. ట్రాఫిక్ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి పంపిణీ నిర్వహణ వంటి అంశాలలో మెరుగైన పర్యవేక్షణ, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో ఈ ఐసీసీసీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి మెరుగైన నిర్వహణ కోసం స్మార్ట్ సిటీ ఐసీసీసీలు మరియు సంబంధిత స్మార్ట్ మౌలిక సదుపాయాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించబడ్డాయి. రియల్-టైమ్ డేటాను తక్కువగా ఉపయోగించుకొని మరింతగా గరిష్ఠంగా లబ్ది పొందేందుకు.. కేంద్రీకృత పర్యవేక్షణ మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో నగరాలను చేర్చడం, సామర్థ్యం మరియు ఆవిష్కరణల వైపు నడిపించడంలో కూడా ఈ కేంద్రాలు సహాయపడతున్నాయి. మొత్తం 100 ఐసీసీసీలలో 30 ట్రాఫిక్ నిర్వహణ మరియు రవాణా సమస్యలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు సంబంధించిన ‘అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్’ (ఏటీసీఎస్), ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్), రెడ్ లైట్ ఉల్లంఘన గుర్తించే (ఆర్ఎల్వీడీ), ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ (ఏఎన్పీఆర్) అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్, సూరత్, ఛండీగఢ్, కాన్పూర్, లూథియానా, నాసిక్, సహరాన్‌పూర్, ఉజ్జయిని, విశాఖపట్నం వంటి పలు నగరాలు ఐసీసీసీలలో భాగంగా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను స్వీకరించాయి. స్థానిక ప్రతిభావవంతులు/స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రవాణా 4 ఆల్ ఛాలెంజ్ (టీ4ఆల్)ను 15 ఏప్రిల్ 2021న ప్రారంభించింది. పౌరులందరి అవసరాలకు మెరుగైన సేవలందించేందుకు ప్రజా రవాణాను మెరుగుపరిచే పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి నగరాలు, పౌర సమూహాలు మరియు స్టార్టప్‌లను ఒకచోట చేర్చడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ట్రాఫిక్ ఉల్లంఘనలు/ చలాన్ల డేటా, ఇ-చలాన్ల ఉత్పత్తి మొదలైనవి స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (జీఎంఐఎస్) కేంద్రంగా నిర్వహించబడతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఐటిఎంఎస్ ద్వారా నగరం/ స్థానం వారీగా మరియు సంవత్సరం వారీగా చలాన్‌ల గణాంకాలు అనుబంధం – ఎ లో వివరంగా అందించబడినాయి.
***
(Release ID: 1907384)
Visitor Counter : 121