వ్యవసాయ మంత్రిత్వ శాఖ

సన్నకారు రైతులకు సాధికారత కల్పించి దేశ జీడీపీ లో వృద్ధి సాధించవచ్చు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి


" రైతుల్లో 85% వరకు ఉన్న సన్నకారు రైతులు ప్రైవేట్ పెట్టుబడి లభించకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు": శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

2047 నాటికి అమృత్ కాల కాలంలో 5 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ లక్ష్య సాధనలో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుంది.. శ్రీ తోమర్

కిసాన్ తక్ ఛానల్ ప్రారంభించిన తోమర్

Posted On: 14 MAR 2023 4:30PM by PIB Hyderabad

సన్నకారు  రైతులకు సాధికారత కల్పించడం ద్వారా భారతదేశ జీడీపీని ఎక్కువ చేయవచ్చునని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్  అన్నారు. న్యూఢిల్లీలో , ఇండియా టుడే గ్రూప్ ఛానల్ కిసాన్ తక్  వెబ్ సైట్ ను ఈరోజు శ్రీ తోమర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ తోమర్ దేశంలో సన్నకారు రైతులు 85 శాతం ఉన్నారన్నారు.  ప్రైవేటు పెట్టుబడులు లేకపోవడంతో సన్నకారు రైతులు సమస్యలు  వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని పేర్కొన్న శ్రీ తోమర్  భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో  వ్యవసాయ రంగం కీలక పాత్ర కలిగి ఉందన్నారు.  

సన్నకారు రైతులను  ఆర్థికంగా బలోపేతం  చేయాలన్న లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం రూ.6,865 కోట్ల వ్యయంతో 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్ పీవో) లను ఏర్పాటు చేయడానికి  ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందని  శ్రీ తోమర్ తెలిపారు. మైదాన ప్రాంతాల్లో 300 మంది రైతులు కలిసి ఒక  ఎఫ్ పీవో ను , కొండ, ఈశాన్య ప్రాంతాల్లో 100 మంది రైతులు కలిసి ఒక  ఎఫ్ పీవో ను ఏర్పాటు చేసుకోవచ్చు. నూతన  సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన  ఎరువులు,విత్తనాలు, పరికరాలు సమకూర్చుకోవడానికి    రైతు ఉత్పత్తిదారుల సంస్థ కృషి చేస్తుందన్నారు. కలిసి వ్యవసాయం చేయడం వల్ల  దిగుబడి పెరిగి రైతు ఆదాయం పెరుగుతుంది. 

వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయల అంచనాలతో ఆత్మనిర్భర్ ప్యాకేజీ రూపొందించిందని శ్రీ తోమర్ తెలిపారు. దీనిలో ఉద్యాన రంగానికి 15,000 కోట్ల రూపాయలు, మత్స్య రంగానికి 20,000 కోట్ల రూపాయలు, ఔషధ వ్యవసాయ రంగానికి 4,000 కోట్ల రూపాయలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించామని శ్రీ తోమర్ వివరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 1,25,000 కోట్ల రూపాయలు కేటాయించిందని శ్రీ తోమర్ అన్నారు. 2013-14 లో వ్యవసాయ బడ్జెట్ 21,000 కోట్ల రూపాయలుగా ఉందన్నారు.  పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా 11.5 కోట్ల మంది రైతులకు రూ.2,40,000 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.

వడ్డీ వ్యాపారుల బారి నుంచి రైతులకు విముక్తి కలిగించడానికి  గత తొమ్మిదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం మొత్తం రూ.20 లక్షల కోట్ల స్వల్పకాలిక రుణాలు అందించిందని శ్రీ తోమర్ తెలిపారు. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు ఆహారధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు. గత ఏడాది 4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని శ్రీ తోమర్ తెలిపారు.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయ ఎగుమతులు జరగడం ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో భారతదేశం త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని శ్రీ తోమర్ తెలిపారు.,2047 నాటికి అమృత్ కాల సమయంలో అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందని శ్రీ తోమర్ అన్నారు. గడచిన 8-9 సంవత్సరాల కాలంలో  ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో కేంద్ర  వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక పథకాలు రూపొందించి అమలు చేసిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు రైతులకు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలిగించాయన్నారు.  ఆకలిని ప్రపంచం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత నేడు భారత వ్యవసాయ రంగం, భారతదేశానికి చెందిన  రైతులు స్వీకరించాల్సి ఉంటుందన్నారు.ఒకప్పుడు ఆహార ధాన్యాలు దిగుబడి చేసుకున్న భారతదేశం నేడు ఆహార ధాన్యాల  దేశంగా అభివృద్ధి సాధించడంతో సమస్య పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు సమస్య పరిష్కారం కోసం భారతదేశం వైపు ఎదురు చూస్తున్నాయని శ్రీ తోమర్ అన్నారు. 

 ఆహార ధాన్యాలు అందించడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉపాధిని కూడా వ్యవసాయ రంగం కల్పిస్తుందని శ్రీ తోమర్ అన్నారు. రైతుల కృషి, శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాల వల్ల దేశంలో ఆహార ధాన్యాలకు ఎటువంటి కొరత లేదని పేర్కొన్న శ్రీ తోమర్    ప్రపంచ అవసరాలను తీర్చగల స్థితిలో భారతదేశం ఉందన్నారు.  . వ్యవసాయంలో సాంకేతిక వినియోగం ఎక్కువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తుందని శ్రీ తోమర్ అన్నారు. మౌలిక సదుపాయాల్లో లోటుపాట్లను పూడ్చేందుకు .లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో  ఎగ్రి ఇన్ ఫ్రా నిధిని, అనుబంధ రంగాలకు .50,000 కోట్ల రూపాయలను అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని శ్రీ తోమర్  తెలిపారు.  రైతులకు జరిగిన నష్టాన్నిభర్తీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో కేంద్రం ప్రారంభించిందన్నారు.  రైతులకు భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తున్నామని తెలిపిన మంత్రి దీని ద్వారా ఇప్పటివరకు రూ.1.30 లక్షల కోట్ల క్లెయిమ్లను పరిష్కరించామని   తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణంగా కనీసం రూ.20 లక్షల కోట్లు అందేలా చూడాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారని శ్రీ తోమర్ తెలిపారు. 

గో ఆధారిత ప్రకృతి సేద్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని శ్రీ తోమర్ తెలిపారు. ఈ దిశలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు అమలు జరుగుతున్నాయన్నారు.   ప్రధాని మోదీ చొరవతో 2023 సంవత్సరాన్ని  ఐక్యరాజ్యసమితి   అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (శ్రీ అన్న)గా ప్రకటించిందన్నారు. 2023 మార్చి 18న ఢిల్లీలో శ్రీ అన్న పై ఒక ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం జరుగుతుందని దీనికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని శ్రీ తోమర్ అన్నారు. . దేశంలో, ప్రపంచంలో చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగితే సన్నకారు  రైతులకు మేలు జరుగుతుందని శ్రీ తోమర్ అన్నారు. 

 

****



(Release ID: 1907012) Visitor Counter : 414


Read this release in: English , Urdu , Hindi , Tamil