అంతరిక్ష విభాగం

గగన్‌యాన్ మిషన్ లక్ష్యాలను సాధించేందుకు రూ.9,023 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్, హ్యాబిటబుల్ క్రూ మాడ్యూల్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్, క్రూ ఎస్కేప్ సిస్టమ్, గ్రౌండ్ స్టేషన్ నెట్‌వర్క్, క్రూ ట్రైనింగ్ అండ్ రికవరీ కోసం ఇస్రో స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 15 MAR 2023 5:30PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్‌ సైన్సెస్‌ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ గగన్‌యాన్ మిషన్ లక్ష్యాలను సాధించేందుకు రూ. 9023 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు తెలిపారు.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు  డాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇస్తూ.. గగన్‌యాన్ కార్యక్రమం  పరిధి లో ఎర్త్‌ ఆర్బిట్‌కు మానవసహిత అంతరిక్షయాన సామర్థ్యాన్ని ప్రదర్శించడం మరియు సురక్షితంగా తిరిగి రావడం అని చెప్పారు. ఇందుకోసం హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్, హ్యాబిటబుల్ క్రూ మాడ్యూల్, లైఫ్ సపోర్ట్ సిస్టం, క్రూ ఎస్కేప్ సిస్టమ్, గ్రౌండ్ స్టేషన్ నెట్‌వర్క్, క్రూ ట్రైనింగ్ అండ్ రికవరీ కోసం ఇస్రో స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ సాంకేతికతలు గగన్‌యాన్ మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు మరిన్ని అంతర్ గ్రహ మిషన్‌లను చేపట్టడానికి కీలకమని మంత్రి తెలిపారు.

భారతదేశంలోని అంతరిక్ష రంగంలో ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడానికి, ప్రారంభించేందుకు, అధికారం ఇవ్వడానికి మరియు పర్యవేక్షించడానికి సింగిల్ విండో ఏజెన్సీగా ప్రభుత్వం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్‌-స్పేస్‌)ని సృష్టించింది. ఐఎన్‌-స్పేస్‌ ప్రైవేట్ కంపెనీలు / స్టార్ట్-అప్‌లకు, ఇస్రో క్యాంపస్‌లలో సౌకర్యాల ఏర్పాటు, ఉపగ్రహాల ప్రయోగం మరియు లాంచ్ వెహికల్స్ మరియు మెంటర్‌షిప్ సపోర్ట్‌ను సులభతరం చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఐఎన్‌-స్పేస్‌ స్పేస్ సెక్టార్‌లోని 160 కంటే ఎక్కువ ఎన్‌జీఈల నుండి దరఖాస్తులను స్వీకరించింది.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..దేశంలో అంతరిక్ష రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని అన్నారు. స్పేస్ డొమైన్‌లోని అన్ని వర్టికల్స్‌లో ఎండ్-టు-ఎండ్ కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతించడం ద్వారా స్పేస్ సెక్టార్‌లో ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్ మెరుగైన భాగస్వామ్యం కోసం ఈ రంగం ఇప్పటికే తెరవబడింది. ఈ విషయంలో ప్రభుత్వేతర సంస్థల ప్రమోషన్ మరియు హ్యాండ్‌హోల్డింగ్ కోసం
ఐఎన్‌-స్పెస్‌ సృష్టించబడింది.

అంతరిక్ష కార్యకలాపాల నిర్వహణ పట్ల వాణిజ్య ఆధారిత విధానాన్ని ముందుకు తీసుకురావడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ [ఎన్‌ఎస్‌ఐఎల్] పాత్ర కూడా విస్తృతం చేయబడింది. అంతేకాకుండా, అనేక ప్రైవేట్ పరిశ్రమలు కూడా ఇస్రో నేతృత్వంలోని భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి గణనీయంగా సహకరిస్తున్నాయి. ఉపవ్యవస్థలు మరియు భాగాలను పంపిణీ చేస్తున్నాయి. అంతరిక్ష శాఖ మొత్తం అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు మరింత ప్రోత్సాహాన్ని అందించే సమగ్రమైన, విస్తృతమైన అంతరిక్ష విధానాన్ని రూపొందించే ప్రక్రియలో ఉంది.

 

<><><><><>



(Release ID: 1907377) Visitor Counter : 247


Read this release in: English , Marathi , Manipuri , Tamil