సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
సీనియర్ సిటిజన్లకు ప్రామాణిక సేవల కోసం నమూనా
తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమం (సవరణ) బిల్లు, 2019 లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.
प्रविष्टि तिथि:
15 MAR 2023 4:39PM by PIB Hyderabad
సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతున్న కారణంగా తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 అమలులోకి వచ్చింది. చట్టంలోని నిబంధనలను సక్రమంగా అమలు చేయడం కోసం, రాష్ట్ర-నిర్దిష్ట క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, వారి సంబంధిత రాష్ట్ర నియమాలను తెలియజేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు/ యూ టీ లకు నమూనా నిబంధనలను (మోడల్ రూల్స్) పంపిణీ చేసింది. దశాబ్దానికి పైగా ఈ చట్టం అమలులో ఉంది. వివిధ లబ్దిదారుల నుండి స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా, చట్టం యొక్క నిబంధనలను మరింత సమకాలీనంగా మరియు ప్రభావవంతంగా చేయడానికి తగిన విధంగా సవరించడం సముచితమని కనుగొనబడింది. అందువల్ల, మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ జీ ఓ లు మరియు ఈ రంగంలోని నిపుణులతో సరైన సంప్రదింపుల తర్వాత, తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ (సవరణ) బిల్లు, 2019ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణస్వామి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
******
(रिलीज़ आईडी: 1907254)
आगंतुक पटल : 173