రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తీర ప్రాంత భద్రతకు ఉమ్మడి కమ్యూనికేషన్ వ్యవస్థ

Posted On: 13 MAR 2023 2:57PM by PIB Hyderabad

దేశ తీరప్రాంత భద్రతకు వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం సరిహద్దు నిర్వహణ విభాగం (బీఎం-II డివిజన్) / గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉమ్మడి కమ్యూనికేషన్ ప్లాన్ (కాంప్లాన్) వ్యవస్థను ప్రకటించబడింది. ఈ కాంప్లాన్ వ్యవస్థ కింది వివిధ ఏజెన్సీలు సమన్వయం చేయబడుతాయి:

                        01. భారత తీర్ర ప్రాంత గస్తీ దళం

02. భారత నావికాదళం

03.. రాష్ట్ర మెరైన్ పోలీస్/ రాష్ట్ర పోలీస్

04.  కస్టమ్స్/ఇమ్మిగ్రేషన్

05. సీఐఎస్ఎఫ్ / బీఎస్ఎఫ్

                         06. డీజీ షిప్పింగ్

                         07. మత్స్య శాఖ

                         08. ఓడ రేవులు/ రాష్ట్ర సముద్ర తీర బోర్డులు

09. అటవీ & పర్యావరణ శాఖ

10. రాష్ట్రం/ యుటీ పరిపాలన వ్యవస్థ

11. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు

12. ఆయిల్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు

13. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

14. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్‌హౌస్ మరియు లైట్‌షిప్

15. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్

అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, ఐఎంబీఎల్ అంతటా మత్స్యకారుల పరిధులను అతిక్రమించడం, ఆఫ్‌షోర్ టెర్మినల్స్ భద్రత మరియు రక్షణ మొదలైనవి భారత తీర ప్రాంత భద్రతకు పొంచి ఉన్న ప్రధాన ముప్పులలో కొన్ని. ఈ రోజు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ రాజ్యసభకు ఇచ్చిన  లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 *******


(Release ID: 1906782)
Read this release in: English , Urdu